Nuvvunte Naa Jathaga Serial Today March 14th: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా శత్రువులు సత్యమూర్తిని చంపేస్తారా.. జడ్జిని రంగంలోకి దించిన మిధున ప్లాన్ ఏంటి?
Nuvvunte Naa Jathaga Today Episode సత్యమూర్తిని కాపాడటానికి మిధున అన్ని రకాలుగా ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode సత్యమూర్తిని చంపడానికి దేవా శత్రువు అయిన సాంబ తన మనుషులతో కలిసి గుడికి వెళ్తాడు. గతంలో శారద తనని చంపడానికి వచ్చిన ఓ రౌడీని కాపాడి సపర్యలు చేయడంతో ఆ రౌడీ కృతజ్ఞతగా దేవా ఇంటికి వచ్చి శారదకు నిజం చెప్పాలి అనుకుంటాడు. హెల్మట్ పెట్టుకొని రౌడీ రావడంతో మిధున రౌడీని పట్టుకొని నిలదీస్తుంది. రౌడీ శారద, మిధునలతో సత్యమూర్తిని తన అన్న చంపబోతున్నాడని చెప్తాడు. శారద, మిధున ఇద్దరూ షాక్ అయిపోతారు.
సత్య మూర్తి గుడిలో ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక రౌడీ తాను చెప్పాను అని చెప్పొద్దని రౌడీలు ఇప్పటికే గుడికి వెళ్లారని సార్‌ని కాపాడుకోండి అని చెప్పి వెళ్లిపోతాడు. భర్త ప్రాణాలను ఎలా కాపాడుకోవాలని ఏడుస్తుంది. భయపడొద్దు దేవాకి చెప్తానని మిధున అత్తకు చెప్తుంది. ఆయనకు ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను అని శారద గుడికి పరుగులు తీస్తుంది. రౌడీలు సత్యమూర్తిని ఫాలో అవుతూ ఈయన్ని చంపేస్తే ఆ దేవా కుమిలి కుమిలి ఏడుస్తాడని అదే దేవా ఏడ్వడమే నాకు కావాలని అనుకుంటాడు. మిధున దేవాకి ఎన్ని సార్లు కాల్ చేసినా దేవా మిధునని తిట్టుకొని ఇరిటేట్ అయి ఫోన్ ఎత్తడు. ఇక శారద ఆటోలో వెళ్తూ తన భర్తని కాపాడు స్వామీ అని దండం పెట్టుకొని ఆటో అతన్ని త్వరగా వెళ్లమని అంటుంది.
దేవా తన ఫ్రెండ్స్‌తో మిధున టార్చర్ పడలేకపోతున్నా అని స్నానానికి నీరు పెడతా అని అన్నం వడ్డిస్తా అని చంపుకుతింటుందని.. కాలికి దెబ్బ తగిలితే కట్టు కట్టి బయటకు వెళ్లనివ్వడం లేదని చెప్తాడు. దానికి దేవా ఫ్రెండ్ అదంతా వదినకు నీ మీద లవ్ అని అంటారు. మిధున మళ్లీ ఫోన్ చస్తే దేవా తన ఫ్రెండ్‌ని పట్టుకొని నాకు ఏంటి ఈ టార్చర్ అని అనుకుంటాడు. ఏం అర్జెంట్ అయింటుందో ఒక సారి ఫోన్ లిఫ్ట్ చేయమని ఫ్రెండ్స్ అంటే అంత సీన్ లేదని దేవా అంటాడు. ఇక సాంబ తన మనిషికి కత్తి ఇచ్చి చంపమని పంపుతాడు. ఆ రౌడీ సత్యమూర్తిని ఫాలో అవుతాడు.
ఇక మిధున మామయ్యని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించి గుడి దగ్గర్లో ఎవరు ఉంటారు.. ఎవరికి కాల్ చేస్తే వెంటనే అక్కడికి వెళ్తారు అని ఆలోచించి నాన్న అని అనుకుంటుంది. వెంటనే నాన్నకి కాల్ చేస్తుంది. ఎక్కడ ఉన్నారు నాన్న అని అడుగుతుంది. మిధున కంగారు పడుతుంది ఏమైంది అనుకొని అడుగుతారు. మిధున ఎక్కడున్నారు చెప్పండి నాన్న అని అంటే గుడి దగ్గర్లో ఉన్నాను కోర్టుకి వెళ్తున్నా అంటారు. దాంతో మిధున నాన్న మీతో మాట్లాడాలి వెంటనే రండి అని చెప్తుంది. హరివర్దన్ బయల్దేరుతారు. మిధున కూడా బయల్దేరుతుంది. సత్య మూర్తి పంతుల్ని కలుస్తారు. హోమానికి అన్నీ రెడీగా ఉన్నాయని ప్రదక్షిణలు పూర్త అయితే చేయిస్తానని పంతులు అంటాడు.
మిధున తన తండ్రి గుడికి వెళ్లుంటారు. ఇప్పుడు పోలీసుల్ని పంపిస్తే రౌడీలు వాళ్లని చూసి భయపడతారు అని అనుకొని పోలీసులకు కాల్ చేసి జడ్జి హరివర్దన్ గారి మీద అటాక్ జరగబోతుందని చెప్తుంది. పోలీసులు మిధునని ప్రశ్నిస్తే జడ్జి గారికి కాల్ చేసి గుడిలో ఉంటే వెళ్లండి అని చెప్తుంది. పోలీసుల మీద కేకలు వేస్తుంది. దాంతో పోలీసులు బయల్దేరుతారు. రౌడీ సత్యమూర్తిని చంపబోయి పంతుల్ని చూసి ఆగిపోతాడు. జడ్జి గుడికి వచ్చి మిధున కోసం మొత్తం వెతికి మిధునకు కాల్ చేస్తారు. గుడిలోనే ఉన్నానని మిధున చెప్తుంది. ఎక్కడున్నావ్ చెప్పు అంటే మా మామయ్య గారిని చూశారా ఆయనకు దగ్గర్లో ఉన్నానని అంటుంది. మీ మామయ్య ఎవరు ఆయన కూడా వచ్చారా అని చిరాకుపడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఉష, విజయ్‌ల సీన్ చాలా పర్సనల్‌గా ఉందే!!





















