Nuvvunte Naa Jathaga Serial Today june 2nd: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునని ఎవరు ఏం అన్నా తట్టుకోలేనమ్మా.. ప్రేమ బయట పెట్టేసిన దేవా!
Nuvvunte Naa Jathaga Today Episode దేవాని తిట్టారని సత్యమూర్తిని మిథున ఎదురించి జరిగింది చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode ఎస్‌ఐకి వార్నింగ్ ఇచ్చి మిథున దేవాని పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొని బయల్దేరుతుంది. ఇక కాంతం మిథున ఇంట్లో రోజు రోజుకి ఎదురించి మాట్లాడుతూ ఇక్కడే తిష్ట వేస్తుందని తిట్టుకొని కొరడాతో కొట్టుకుంటే రంగం ఆపి ఆ మిథున ఎన్ని చేసినా దేవా పంపేస్తాడు నువ్వేం కంగారు పడకు అని అంటాడు.
దేవాని దెబ్బలతో చూసిన శారద ఏడుస్తుంది. ఏమైందని అడిగితే మిథున జరిగింది చెప్తుంది. ఏం జరిగిందో మిథున చెప్పినా సరే సత్యమూర్తి మాష్టారు దేవాని తిడతాడు. నేనేం పాపం చేశాను అనిరా నువ్వు నా కడుపున పుట్టావ్. నలుగురిలో నా పరువు తీసేస్తున్నావ్ అని తిడుతూనే ఉంటారు. మిథున ఆపాలి ప్రయత్నిస్తుంది.
సత్యమూర్తి: ఏంటి గొంతు లేస్తుంది.
మిథున: జరిగింది చెప్తుంటే వినకుండా దేవా తప్పు చేశాడు అని మీరు తిడుతుంటే మరి నేనేం చేయాలి.
సత్యమూర్తి: వీడి గురించి నాకు తెలీదు పోలీసులతో పొట్లాడుంటాడు. చితక్కొటుంటారు.
మిథున: తెలీదు మామయ్య మీ అబ్బాయి గురించి నిజంగా మీకు తెలీదు. అతను రౌడీగా మారాడు అన్న కోపంతో అతను ఏం చేసినా తప్పు అన్న భావనలో ఉన్నారు తప్ప నా కొడుకు తప్పు చేసుంటాడా అని ఆలోచించలేకపోతున్నారు. అందుకే మీ ఇద్దరి మధ్య పూడ్చుకోలేకపోతున్నారు.
సత్యమూర్తి: ఏమన్నావ్ నేను ఆలోచించలేకపోతున్నానా.
మిథున: అంతే కాదు మామయ్య నిజం కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఆ పోలీస్ నన్ను చెడు దృష్టితో చూశాడు. నాతో తప్పుగా ప్రవర్తించాడు. మీరు అత్తయ్య బయటకు వెళ్తే అత్తయ్యని ఎవరైనా ఏమైనా అంటే మీరు ఊరుకుంటారా మీకు కోపం రాదా.. దేవా కూడా అదే చేశాడు. కానీ ఆ పోలీస్ అధికారం అడ్డు పెట్టుకొని ఇలా కొట్టి హింసించాడు. అక్కడున్న అందరూ దేవా చేసింది కరెక్ట్ అని దేవాని మెచ్చుకున్నారు. కానీ కన్నతండ్రి అయిన మీరు దేవాని అర్థం చేసుకోవడం లేదు.
ఆనంద్: నాన్న మిథున అబద్ధం చెప్పదు.
శారద: ఏవండీ మీరు ఏమైనా అనుకోండి కానీ ప్రతీ దానికి మీరు చిన్నోడి మీద కోప్పడుతూనే ఉంటారు.
సత్యమూర్తి: బంగారం లాంటి భవిష్యత్ నాశనం చేసుకున్న వీడు ఏంటో నాకు అర్థం అయింది. నీకే అర్థం కావడం లేదు. అసలు నీకు ఆ పోలీసు అలా అనడానికి కారణం ఏంటో తెలుసా వీడే. ఒక రౌడీతో నువ్వు వెళ్లావ్ కాబట్టి నిన్ను అలా అన్నారు. అదే ఒంటరిగా వెళ్లినా నీకు అలా అనరు. ఒక్క రోజు ఇలా వెళ్తే అన్న వాళ్లు జీవితాంతం భార్యగా ఉంటే ఏలా అనుకుంటారో నువ్వే అర్థం చేసుకో.
మిథున: మామయ్య వాళ్లు ఏం అనుకుంటారో నాకు అనవసరం. దేవా ఏంటో నాకు తెలుసు.
సత్యమూర్తి: బాగా చదువుకున్న నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్ చూడు అది నీ మూర్ఖత్వం. ఈ మూర్ఖుడితో బతుకుతా అంటున్నావ్ చూడు అది నీ ఖర్మ.
