Nuvvunte Naa Jathaga Serial Today May 2nd: నువ్వుంటే నా జతగా సీరియల్: నేను నీ ఫాలోవర్‌ని బేబీ.. మతడ పెట్టేసిన మిథున.. కాంతానికి రోకలి ట్రీట్మెంట్!
Nuvvunte Naa Jathaga Today Episode కాంతం పని చేయడం లేదని బేబీ రోకలి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథుననే తన కోసం అన్ని వంటలు చేయాలి అని బేబీ పెద్దరాయుడిలా తీర్పిస్తుంది. అందరూ తన చేతి వంటే తినాలని చెప్తుంది. అందరూ చచ్చినట్లు తన వంటే తినాలని తన మాటని ఇంట్లో ఎవరూ ఎదురు చెప్పేదే లేదని చెప్తుంది. తన ఉత్తమ కోడలి అవార్డు పోతుందేమో అని కాంతం ఏడుస్తుంది.
నేను నీ సబ్‌స్క్రైబర్‌ని బేబీ..
బేబీ మిథునతో ఇంత బాగా ఎలా పండు మిర్చి పచ్చడి చేశావ్ అని అడుగుతుంది. దానికి మిథున నేను నీ సబ్‌స్క్రైబర్‌ని బేబీ నీ ఇంటల్ని ఫాలో అవుతుంటా అని చెప్తుంది. నువ్వు నా సబ్‌స్క్రైబర్‌వా నా వంటలు చూసి నేర్చుకున్నావా.. నా మనవరాలు నేను ఎవరో తెలీకుండానే నాకు ఫ్యాన్ అయిపోయిందన్న మాట. బంగారు తల్లి నువ్వు చూడగానే నచ్చావ్ ఇప్పుడు ఇంకా నచ్చావ్ అని చెప్తుంది. మిథున బేబీ ఇద్దరూ రీల్స్, ఫొటోస్ గురించి మాట్లాడుకుంటే అందరూ నోరెళ్ల బెట్టి చూస్తారు. సత్యమూర్తి అక్కడి నుంచి లేచి వెళ్లిపోతారు.
మీరేం మాట్లాడలేదేంటి మామయ్యగారు..
శారద సత్యమూర్తి దగ్గరకు వచ్చి మీ అమ్మగారు మిథున చేతి వంటే అందరూ తినాలి అంటున్నారు ఏం చేస్తామని అంటుంది. ఇంతలో కాంతం వచ్చి మీరేం మాట్లాడలేదేంటి మామయ్యగారు.. మీరే కచ్చితంగా చెప్తారు అనుకుంటే మీరేం అనలేదు. మనం ఆ మిథునని కోడలిగా కనీసం ఓ మనిషిగా చూడటం లేదు. తనకి కనీసం తిండి కూడా పెట్టడం లేదు ఎప్పుడెప్పుడు వెళ్లిపోతుందా అని చూస్తున్నాం కానీ ఇప్పుడు అమ్మమ్మ గారు ఆవిడే మొత్తం వండాలని చెప్పారు తన చేతి వంట మనం ఎలా తింటాం అసహ్యంగా అని అంటుంది. రంగం కూడా మిథున గురించి చెప్తాడు. తనని వంట చేసే అవకాశం ఇస్తే తను శాశ్వతంగా ఉండిపోతుందని అంటాడు.
నేనేం చేయలేను..
కాంతం వచ్చి అమ్మమ్మగారితో ఆ మిథున వండదు అని చెప్పండి అంటే మా అమ్మ మాటకి ఎదురు చెప్పే ధైర్యం ఈ ఇంట్లో ఎవరికీ లేదు. నాకు మా అమ్మని బాధ పెట్టాలి అని లేదు. ఈ విషయంలో నేనేం చేయలేను. ఎవరి చేతితో మంచి నీరు కూడా తీసుకోను అనుకున్నా కానీ ఆ చేతి వంటే తినాలి ఏం చేస్తాం అంటారు. ఇక శారద కాంతంతో నువ్వు ఎంత తిన్నా కడుపులో ఇంత కుళ్లు ఉంచుకోవడం వల్లే నీకు అది వంట పట్టడంలేదని అంటుంది. కాంతం ఏడుస్తుంది.
పురుషోత్తానికి నోటీసులు..
పురుషోత్తం దగ్గరకు పోలీసులు వచ్చి 2020లో జరిగిన కేసు కోసం నోటీసులు ఇస్తారు. ఎల్లుండి విచారణకు రావాలని లేదంటే అరెస్ట్ చేస్తానని అంటారు. పురుషోత్తం షాక్ అయిపోతాడు. లాయర్ పురుషోత్తంతో హరివర్దన్ మీకు ఎలాంటి షాక్ ఇచ్చారో అర్థమైంది కదా ఆయన మీ చుట్టూ పద్మవ్యూహం అల్లుతున్నారు. మీరు ఊహించని విధంగా మిమల్ని అరెస్ట్ చేయిస్తారు. ఒకసారి ఆయనతో మాట్లాడండి అని లాయర్ సలహా ఇస్తాడు.
