Nuvvunte Naa Jathaga Serial Today May 8th: నువ్వుంటే నా జతగా సీరియల్: బేబీ బామ్మకు నిజం చెప్పేసిన భాను.. మిథున విషయంలో రచ్చ గ్యారెంటీ!
Nuvvunte Naa Jathaga Today Episode మిథునని దేవా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని బామ్మతో భాను నిజం చెప్పేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తి కరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున చేసిన వంట ఇంటిళ్లపాది తింటారు. దేవా, మిథునల్ని ఒకరిని ఒకరు తినిపించుకోమని బేబీ బామ్మ చెప్తుంది. దేవా ఇష్టం లేకుండానే మిథునకు తినిపిస్తాడు. బామ్మకి నిజం చెప్పేయాలి అని కాంతం అనుకుంటుంది. కానీ మనం చెప్తే ప్రాబ్లమ్ అవుతుంది అని రంగం కాంతాన్ని ఆపేస్తాడు.
కాంతం నీరు తీసుకురావడానికి బిందె పట్టుకొని వెళ్లి బామ్మని తిట్టుకుంటుంది. మిథున కాంతం దగ్గరకు వెళ్లి కాంతం అక్కాయ్ ఇక్కడ తమలపాకులు ఎక్కడ దొరుకుతాయ్ అని అడుగుతుంది. దానికి కాంతం మా ఊరిలో దొరుకుతాయి వెళ్లి తీసుకురానా అంటుంది. అంత వెటకారం వద్దని మిథున అంటుంది. ఇక కాంతం బిందె పట్టుకొని పడిపోబోతే మిథున పట్టుకొని జాగ్రత్త అక్క పడితే పళ్లు రాలతాయ్ అంటుంది. బిందె పట్టుకున్న వంకతో నన్ను కొడతా అంటావా నా రేంజ్ తెలుసా నీకు. నా చీరు ధరలో పావు ఉంటుంది నీ చీర.. నా చెప్పుల దరలో పావు ఖరీదు నీ చెప్పులు నా రేంజ్ ఏంటి నీ రేంజ్ ఏంటి నా దగ్గర ఓ పని మనిషిలా ఉండే నువ్వు నన్ను కొడతా అంటావా అంటుంది. ఇంతలో మిథున తల్లి కారులో వస్తుంది.
ఇద్దరూ సెక్యూరిటీ వాళ్లు దిగుతారు. అది చూసిన కాంతం పడవంత కారు గొడుగు పట్టుకోవడానికి ఒకరు. నీరు ఇవ్వడానికి ఒకరు ఈ మిథున మేడంది నిజంగానే యువరాణి రేంజ్ మనమే అనవసరంగా పని మనిషి స్థాయి అని ఓవర్ చేశాం ఆ కారు తుడవడానికి కూడా పనికి రాని దరిద్రం మనది అని తనని తాను తిట్టుకుంటుంది. మిథున తల్లిని పలకరిస్తుంది. ఇంటికి వెళ్దామని అంటే లలిత ఇప్పుడు వద్దు అంటుంది. ఇద్దరూ పక్కనే ఉన్న ఇంటి గట్టు మీద కూర్చొని మాట్లాడుకుంటారు. తండ్రి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మిథున చాలా సంతోషిస్తుంది. ఫొటోలు మిథున పంపడంతో అవి చూడగానే సంతోషం అనిపించి వచ్చానని అంటుంది. అమ్మమ్మగారి రాకతో త్వరలోనే ఆ ఇంటి కోడలిని దేవా భార్య స్థానాన్ని దక్కించుకుంటాననే నమ్మకం వచ్చేసిందని మిథున అంటుంది.
మరోవైపు పురుషోత్తం దేవా మారిపోయాడని అనుకొని కోపంతో రగిలిపోతాడు. తన రాజకీయ జీవితానికి ఇబ్బంది వస్తుందని కోపంతో అన్నీ విసిరేస్తాడు. లాయర్ పురుషోత్తాన్ని కూల్ చేసి దేవా వచ్చిన తర్వాత లౌక్యంతో మాట్లాడు అని చెప్తాడు. ఇంతలో దేవా వస్తాడు. పురుషోత్తం కూల్ అయిపోయి మాట్లాడుతాడు. ఈ మధ్య నీలో చాలా మార్పు కనిపిస్తుందని ఇంతకు ముందు ఉదయమే వచ్చేవాడివి ఇప్పుడు రావడంలేదు అంటాడు. దానికి దేవా ఊరు నుంచి నానమ్మ వచ్చిందని రావడంలేదు అంటాడు. నువ్వు బయటకు ఎక్కడికీ రాలేదా అని అంటాడు. దేవా లేదు అంటాడు. వాళ్లు మార్కెట్లో సీన్ గుర్తు చేసుకుంటారు. దేవా అబద్ధం చెప్తున్నాడని అనుకుంటారు. దేవాతో నువ్వు నా దగ్గర కొన్ని విషయాలు దాస్తున్నావ్ అని అంటాడు. మిథునని పంపేయమని చెప్పాను కదా ఆ ప్రయత్నం ఎంత వరకు వచ్చిందని అంటాడు.
దేవా వారం గడువు అడుగుతాడు. తన నానమ్మ ఇద్దరికీ నిజంగా పెళ్లి అయిందని అనుకుంటుందని అంటాడు. మీ నానమ్మ బాధ పడుతుంది అనా లేదంటే ఇంకేమైనా కారణం ఉందా.. మిథున అంటే నీకు ఇష్టం ఉన్నట్లు ఉందని అంటాడు. ఇలా ఎందుకు అంటున్నావో నాకు అర్థం కాలేదు అన్న కానీ నాకు ఉన్న శత్రువు తను మాత్రమే అని దేవా అంటాడు. వారంలో తనని పంపేస్తానని అంటాడు. రంగం, కాంతం భాను దగ్గరకు వెళ్తారు. భాను ఏడుస్తూ ఉంటే తనకు బామ్మ వచ్చిందని మిథున దేవాలది లవ్ మ్యారేజ్ అనుకుంటుందని నువ్వు నిజం చెప్తే దాన్ని తరిమేస్తుందని అంటారు. భాను వెంటనే ఇంటికి బయల్దేరుతుంది.
మిథునను బామ్మ చక్కగా చూసుకుంటూ ఉంటుంది. మనవడితో జీవితాంతం కలిసి ఉండాలని అంటుంది. ఇంతలో భాను అక్కడికి వెళ్లి బామ్మతో బేబీ అని మాట్లాడి దేవా, మిథునలకు లవ్ మ్యారేజ్ కాదు అసలు పెళ్లే కాలేదని అంటుంది. బామ్మ షాక్ అయిపోతుంది. దేవా ఓ గొడవ వల్ల మిథున మెడలో తాళి కట్టాడని.. ఇంట్లో ఎవరూ మిథునని కోడలిగా చూడటం లేదని ఎప్పుడెప్పుడు వెళ్లిపోతుందా అని చూస్తున్నారని అంటుంది. శారద భానుని తిట్టి నిజం చెప్పకుండా అడ్డుకున్నా బామ్మ భానుని నిజం చెప్పమని నిజం తెలుసుకుంటుంది. అందరూ షాక్ అయిపోతారు. బామ్మ కోపంతో మిథున అని అరుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!





