మిథున: మామయ్య అది కాదు..
దేవా: ఏయ్ ఆపు అతను నా కన్నతండ్రి నన్ను ఏమైనా అంటారు. నువ్వు మధ్యలో మాట్లాడితే మర్యాదగా ఉండదు.
మిథున నానమ్మ, అమ్మ మిథునకు నల్లపూసల గుచ్చే కార్యక్రమం గురించి మాట్లాడుకుంటారు. కొడుకుకి తెలీకుండా నల్లపూసల కార్యక్రమం చేసేద్దాం అంటుంది. ఆయనకు తెలీకుండా సారె ఇస్తేనే గత సారి హార్ట్ అటాక్ వచ్చింది కదా అని లలిత అంటే అది స్వామీజీ చెప్పినట్లు అరిష్టం అయింటుందని చెప్పి లలితని ఒప్పిస్తుంది. మిథున అత్తారింటికి వెళ్లి వాళ్లతో మాట్లాడి రా అని చెప్తుంది.
దేవా దెబ్బలకు ఇబ్బంది పడుతూ ఉంటాడు. మిథున వేడి నీరు తీసుకొచ్చి కాపడం పెడతా అంటుంది. అతి చేయకు అని దేవా వద్దని నువ్వు నా జీవితం నుంచి వెళ్లిపోతే నాకు అన్నీ తగ్గిపోతాయి అని అంటాడు. ఇంతలో శారద వచ్చి నేను కాపడం పెడతా నువ్వు వెళ్లు మిథున అంటుంది. శారద కాపడం పెడుతూ ఇంకా నాకు ఎన్నాళ్లు ఈ కడుపు కోతరా అని ఏడుస్తుంది. మిథున శారదని తప్పుకోమని తాను కాపడం పెడుతుంది. మిథున ఏడుస్తూ కాపడం పెడుతుంది. అమ్మ ఇప్పుడు బాగుంది అలా కాపడం పెట్టు అమ్మ అంటాడు. మిథున కన్నీరు మీద పడటంతో అమ్మా ఏడ్వకు. నేను చేసిన దాంట్లో తప్పు లేదమ్మా అతను మిథునతో చెడుగా మాట్లాడటం తట్టుకోలేకపోయాను.. వాడు మిథున కోసం తప్పుగా మాట్లాడితే ఎలా తట్టుకుంటానమ్మా.. నన్ను అన్నా పడేవాడిని కానీ మిథునని అన్నాడు. అంత మంచి అమ్మాయితో చెడుగా ప్రవర్తిస్తాడా అమ్మా అని అంటాడు. తర్వాత మిథునని చూసి నువ్వు కాపడం పెడుతున్నావ్ ఏంటి మా అమ్మ ఏది అని అడుగుతుంది. నీకు బుద్ధి లేదా వద్దు అన్నా నాకు కాపడం పెడుతున్నావ్ అని దేవా అంటాడు.
దానికి మిథున నువ్వు నా కోసం ఆ ఎస్‌ఐని కొట్టి దెబ్బలు తింటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని అంటుంది. నాకు ప్రేమ ఉంటుంది కదా అని అంటుంది. నీ ప్లేస్‌లో ఎవరు ఉన్నా నేను ఇలాగే రియాక్ట్ అయ్యేవాడిని అని అంటాడు. దానికి మిథున బాధ్యతతో ఓ పని చేయడానికి ప్రేమతో చేయడానికి తేడా ఉంటుంది. ఇందాక నువ్వు అన్నావ్ కదా మిథునని ఒక్క మాట అన్నా తట్టుకోలేకపోయాను అని దాన్నే ప్రేమ అంటారు అని అంటుంది. దేవా ఉదయం బయటకు వెళ్తానని అనడంతో మిథున ఆపుతుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ అని ప్రశ్నిస్తుంది. దానికి సత్యమూర్తి అలా చెప్పి వెళ్లే లక్షణం ఉండి ఉంటే ఎప్పుడో బాగు పడే వాడు అని అంటారు. మిథున నవ్వడం చూసి మా నాన్నతో తిట్టించాలి అనే కదా ఇలా చేశావ్ అని అంటాడు. దేవా, మిథునలు గొడవ పడుతుంటే మీ ఇద్దరూ చేస్తుంది పనికి రాని పనులే ఆ విషయం తెలుసుకోండి అని అంటారు. ఇంతలో లలిత ఇంటికి వస్తుంది. మిథున చాలా హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: బంటీ బతకడానికి కారణమైన రుక్మిణిని రూపలా చూసుకుంటున్న సూర్యప్రతాప్..!





















