Nuvvunte Naa Jathaga Serial Today june 23rd: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునకు ప్రేమ పరీక్ష.. వారం గడువు..తండ్రి పెట్టిన పరీక్షలో గెలుస్తుందా?
Nuvvunte Naa Jathaga Today Episode దేవాకి తన మీద ప్రేమ ఉందని వారంలో నిరూపించుకోవాలని హరివర్దన్ మిథునకు గడువు ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా, పోలీస్ అధికారికి గొడవ జరుగుతుంది. పోలీస్ దేవాతో మిథునని అంత ఈజీగా వదలను ఆ అందం నాకు దక్కాల్సిందే అంటాడు. దాంతో దేవా రేయ్ మిథున వెనక సైనికుడిలా నేను ఉన్నాను. మిథునని టచ్ చేయడం కాదు కదా ఆ ఆలోచన వస్తేనే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. మిథున నా మనసుని పట్టిన మైనా ఎక్కడున్నావమ్మా అని పోలీస్ అనుకుంటాడు.
మిథున పుట్టింటికి వెళ్తుంది. లలిత, అలంకృత మిథునని చూసి సంతోషంగా వెళ్లి పలకరిస్తారు. త్రిపుర మిథునని చూసి ఎందుకు వచ్చావ్ నీకు నల్లపూసల వేడుక అయింది అని ఆ నల్లపూసలు మీ నాన్నకి చూపించి వెక్కిరించాలి అని వచ్చావా అని అడుగుతుంది. లలిత త్రిపురతో మిథున ఎందుకు అలా చేస్తుంది అని అంటుంది. మామయ్యగారిని అవమానించడానికి కాకపోతే తను ఎందుకు వచ్చింది అని త్రిపుర అంటే నాన్నతో మాట్లాడటం కోసం వచ్చాను అంటుంది. తండ్రి దగ్గరకు వెళ్లి నాన్న ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది.
హరివర్దన్: ఎందుకు వచ్చావ్.
మిథున: మీతో మాట్లాడటానికి నాన్న.
హరివర్దన్: తండ్రి వద్ద అని వెళ్లిపోయావ్. నేను అక్కర్లేని కూతురు నాకు వద్దు అని నేను నీకు నీళ్లు వదిలేశాను. ఇక మన మధ్య ఏం ఉంటాయ్ మాట్లాడుకోవడానికి.
మిథున: నీళ్లు వదిలేసినంత తేలిక కాదు కదా నాన్న కూతురి మీద ప్రేమ వదిలేయడం. ఆ కారణంగానే కదా నాన్న దేవాని చంపేసి అయినా కూతుర్ని ఇంటికి తీసుకురావాలి అనుకుంది. మా ఆయన్ని చంపేసి నన్ను తీసుకురావాలి అంటే మా ఆయన్ని చంపడానికి ఒక్క నిమిషం ముందు అయినా నేను ప్రాణాలు వదిలేస్తాను. కారణం లేకుండా శివపార్వతులు ఏ బంధాన్ని ముడి వేయరు అని నేను నమ్ముతాను. అందుకే ఈ మూడు ముళ్ల బంధాన్ని నేను గౌరవించాను. నాన్న ఈ మూడు ముళ్ల బంధాన్ని తెంచేయడం అంత తేలిక కాదు. ఇప్పుడు చావు అయినా బతుకు అయినా నాకు దేవాతోనే దయచేసి అర్థం చేసుకోండి. నన్ను దేవాతో బతకనివ్వండి. నాన్న నేను అంటే మీకు ఎంత ప్రేమనో నా కోసం మీరు ఏం అయినా చేస్తారు అని తెలుసు అందుకే నా దయచేసి నా మాంగల్యాన్ని కాపాడండి. మీ చేతితో మీరు నన్ను విధవని చేయకండి.
త్రిపుర: ఏంటి మీ నాన్నని బ్లాక్ మెయిల్ చేస్తున్నావా. ఇలా చెప్తే మీ నాన్న సైలెంట్ అయిపోతారనా నీ ఆలోచినా..
మిథున: వదినా ప్లీజ్.. నాన్న మీరు నన్ను ఇంటికి తీసుకురావడానికి నా భర్తకి కానీ నా అత్తింటికి కానీ ఏమాత్రం అయినా హానీ తలపెట్టినా మీ కూతురు ఈ లోకంలో ఉండదు నాన్న. మీ కూతురు చచ్చినా పర్లేదు అనుకుంటే మీకు నచ్చినట్లు చేయండి. వెళ్లొస్తా నాన్న.
హరివర్దన్: ఆగు.. వాడి కోసం నువ్వు చచ్చిపోతాను అని ఎందుకు అంటున్నావ్.
మిథున: నా భర్త కాబట్టి.
హరివర్దన్: కానీ వాడు నిన్ను ఓ పురుగులా చూస్తున్నాడు కదా. బంధం నిలబడాలి అంటే కచ్చితంగా ప్రేమ ఉండాలి. వాడి కోసం నువ్వు చచ్చిపోతా అంటున్నావ్ కదా కానీ వాడికి నీ మీద ప్రేమ ఉండాలి కదా.
