Nuvvunte Naa Jathaga Serial Today june 10th: నువ్వుంటే నా జతగా సీరియల్: తనని చంపాలనుకుంది మిథున అన్నే అని తెలుసుకున్న దేవా.. మిథున తాళి తెంపేస్తాడా!
Nuvvunte Naa Jathaga Today Episode మిథున కోసం నల్లపూసల తంతు ఏర్పాటు చేయడం దేవా రాలేదని కాంతం మిథునని బాధ పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున నల్లపూసల తంతుకి మిథున అమ్మ, నానమ్మ, చెల్లి వస్తారు. శారద, ప్రమోదిని ఎదురెళ్లి పలకరిస్తారు. మిథున తల్లి తెచ్చిన నగలు చూసి కాంతం, రంగం నోరెళ్లబెడతారు. కోటీశ్వరులు కదా వాళ్ల స్థాయికి తగ్గట్టు తీసుకొచ్చారని రంగం అంటాడు. అలంకృత దేవా బావ ఎక్కడా అని అడిగితే కాంతం నిజం చెప్పబోతే శారద కోడల్ని తిట్టి నోరు మూయిస్తుంది. దేవా బయటకు వెళ్లాడని చెప్తారు.
మిథున తల్లి వాళ్లు మిథునని కలుస్తారు. లలిత కూతురితో ఓ వైపు సంతోషంగా ఉన్నా అల్లుడు గారు లేరని భయంగా ఉందని అంటుంది. ఆయన ఎక్కడున్నా కచ్చితంగా టైంకి వస్తారు అని ఆ పార్వతి పరమేశ్వరులు మీద నాకు నమ్మకం ఉందని దేవా నా మెడలో నల్లపూసలు వేస్తాడని అంటుంది. మరోవైపు మత్తులో ఉన్న దేవాని చూసి ఇక అక్కడ నల్లపూసల తంతు ఆగిపోతుందని సంబర పడుతుంది. ఇంతలో నర్స్ వచ్చి దేవాకి మెలకువ వస్తే తీసుకెళ్లిపోవచ్చు అంటుంది. నా రాజాకి అప్పుడే మెలకువ రాదు అని భాను అనుకుంటుంది. ఇంతలో నర్స్ సౌండ్ చేయడంతో దేవాకి మెలకువ వచ్చేస్తుంది. భాను డిసప్పాయింట్ అయిపోతుంది.
దేవా తనకు ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్లలో ఒక వ్యక్తి తెలిసిన వాడే కానీ గుర్తు రావడం లేదు అంటాడు. ఎక్కువ ఆలోచించొద్దని భాను అంటుంది. ఇక భాను బిల్ ఇస్తున్నప్పుడు దేవా తన ఫోన్ చూస్తాడు. భానుని కోపంగా చూస్తాడు. భాను కంగారు పడుతుంది. నీకు బాలేదు అని నువ్వు పూర్తిగా కోలుకునే వరకు హాస్పిటల్‌లో ఉండాలని అలా చెప్పాను అంటుంది. దేవా ఫోన్ ఆన్ చేసి అందులో మిథున అన్న తనని ఈ పరిస్థితికి తీసుకొచ్చాడని వీడియో చూసి గుర్తిస్తాడు. తర్వాత భానుని ఫోన్ ఇవ్వలేదని తిడతాడు. దేవా బయల్దేరుతుంటే నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దు అంటుంది. దేవా వినడు.
మిథునకు నల్లపూసల దండ వేయాలని మనసు పరుగులు పెడుతుందా అంటే నేను వెళ్లేది నల్లపూసలు వేయడానికి కాదు దాని మెడలో తాళి తెంపేయడానికి నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది దాని అన్న రాహుల్ అందుకే దాన్ని గెంటేస్తా అని వెళ్తాడు. దేవా ప్లాన్ ఫెయిల్ అయి దాని మెడలో నల్లపూసలు వేస్తే కొంపలు అంటుకుపోతాయని భాను తలపట్టుకుంటుంది. మిథున రెడీ అయి కార్యక్రమం దగ్గరకు వస్తుంది. మరోవైపు దేవా హాస్పిటల్‌లో నుంచి వెళ్లిపోయాడని రాహుల్‌కి తన మనుషులు కాల్ చేసి చెప్తారు. రాహుల్ రౌడీలను తిడతాడు. వాడు వెళ్లే విధానం చూస్తే మిథున మెడలో నల్లపూసలు వేసేలా ఉన్నాడని త్రిపుర, రాహుల్ కంగారు పడతారు. అదే జరిగితే మిథునని మన ఇంటికి తీసుకొని రావడానికి ఇంకో జన్మ ఎత్తాలని అంటుంది.
మరోవైపు కాంతం నల్లపూసల తంతు జరిగిపోతుందేమో అని తలబాదుకుంటుంది. దేవా రాడు తంతు జరగదు అని రంగం అంటాడు. ఇంతలో ప్రమోదిని వచ్చి పూజ టైంకి దేవా కచ్చితంగా వస్తాడు అని అంటుంది. మీ కల్లారా మీరే చూస్తారు అని అంటుంది. ఇక రంగం మిథునని చూసి ఏది ఏమైనా కోడలు అంటే అలాగే ఉండాలి ఎంత లక్షణంగా ఉందే అంటాడు. కాంతం భర్తని కడుపు మీద కొడుతుంది. ఇక కాంతం మిథున దగ్గరకు వెళ్లి నిన్ను చూస్తే మనసు తరుక్కుపోతుంది. ఫంక్షన్‌కి టైం అయిపోయింది కానీ దేవా రాలేదు అని వెటకారం చేస్తుంది. ఇంకా టైం ఉంది అక్కాయ్ అని మిథున అంటుంది. దేవా వస్తుంటాడు. మిథున కంగారు పడుతుంది. అందరూ దేవా ఇంకా రాలేదని అంటే నల్లపూసలు వేసే టైంకి దేవా కచ్చితంగా వస్తాడు అని శారద అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిల రహస్యం ఆదికేశవ్‌కి తెలిసిపోతుందా.. క్షణక్షణం ఉత్కంఠ!





















