Nuvvunte Naa Jathaga Serial Today January 9th: నువ్వుంటే నా జతగా: దేవా మిథునల్ని చంపేసిన తండ్రులు! కొత్త కాపురం పెట్టేస్తారా!
Nuvvunte Naa Jathaga Serial Today Episode January 9th దేవా చనిపోయాడని సత్యమూర్తి అనుకోవడం, మిథున చనిపోయిందని హరివర్థన్ అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode సత్యమూర్తి దేవా మీద చాలా సీరియస్ అవుతాడు. తనని నాన్న అని పిలవొద్దని ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్తాడు. ప్రమోదిని, ఆనంద్ ఇద్దరూ దేవాని క్షమించమని ఇద్దరినీ ఇంట్లో ఉండటానికి ఒప్పుకోమని అంటారు. ఇలాంటి ప్రబుద్ధుడు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు.. ఆడపిల్లలకు విలువ ఇవ్వలేని ఇలాంటి వాడిని నా ఇంట్లో ఉంచితే అంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు.. ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వెళ్లండి అని అంటాడు.
మిథున మామయ్యతో క్షమించండి మామయ్య మేం ఇక్కడి నుంచి వెళ్లము అని అంటుంది. ఆయన మాటకే ఎదురు చెప్తావా నువ్వు అని శారద అంటే ఎదురు చెప్పడం లేదు అత్తయ్యా మనందరి ఒకే కుటుంబం అందరం కలిసి ఉందామని అంటున్నా దయచేసి అర్థం చేసుకోండి అని అంటుంది. వద్దమ్మా మమల్ని అర్థం చేసుకుంది చాలు.. నీ కోసం వాడి కోసం నేను చాలా సార్లు ఆయన్ను ఎదురు తిరిగాను. కానీ ఈ సారి ఆయన మాటే నా మాట మీరు దయచేసి ఇంట్లో నుంచి వెళ్లిపోండి అని అంటుంది. ఈ రోజు మీరంతా దేవాని నిందిస్తున్నారు కానీ ఏదో ఒక రోజు దేవా మీరు గర్వపడే స్థాయికి వస్తాడు.. ఆ స్థాయికి నేను దేవాని తీసుకొస్తా.. అందుకు మేం ఇక్కడే మీ కళ్ల ముందే గుడెసె వేసుకొని ఉంటాం.. అంతే కానీ మీకు దూరంగా వెళ్లము.. అన్నింటి కన్న ముఖ్యంగా మీకొడుకుని మీకు నా వల్ల దూరం కానివ్వను అని మిథున అంటుంది.
సత్యమూర్తి కోసంగా వాడు నా కొడుకే కాదు.. మర్యాదగా బయటకు వెళ్లండి అంటాడు. దానికి దేవా నేను ఎక్కడికి వెళ్లను నాన్న ఇక్కడే ఉంటాను అని అంటాడు. అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం చెప్తా విను అని సత్యమూర్తి అక్కడే ఉన్న నీటిని తల మీద పోసుకొని ఈ రోజుతో నా చిన్న కొడుకు చచ్చిపోయాడు.. శారదా.. ఇకనుంచి వీళ్లకి మనకి ఎలాంటి సంబంధం లేదు... వీళ్లతో ఎవరూ మాట్లాడటానికి వీల్లేదు.. వీళ్లు మన ఇంటి గుమ్మం తొక్కినా.. మీలో ఎవరు అయినా వాళ్ల దగ్గరకు వెళ్లినా మర్యాదగా ఉండదు అని చెప్తాడు. దేవా మిథునని తీసుకొని వెళ్లిపోతాడు.
పురుషోత్తం ఎలక్షన్ల గురించి టెన్షన్ అవుతూ ఉంటాడు. దేవానే తనని ఎమ్మెల్యేగా చేయగలడు అని దేవాని పిలిపించమని అంటాడు. అక్కడే ఉన్న పురుషోత్తం కొడుకు రుద్ర దేవాని తండ్రి అంతగా పొగడటం చూసి ఓర్వలేకపోతాడు. దేవా దేవా ఎందుకు వాడికి అంత ఇంపార్టెన్స్ అని అంటే దేవా మాత్రమే నన్ను ఎమ్మెల్యేని చేయగలడు. దేవా చేతిలో 5 బస్తీలు ఉన్నాయి.., నారాజకీయ జీవితానికి దేవా దేవుడు అని అంటాడు. ఇంతలో ఒకరు వచ్చి దేవా మిథునని తీసుకొచ్చేశాడు అంటే ఏంట్రా దేవా నాకు చెప్పలేదు అని పురుష్తోత్తం అంటాడు. దానికి అతని భార్య దేవా మీకు ఎంత విలువ ఇస్తున్నాడో అర్థమైందా.. అందుకే రుద్ర అంతలా చెప్తున్నాడు.. దేవాని పని వాడిలా మాత్రమే చూడాలి కానీ బిడ్డలా కాదు అని అంటుంది. దేవాతో నేను మాట్లాడుతా అని పురుషోత్తం అంటాడు.
హరివర్థన్ నట్టింట్లో కూర్చొని మిథున చేసిన పని తలచుకొని ఆవేశంతో రగిలిపోతాడు. హాల్‌లో ఉన్న మిథున ఫోటోలను కోపంగా చూస్తూ వాటిని తీసుకెళ్లి బయట విసిరేస్తాడు. లలిత అడ్డుకోవాలని చూసినా ఆగడు. వాటి మీద పెట్రల్ పోసి నిప్పు పెట్టబోతే లలిత అడ్డుకుంటుంది. అది మన కూతురు అండీ చిన్న పిల్ల అని అంటుంది. ఆ విషయం మిథునకు గుర్తుందా.. గుర్తొంటే ఇలా చేయదు.. కూతురు చిన్ని చిన్ని పాదాలతో తంతుంటే తండ్రి సంతోషపడతాడు. కానీ ఇప్పుడు కూడా గుండెల మీద తంతుంటే ఎక్కడ నా గుండె ఆగిపోతుందా అని భయంగా ఉంది లలిత.. అది చిన్న పిల్ల అయితే మన మాట వినేది.. అయినా ఆ రౌడీ నచ్చినప్పుడు పిలిస్తే వెళ్లిపోవడం పొమ్మంటే వచ్చేయడం అయినా ఎందుకు మిథున వాడినే నమ్ముతుంది అని అంటాడు. హరివర్థన్ ఆవేశంగా ఇక నుంచి నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు అనుకుంటా. మిథున పెళ్లి మండపంలో అగ్ని సాక్షిగా చనిపోయింది అని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