వంట గది బాధ్యత మొత్తం నీదే..
శారద, ప్రమోదిని మిథునకు వంట గది బాధ్యత అప్పగిస్తారు. మేం ఎవరు వచ్చానా అమ్మమ్మకి నచ్చదు ఇక మేం రామని చెప్తారు. శారద కోడలితో నీకు ఈ ఇంట్లో కోడలి స్థానం ఇవ్వడానికే ఆవిడ వచ్చారు. దేవాకి వాళ్ల నానమ్మ మాటే వేదం. ఆవిడ వెళ్లేలోపు మీ నూరేళ్ల బంధానికి బలంగా ముడి వేస్తుందని అంటుంది. మిథున చాలా సంతోషపడుతుంది.
నీ పెళ్లాం నా ఫాలోవర్‌రా..
బేబీ దేవాని కూర్చొపెట్టుకొని మాట్లాడుతుంది. నీ పెళ్లాం నా ఫాలోవర్‌రా నా వీడియోస్ అన్నింటికి లైక్‌లు కొట్టిందిరా నీ భార్యని చూసి నేర్చుకోరా అంటుంది. దానికి దేవా దానికేం పనా పాటా కూర్చొని రీల్స్ చూసుకోవడమే కదా అంటాడు. నువ్వు మరి పెద్ద కలెక్టర్‌వి అని బేబీ సెటైర్ వేస్తుంది. ఇంతలో శారద కొలాయి దగ్గర నీరు తీసుకురావడానికి వెళ్తుంది. అది బేబీ చూసి శారదని పిలుస్తుంది. ముగ్గురు కోడళ్లు ఉంటే నువ్వు వెళ్తున్నావ్ ఏంటి అంటుంది. దానికి శారద ప్రమోదిని అంట్లు తోముతుంది. మిథున వంట చేస్తుందని అంటుంది. నేను ఉన్నా కదా అమ్మ నువ్వేందుకు వెళ్తావ్ అని అంటుంది. దాంతో బేబీ ఇద్దరినీ ఆపి కాంతారా అని కాంతాన్ని పిలుస్తుంది.
కాంతారా రావే ఇటు..
కాంతారా అని బేబీ పిలిస్తే కాంతం తిట్టుకుంటూ వస్తుంది. ఇంట్లో ఏం చేస్తున్నావే అని అడుగుతుంది. కారణం లేకుండా ఎందుకు తిడతారు బేబీ అని కాంతం అంటుంది. దానికి బేబీ పొద్దున్నే పది దోసెలు తిన్నావ్ ఏం చేస్తున్నావే పంపుకి వెళ్లి నీరు తీసుకురాలేవా ఈ వయసులో మీ అత్త తేవాలా. తిండికి తిమ్మరాజు పనికి పోతురాజులా తయారయ్యావ్ అని తిడుతుంది. ఇంతలో శారద వచ్చి తనకి నీరు మోయాలి అంటే నడుం నొప్పి అత్తయ్యగారు వదిలేయండి అని ఇరికించేస్తుంది.
మిథునా కాస్తా రోకలిబండి తీసుకురా..
బేబీ అయ్యయ్యో అని ఏంటే కాంతారా నీకు నడుం నొప్పా అని అడుగుతుంది. కాంతం నడుం మీద చేతులు వేసి అవును బామ్మ అని ఓవర్ చేస్తుంది. దానికి బేబీ నీకు నడుం నొప్పి అని తెలీకుండా నిన్ను తిట్టానే సారీనే అంటుంది. నీకు నడుంనొప్పి ఎప్పుడెప్పుడు వస్తుందని అడుగుతుంది. దానికి కాంతం ఇళ్లు ఊడ్చేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, అంట్లు తోమేటప్పుడు, నీరు మోసేటప్పుడు, వంట గదిలో ఎక్కువ సేపు నిల్చొన్నా నడుంనొప్పి వస్తుందని పనులు ఉన్న అన్ని పేర్లు చెప్పేస్తుంది. నేను నీ నుడుం నొప్పి తగ్గిస్తా అని మిథునని పిలిచి రోకలి బండి తీసుకురమ్మని అంటుంది. రంగం, కాంతం నోరెళ్లబెడతారు. మిథున సరే అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: దేవేంద్రవర్మ ఎవరో తెలుసుకున్న సత్యం.. చెల్లి నిర్దోషి అని నిరూపించుకోగలడా!





