మిథున: అతని మనసులో నా మీద ప్రేమ ఉంది నాన్న కానీ రౌడీ వృత్తి వల్ల అంగీకరించడం లేదు. కానీ ఏదో ఒకరోజు నాతో పాటు అందరికీ తెలుస్తుంది.
హరివర్దన్: ఎన్ని రోజులకు ఎన్ని సంవత్సరాలకు నీ దగ్గర సమాధానం లేదు. గుడ్డి నమ్మకంతో ఎదురు చూడటం మూర్ఖత్వం. మన జీవితం మనమే నాశనం చేసుకోవడం అవుతుంది. జీవితాంతం వాడు నిన్ను అసహ్యించుకుంటే నువ్వు మాత్రం ఎదురు చూస్తుంటావా. వాడి కోసం నువ్వు ఆరాట పడినట్లే నీ కోసం నేను ఆరాట పడుతున్నా. ఒక తండ్రి భయాన్ని దూరం చేసే బాధ్యత నీ మీద ఉంది.
మిథున: చెప్పండి నాన్న ఏం చేయమంటారు.
హరివర్దన్: నీకు వారం రోజులు టైం ఇస్తున్నా వాడికి నీ మీద ప్రేమ ఉందని నువ్వు నిరూపించు అప్పుడు నేను నీ నమ్మకాన్ని గౌరవిస్తాను. అతనే నీ భర్త అని నేను ఒప్పుకుంటాను. లేదంటే వారం తర్వాత నువ్వు శాశ్వతంగా బంధం తెంచుకొని మన ఇంటికి వచ్చేయాలి అందుకు నువ్వు సిద్ధమా.
మిథున: నిరూపిస్తాను నాన్న. దేవా మనసులో ప్రేమని నిరూపిస్తా లేదంటే మన ఇంటికి వచ్చేస్తా.
హరివర్దన్: వారమే గడువు గుర్తు పెట్టుకో.
మిథున: వారం చాలు నాన్న..
సూర్యకాంతం గుమ్మం ముందు కూర్చొని మేడం ఇంటికి వెళ్లింది కదా అక్కడ ఏం జరుగుతుంది ఏమైందో తెలీడం లేదని టెన్షన్ పడుతుంది. ప్రమోదినితో మేడం ఎందుకు వెళ్లింది నీకు చెప్తుంది కదా అని అడుగుతుంది. నాకు తెలీదు అని ప్రమోదిని అంటుంది. మిథున అక్కడికి వెళ్లి ఉండిపోవడానికి వెళ్లిందా వాళ్ల నాన్న అక్కడ బంధించేసుంటారు కదా అంటే శారద వచ్చి రెండు మొట్టికాయలు వేసి మిథున వాళ్ల కన్నవాళ్లని చూడటానికి వెళ్లింది అంటుంది. లేదు అత్తయ్య మిథునని బంధించి ఆ వకీల్ సాబ్‌కి ఇచ్చి పెళ్లి చేసేస్తారు అని కాంతం అంటే దాంతో శారద కోడలి మీద అరిచి మిథున దేవా భార్య ఈ ఇంటి కోడలు తన గురించి తప్పుగా మాట్లాడితే కోడలివి అని చూడను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
మిథున గుడికి వెళ్తుంది. అమ్మవారి ముందు నిల్చొని నువ్వు ముడి వేసిన ఈ బంధానికి బలం ఉందా.. మా నాన్నకి నేను ఎలా నిరూపించుకోవాలి.. మూడు రోజుల్లో పెళ్లి జరగబోతుందని ఆ రోజు మొక్కు తీర్చుకోవాలని నీ దగ్గరకు ఆ రోజు వస్తే దేవా నా మెడలో తాళి పడేలా చేశావ్. నా జీవితం అటు కాదు ఇది అని దేవా జీవితంలోకి అడుగులు వేశాను. అందర్ని వదిలేసి దేవా కోసం ఆ ఇంట్లో అడుగులు వేశా .. నువ్వు కలిపిన ఈ బంధానికి విలువ లేదని అంటున్నారు. నా మనసులో దేవా మీద ప్రేమ ఉన్నట్లే నేను అంటే దేవాకి ఇష్టం అని నేను నమ్ముతున్నాను. మా నాన్నకి ఆ ప్రేమని ఎలా నిరూపించాలో నాకు అర్థం కావడం లేదు.. వారం రోజులు అనే అగ్నిపరీక్ష నా ముందు ఉంది.. దాన్ని నేను ఎలా నిరూపించుకోవాలి. ఎలా బంధాన్ని నిలబెట్టుకోవాలి. వీటన్నింటికి నువ్వు దారి చూపించాలి అని మిథున అమ్మవారితో అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: కోర్టులో ఉత్కంఠ.. లక్ష్మీకి శిక్ష గ్యారెంటీ.. విహారి ఏం చేయనున్నాడు!





















