Nuvvunte Naa Jathaga Serial Today March 28th: నువ్వుంటే నా జతగా సీరియల్: ఇరువురి భామల బిందెలో దేవా ఇరుక్కుంటాడా.. కరెంట్ రచ్చ ఖాయం.. అత్త మీద ప్రమోదిని రివర్స్!
Nuvvunte Naa Jathaga Today Episode కరెంట్ లేకపోవడం వీధిలోకి వెళ్లి నీరు తీసుకురమ్మని శారద ప్రమోదినికి చెప్పడం ప్రమోదిని అత్త మీద అరవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా ఫోన్ వల్లే టార్చర్ అని దాన్ని కింద పడేయబోతే మిధన దేవా కాళ్లకి అడ్డంగా కాలు పెడుతుంది. దాంతో దేవా పడిపోయి ఫ్యాన్ ఎగరడంతో మిధున ఫ్యాన్ పట్టుకుంటుంది. పర్మిషన్ లేకుండా ఫ్యాన్ తీసుకోవడం తప్పే అని రాత్రి నువ్వు చేసిన విన్యాసాలు అన్నీ చూశానని నిద్ర పోలేదు మెలకువతోనే ఉన్నానని మిధున అనగానే రాక్షసి చంపేస్తుందని అనుకుంటాడు. దేవా తల బాదుకుంటే భర్త గారు మీరు మీ చిలిపి అని వెటకారం చేస్తుంది. దేవా తన అరచేతిని చూస్తూ ఏం బతుకురా నీది ఇప్పటికే తాళి కట్టినందుకు టార్చర్ అనుభవిస్తూ ఇంకా ఫ్యాన్ కొట్టేయడానికి సిగ్గు లేదా అనుకుంటాడు.
సూర్యకాంతం ముఖానికి ఫేస్ ప్యాక్ పిండి రాసుకొని అద్దంలో చూసుకొని మురిసిపోతూ ముఖం కడుక్కోవడానికి ట్యాప్ అన్ చేస్తుంది. వాటర్ రాకపోవడంతో నీరు రావడం లేదు ఏంటా అనుకుంటుంది. ఇక శారద బట్టలు ఉతకడానికి తీసుకెళ్లి నీరు రావడం లేదు అనుకుంటుంది. ఇంటి మొత్తం నీరు రావు అందరూ ఏంటి వాటర్ రావడం లేదు అనుకుంటారు. మిధున వచ్చి రాత్రి నుంచి కరెంట్ లేదు కదా అందుకే ట్యాంక్‌లో నీళ్లు అయిపోయావి అనుకుంటారు. ఆనంద్ తల దించుకుంటూ దిక్కులు చూడటంతో ప్రమోదిని భర్తని అనుమానంగా చూస్తుంది. సత్యమూర్తి కరెంట్ ఆఫీస్‌కి వెళ్లి కనుక్కుంటానని ఇంతలో అందరూ వీధి కొలాయికి వెళ్లి తలో బిందె వాటర్ తీసుకురమ్మని చెప్తారు. సత్యమూర్తి వెళ్లగానే వీధిలోకి వెళ్లి నీరు తీసుకురాకుండా తప్పించుకోవడానికి కాంతం నడుం నొప్పి అని నాటకం ఆడుతుంది. శ్రీరంగం భార్యకి సపోర్ట్ చేసి గదిలోకి తీసుకెళ్లిపోతాడు.
శారద ప్రమోదినికి రెండు బిందెల నీళ్లు తీసుకురమ్మని అంటే నాకు అన్ని చేతులు కాళ్లు లేవు ఇంటి పని చేస్తూ బయట పని చేయడం అంటే నా వల్ల కాదు అని భర్తని చూసి అంటుంది. నేనే తీసుకొస్తానని శారద వెళ్తుంటే అమ్మా నేను తీసుకొస్తానని మిధున వెళ్తుంది. శారద వద్దు అన్నా మిధున మీ ఆరోగ్యం బాలేదు కదా నేను తీసుకొస్తా అని తాను వెళ్తుంది. మిధున వీధి పంపు దగ్గరకు వెళ్తే అక్కడున్న బామ్మలు కూర్చొని అమ్మ నువ్వు దేవా భార్యవా అంటే అవును అంటుంది. ఏమైనా విశేషమా అంటే అవును మా ఇంట్లో రాత్రి నుంచి కరెంట్ లేదు అని చెప్తుంది. అందరూ నవ్వుతారు. తర్వాత నీళ్లోసుకున్నావా అంటే వాటర్ లేవు స్నానం చేస్తాను అంటే అందరూ నవ్వి విషయం చెప్తారు. ఇక నువ్వు ఎందుకు అమ్మా నీటికి వచ్చావ్ మీ అత్త పంపిందా ఆపలేదా అంటే వద్దన్నా నేనే వచ్చానని మిధున అంటుంది. అందరూ మిధునని పొగుడుతారు. నీవు రావడం వాళ్ల అదృష్టం అని అంటారు. మిధున చాలా సంతోషిస్తుంది.
మిధునని చూసిన భానుమతి నా మాటలతో నీకు చిన్న జలక్ ఇస్తాను చూడు అనుకొని మిధున దగ్గరకు వెళ్తుంది. ఇంట్లో ఎవరూ నిన్ను కోడలిగా చూడటం లేదని.. దేవా నిన్ను చూస్తేనే అసహ్యించుకుంటున్నాడని నువ్వు పని మనిషిలా పనులు చేయడం తప్ప ఈ జన్మలో నిన్ను భార్యగా ఒప్పుకోడని దేవాకి భార్య అయినా ఆ ఇంటి కోడలు అయినా నేనే అని భానుమతి అంటుంది. దేవాతో తాళి కట్టించుకొని నా రాజాతో నీ మెడ పట్టుకొని గెంటేలా చేస్తానని మిధునతో భాను అంటుంది. మిధున బిందె భానుకి ఇచ్చి గట్టిగా నవ్వి నీ పగటి కలలకు నవ్వొస్తుందని అంటుంది. దేవా తనకు భార్య స్థానం ఇచ్చేశాడని అందరి ముందు బయట పడటం లేదని చెప్తుంది. ఇంతలో దేవా ఫోన్ మాట్లాడుకుంటూ అటుగా వస్తే మిధున సైగ చేసి భానుకి చూపిస్తుంది. నా కోసమే వచ్చాడని నిరూపిస్తా చూస్తూ ఉండు అని అంటుంది. ఆ బిందెను ఇంటి వరకు దేవానే తీసుకెళ్లేలా చేస్తానని మిధున అంటుంది. అంత సీన్ లేదని భాను నవ్వుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్య ఇంటికి ఫైల్‌తో విరూపాక్షి.. జీవన్, మాధవిల ప్లాన్ ఫలిస్తుందా!





















