Nuvvunte Naa Jathaga Serial Today March 4th: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవాని ఓ ఆట ఆడుకున్న మిధున.. వీడియో చూసి బిత్తరపోయిన జడ్జి
Nuvvunte Naa Jathaga Today Episode మిధున, దేవాల వీడియో సూర్యకాంతం త్రిపురకు పంపడం త్రిపుర ఇంట్లో చూపించి దేవా కొత్త ప్లాన్ చేస్తున్నాడని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున దేవా గొడవ పడతారు. మిధున దేవాతో నువ్వు నా మెడలో కట్టింది తాళి కాదు అని నువ్వు అన్నా నువ్వు నా భర్తవి, నేను నీ భార్యని ఇది చెరిగిపోని సంతకం నువ్వేం చేసినా నేను ఈ ఇంటి నుంచి వెళ్లను నువ్వు నన్ను పంపించలేవు అని చెప్తుంది. ఇక ఇద్దరి మెడలో వేసిన దండలు హాల్‌లో మేకుకు తగిలిస్తా రోజూ దండం పెట్టుకోండి పుణ్యం వస్తుంది అని సెటైర్లు వేసి వెళ్తుంది.
మిధున వెళ్తుండగా తలుపులు దగ్గర సూర్యకాంతం, శ్రీరంగం నిల్చొని మిధున దేవాల మాటలు వింటుంటారు. మిధున డోర్ తీయగానే ఇద్దరు కింద పడిపోతారు. వాళ్లని చూసిన మిధున వెటకారంగా అక్కగారు బావ గారు మీరు నా కాళ్ల దగ్గర పడటం ఏంటి అని అడుగుతుంది. ఫ్లోర్ చెక్ చేస్తున్నామని ఇద్దరూ కవరింగ్ ఇస్తారు. ముఖం పచ్చడైపోగలదు కాస్త చూసుకోండి అంటుంది. ఇక దండలను డోర్ దగ్గర పెట్టి వాటిని చూసి మురిసిపోతుంది. మిధునని తక్కువ అంచనా వేశాం అని పెద్ద రౌడీ అయిన మీ తమ్ముడిని గజగజా వణికించేసిందని తమకు ముఖం పచ్చడి అయిపోతుందని వార్నింగ్ ఇచ్చిందని అనుకుంటారు. బస్తీ వాళ్ల వెనక మిధునే ఉందని ఈ పెళ్లి హడావుడి అంతా మిధున ప్లానే అని సూర్యకాంతం అంటుంది. ఆ మాటలన్నీ మిధున వింటుంది. మిధునని చూసి ఇద్దరూ మేడం మీ గురించే మాట్లాడుకుంటున్నాం మేడం సన్మానం బాగా జరిగిందని అంటున్నాం అంటారు. దాంతో మిధున ఇంకోసారి భార్య భర్తల మాటలు వినడానికి మా మధ్యలోకి వస్తే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది.
సూర్యకాంతం భర్తతో దేవా, మిధునల సన్మానం వీడియో తీశాను అని అది ఏటీఎంకి పంపి డబ్బు సంపాదిద్దామని అంటుంది. మరోవైపు హరివర్దన్, లలితలు తలో వైపు కూర్చొని కూతురి గురించి ఆలోచిస్తారు. నేను నీకు ఏం లోటు చేశానమ్మా అపురూపంగా పెంచుకున్నాను కదా ఈ నాన్నని వదిలేసి ఎలా వెళ్లిపోయావు నాన్నని ఏడిపించాలని అని ఎలా అనిపించింది అమ్మా అని బాధ పడతాడు. మరోవైపు త్రిపుర సూర్యకాంతం పంపిన వీడియో చూస్తుంది. త్రిపుర రివర్స్‌లో కోపంలో ఉన్న ఎమోజీ పంపిస్తే కాంతం త్రిపుర డబ్బు పంపిందని సంబరపడిపోతుంది. ఆ ఎమోజీ చూసి తెగ ఫీలైపోతుంది.
త్రిపుర ఆవేశంగా మామయ్య దగ్గరకు వెళ్లి మనకు ఆ దేవా చాలా డ్యామేజ్ చేస్తున్నాడని వీడియో చూపిస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. దేవా డబ్బు కోసం నాటకాలు ఆడుతున్నాడని అంటుంది. దేవా ఆస్తి కోసం మిధునని ఏమైనా చేస్తాడేమో అని లలిత అంటే చంపేస్తా అని హరివర్థన్ కేకలేస్తాడు.. ఇలా వీడియో లీక్ చేశారు అంటే ఏదో ప్లాన్‌లోనే దేవా ఉన్నాడని రాహుల్ అంటాడు. దేవాతో పాటు వాడి ఫ్యామిలీ మొత్తం నాశనం చేయి అయినా నా కూతుర్ని తెచ్చుకుంటానని అంటాడు. ఇక మిధున తనకు దేవాకు జరిగిన సన్మానం గురించి తలచుకొని సంతోష పడుతుంది. ఇంతలో మిధునకు నానమ్మ కాల్ చేస్తే మిధున చాలా సంతోష పడుతుంది. తను ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను అంటే కారణం నాకు తెలుసు అని బామ్మ అంటుంది. సన్మానం గురించి చెప్తుంది. మీకు ఎలా తెలుసు అని మిధున అడిగితే మీ వదిన వీడియో చూపించిందని చెప్తుంది.
ఇక మిధున దేవా గురించి బామ్మకి చెప్తుంది. ఎప్పుడూ మూతి ముడుచుకొని ఉంటాడు. నవ్వడు అని నా ముఖం మాడ్చుకొని ఉన్నాడని నవ్వు ఆపుకున్నా అని దేవా ముఖం గుర్తొచ్చే పిచ్చిగా నవ్వొస్తుందని నవ్వుతుంది. మిధున మాటలు విని దేవా రగిలిపోతాడు. వస్తువులన్నీ కింద పడేస్తాడు. మిధున నానమ్మతో ఎలుక వచ్చింది అందుకే సౌండ్ అని సెటైర్లు వేస్తుంది. పాపం ఎలుక పిల్ల అంటుంది దేవా కోపంతో వెళ్లిపోతాడు. తర్వాత మిధున నానమ్మతో మీ మనవడు ఎలుక కాదు అని చెప్తుంది. మనవడిని ఆట పట్టించకమ్మా అని బామ్మ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: చెల్లిని చావగొట్టిన దీప.. కన్నకూతురి చెంప పగలగొట్టిన సుమిత్ర.. దీప విశ్వరూపం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

