Nuvvunte Naa Jathaga Serial: బాబు దేవా.. వాళ్లని ఎందుకు కొట్టావ్.. ఈ లెక్కన మిథున గెలవడం పక్కా!!
Nuvvunte Naa Jathaga Today : మిథునని కామెంట్ చేసిన రౌడీలను దేవా కొట్టడం దేవా తనని ప్రేమిస్తున్నాడని మిథున అనుకోవడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today : మిథున దేవా తనని ప్రేమిస్తున్నాడని ఆ ప్రేమని వారంలో నిరూపిస్తానని మిథున తండ్రితో ఛాలెంజ్ చేస్తుంది. వారంలో దేవా ప్రేమిస్తున్నాడని చెప్తే సరే లేదంటే శాశ్వతంగా పుట్టింటికి వచ్చేయాలని మిథునకు తండ్రి హరివర్దన్ కండీషన్ పెడతాడు. ఈ తరుణంలో తాజా ప్రోమో ఆసక్తికరంగా మారింది. ప్రోమోలో ఏం జరిగిందంటే..
"మిథున దేవా నడుచుకుంటూ వెళ్తుంటే కొంత మంది రౌడీలు మిథునని చూసి పాప పాలకోవాలా ఉందని కామెంట్స్ చేస్తారు. అది విన్ని దేవా కోపంతో కామెంట్ చేసిన వాళ్లని చితక్కొడతాడు. మిథున వద్దని చెప్పినా వినడు. ఇంకో సారి తన వైపునకు వచ్చిన తనని కామెంట్స్ చేసినా వాళ్లు ఎవరని అయినా చూడను చంపి పారేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలకు మిథున చాలా హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత దేవాతో ఎందుకు వాళ్లని కొట్టావ్ అని అడుగుతుంది. దేవా ఆవేశంగా ఎందుకంటే అని మిథునని చూసి ఆగిపోతాడు. మిథున దేవాతో చెప్పు .. నువ్వు నీ మాటలకు ముసుగు వేయగలవు కానీ మనసుకి కాదు. అని అంటుంది. దేవా మిథున చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. మిథున ప్రేమగా చూస్తుంది. దీంతో ఇవాళ్టి ప్రోమో పూర్తయిపోతుంది. "
మిథున మీద కోపంతో దేవా మిథున మెడలో తాళి కడతాడు. మిథున మాత్రం తాళే తన జీవితం అని తాళి కట్టిన వాడితోనే జీవితం అని దేవా కోసం అతని ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లో అందరూ వ్యతిరేకించినా ఒక్కొక్కరి మనసు మార్చుతూ మిథున కోడలి స్థానం కోసం పోరాడుతుంది. మరోవైపు మిథున అన్న వదినలు మిథునని ఇంటికి తెచ్చుకోవడానికి దేవా మీద అటాక్లు కూడా చేయిస్తారు. ఈ తరుణంలో మిథున, తండ్రి హరివర్దన్‌లకు మధ్య ఓ ఒప్పందం కుదురుతుంది. దేవా మిథునని ప్రేమిస్తున్నాడని వారంలో నిరూపిస్తే రౌడీ అయిన దేవాని అల్లుడిగా స్వీకరిస్తానని హరివర్దన్ చెప్తారు, ఒకవేళ వారంలో నిరూపించుకోకపోతే శాశ్వతంగా ఆ బంధం వదిలేసి మిథునని పుట్టింటికి వచ్చేయాలని తండ్రి కండీషన్ పెడతాడు. మిథున తండ్రి కండీషన్‌కి ఒప్పుకుంటుంది.
అత్తింట్లో ఉంటే దేవా మనసులో తన మీద ఉన్న ప్రేమ నిరూపించడం కష్టమని దేవాని బేబీ బామ్మ ఊరు తీసుకెళ్తుంది. ఇక మిథున మీద మనసు పడిన పోలీస్ అధికారి కూడా మిథునని వెతుక్కుంటూ ఆ ఊరు వెళ్తాడు. ఇక మిథున కోసం పిచ్చోడిలా అయిపోతున్న ఆదిత్యకు త్రిపుర కండీషన్ గురించి చెప్పి ఏడుస్తూ కూర్చొకుండా మిథునని దక్కించుకునేందుకు ప్రయత్నం చేయమని సలహా ఇస్తుంది. ఊరు వచ్చిన దేవాలో మార్పు మొదలవుతుంది. ఈ తరుణంలో దేవా మనసులో తన మీద ఉన్న ప్రేమని బయట పెట్టి గడువులో మిథున తండ్రి ఛాలెంజ్ గెలుస్తుందా లేదంటే ఛాలెంజ్‌లో ఓడిపోయి తండ్రి దగ్గరకు శాశ్వతంగా వెళ్తుందా తెలియాలి అంటే ఎదురు చూడాల్సిందే.
Also Read: అమ్మాయి గారు సీరియల్ ప్రోమో: విరూపాక్షి గ్యాంగ్ గెలిచిందోచ్.. ఈ సారి తల్లిదండ్రుల చేతుల మీదగా 'రూపాకల్యాణం'





















