దానిమ్మలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయినా సరి దీనిని ఖాళీ కడుపుతో తినకూడదట.

దానిమ్మలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

అయితే కొందరిలో ఖాళీ కడుపుతో తీసుకుంటే మాత్రం కడుపు నొప్పి, వాంతులు, డయోరియా వచ్చే అవకాశముంది.

దానిమ్మలో సహజమైన చక్కెరలు ఉంటాయి. ఖాళీ కడుపుతో తింటే శరీరంలో షుగర్ లెవల్స్​ని స్పైక్ చేసే అవకాశముంది.

మధుమేహం ఉన్నవారిలో లేదా రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు ఇది భంగం కలిగించవచ్చు.

ఆరోగ్య సమస్యల కారణంగా మీరు ఉదయాన్నే మెడిసన్ తీసుకుంటే అదే సమయంలో దానిమ్మ తింటే శోషణకు అంతరాయం కలుగుతుంది.

దానిమ్మలో రక్తాన్ని పలుచబరిచే లక్షణాలు ఉన్నాయి. ఇవి మెడిసన్ శోషణను అడ్డుకుంటాయి.

దానిమ్మను విడిగా కాకుండా ఆహారంతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. షుగర్ కంట్రోల్​లో ఉంటుంది.

తక్కువ మోతాదులో ప్రారంభించి.. మీ శరీరం దానికి నెగిటివ్ రియాక్షన్ ఇవ్వకుంటే క్వాంటిటీ పెంచవచ్చు.

పండిన దానిమ్మను తింటే జీర్ణ సమస్యలు తక్కువగా వచ్చే అవకాశముంది.