Nuvvunte Naa Jathaga Serial Today june 5th: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున భర్తని అన్నావదినలే చంపేస్తారా.. దేవాకి ప్రమాదం.. మిథున ఆశలు అడియాసలేనా!
Nuvvunte Naa Jathaga Today Episode మిథున నల్లపూసల తంతు ఆపడానికి మిథున అన్న వదినలు దేవాని చంపాలని ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథునకు బంగారం కొనడం కోసం శారద తన బంగారు గాజులు అమ్మేస్తుంది. మిథున చాలా ఎమోషనల్ అయిపోతుంది. వద్దని శారదకు మిథున చెప్పినా శారద వినకుండా నువ్వు శాశ్వతంగా నా కోడలిగా ఉండిపోతున్నావ్ అనే సంతోషంతో నేను నల్లపూసలు కొంటున్నా నా సంతోషానికి అడ్డు పడొద్దు అని శారద అంటుంది.
మిథున అత్తని హగ్ చేసుకొని అమ్మలాంటి అత్త దొరకడం నా అదృష్టం అని అంటుంది. శారద మిథునతో బలవంతంగా నా కొడుకు నీ మెడలో తాళి కట్టినందుకు నీ ప్లేస్‌లో ఇంకే అమ్మాయి ఉన్నా కేసు పెట్టి వాడిని జైలు పాలు చేసేది కానీ నువ్వు మాత్రం వాడి జీవితం మార్చాలని అనుకుంటున్నావ్ నీ లాంటి కోడలు దొరకడం మాకు చాలా అదృష్టం అని అంటుంది. మరోవైపు లలిత, అత్తతో నల్లపూసల కార్యక్రమం కోసం పుట్టింటి తరఫున మనం ఏం తీసుకెళ్లాలి అని అడుగుతుంది. త్రిపుర అత్తతో రౌడీ బలవంతంగా కట్టిన తాళి కోసం మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటుంది. రాహుల్ కూడా మిథున పెళ్లిని అంగీకరించడం ఏంటి అని అడుగుతాడు.
లలిత త్రిపురతో నా కూతురు దేవాని భర్తగా నమ్ముతుంది మాకు నా కూతురి సంతోషమే ముఖ్యం అంటుంది. రాహుల్ నల్లపూసల తంతుకి వెళ్లొద్దని అసలు అది జరగకూడదు అంటాడు. దేవుడు నిర్ణయించాడు దాన్ని ఎవరూ మార్చలేరు అని లలిత అంటుంది. రాత్రి శారద, మిథున షాపింగ్ చేసుకొని సంతోషంగా నవ్వుకుంటూ ఇంటికి వస్తారు. అది చూసి కాంతం నోరెళ్లబెడుతుంది. మిథున ప్రమోదినితో అక్క నాకు మా ఆయనకు సేమ్ కలర్ బట్టలు కొన్నాం అని సంతోషంగా చూపిస్తుంది. నువ్వు ఇంత సంతోషంగా ఉండటం మొదటి సారి మిథున ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని ప్రమోదిని అంటుంది.
కాంతం నవ్వుతూ దేవా మిథున మెడలో నల్లపూసలు వేయడు అది జరిగే పని కాదు అని అంటుంది. మా ఆయన నా మెడలో నల్లపూసలు వేయడం నువ్వే చూస్తావ్ కాంతం అక్కాయ్ కంగారు పడకు అని మిథున అంటుంది. మరోవైపు రాహుల్, త్రిపుర మాట్లాడుకుంటారు. దేవా మిథున మెడలో నల్లపూసలు వేస్తే శాశ్వతంగా భర్త అయిపోతాడు. నాన్న కూడా లేరు ఎలా ఆపాలి అనుకుంటారు. ఏదో ఒకటి చేసి ఆపాలి అని త్రిపుర అంటుంది. దేవాని చంపేద్దామని త్రిపుర అంటుంది. రిస్క్ అవుతుందని రాహుల్ అంటాడు. ఈ సమస్యలకు వాడే కారణం కాబట్టి ఇక ఏ సమస్య ఉండదు అని దేవాని చంపేయాలి అనుకుంటారు.
మిథున కుంకుమ బరిణి పట్టుకొని తెగ మురిసిపోతుంది. షాపింగ్ సంతోషం దేవాతో పంచుకోవాలని ఫోన్ చేస్తుంది. దేవా గ్యారేజీలో ఉంటాడు. ఎన్ని సార్లు కట్ చేసిన ఎందుకు ఫోన్ చేశావ్ అని అంటాడు. దాక్కోవడానికి ఏ ఊరు పారిపోయావ్ మిస్టర్ మొగుడు గారు అని అంటుంది. నేను పారిపోవడం ఏంటి అని దేవా అంటే నల్లపూసలు వేయాల్సి వస్తుందని భయపడి పారిపోయింటావ్ అంటుంది. అంత సీన్ లేదు అని దేవా అంటే మరి ఇంత వరకు ఇంటికి ఎందుకు రాలేదు అని అంటుంది. నేను గ్యారేజీలో ఉన్నాను అని దేవా అంటే నువ్వు నిజంగా భయపడకపోతే ఇంటికిరా అని అంటుంది. మిథున షాపింగ్ గురించి తాళి గురించి చెప్తుంది. కొత్త బట్టలు కట్టుకొని మీరు నా మెడలో తాళివేస్తారు అంటుంది. రేపు అస్సలు తంతు జరగదు అంటాడు. ఇప్పుడే ఇంటికి వస్తా నేనేం దాక్కోవడం లేదు అని దేవా బయల్దేరుతాడు.
దేవా వచ్చిన దారిలో రాహుల్ దారికి అడ్డంగా తీగ ఏర్పాటు చేయిస్తాడు. అది దేవా మెడకు తగిలి దేవా చనిపోయేలా ప్లాన్ చేస్తారు. మిథున కుంకుమ పట్టుకొని దేవా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రేపటితో నాకు కొత్త జీవితం ఏర్పడుతుందని సంతోషపడుతుంది. నా చేతిలో ఉన్న ఈ కుంకుమ నువ్వే నా నుదిటిన పెడతావ్ అనుకుంటుంది. ఇంతలో దేవాకి ఆ వైర్ తగిలి కింద పడిపోతాడు. మిథున చేతిలో కుంకుమ కింద పడిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాఘవ కొడుకే ఆనంద్.. రుక్మిణి, ఆనంద్‌ల ప్రేమ కథ వెనక పెద్ద కథే ఉందిగా!





















