Nuvvunte Naa Jathaga Serial Today April 3rd: నువ్వుంటే నా జతగా సీరియల్: ఇంట్లో ఆవిడ.. ఇక్కడ ఈవిడ.. ఏంట్రా ఈ టార్చర్.. బాత్‌రూమ్‌లో రొమాన్స్!
Nuvvunte Naa Jathaga Today Episode మిధున దేవాని ఏడిపించడానికి బాత్‌రూమ్‌లో నీరు రాకుండా చేయడం దేవాతో సారీ చెప్పించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున 30 రోజుల్లో భర్తని మార్చుకోవడం ఎలా అనే బుక్ చదువుతూ దేవాని విసిగిస్తుంది. దేవా ఏం చేస్తుంటే భార్య మీద ప్రేమ ఉండే వాళ్లు ఇలానే చేస్తారు.. కానీ బయటకు ఒప్పుకోరు అని అంటుంటుంది. దేవా నోరెళ్లబెడతాడు. నిజంగా బుక్‌లో అలా ఉందా లేదంటే కావాలనే చదువుతున్నావా అని అడుగుతాడు. నువ్వే చూస్కో అని దేవాకి బుక్ ఇస్తానంటుంది. దేవా అవసరం లేదు అనేస్తాడు.
నన్ను నీ దారిలోకి తీసుకురావడం నీ వల్ల కాదు..
అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అని మీ భర్త మీ వెంటే ఉంటాడని.. మెల్లమెల్లగా మీ దారిలోకి వస్తున్నాడు అనడానికి ఇదో బలమైన కారణం అంటుంది. మొన్న ఎవరో నన్ను ఏడిపిస్తే మా ఆయన కొట్టాడు. అంటే నా మీద ప్రేమ ఉంది త్వరలోనే నా దారిలోకి వస్తాడని అంటుంది. అంత సీన్ లేదు అని దేవా తిడతాడు. ఈ బుక్ చదివే వాళ్లు చాలా మంది తమ భర్తల్ని మార్చుకున్నారని నేను మార్చుకుంటానని అంటుంది. అంత లేదని తనని ఎవరూ మార్చలేరు అని అంటాడు.
మిస్టర్ భర్త గారు ఇది వినండీ..
మిధున: మిస్టర్ భర్త గారు ఏమని సెలవిచ్చారు మిమల్ని మార్చుకోవడం నా వల్ల కాదా. రెండు ఉదాహరణలు చెప్తా అప్పుడు ఇదే మాట చెప్పండి. మొదట్లో నాతో మాట్లాడటమే ఇష్టం లేదు అన్న మీరు ఇప్పుడు గంటలు గంటలు మాట్లాడటం లేదా. నన్ను చూస్తేనే కంపరం అన్నారు ఇలా ఎదురుగా నిల్చొని మాట్లాడటం లేదా. నన్ను పంపేస్తా అన్న మీరే నన్ను మా ఇంటి నుంచి తీసుకురాలేదా. జస్ట్ టైం అంతే మీరే మారి నా దారిలోకి వస్తారు.
మీకు దండం పెడతా ఉద్యోగం చేయండి..
మిధున మాటలకు దేవా నోరెళ్లబెడతాడు. ప్రమోదిని భర్త దగ్గరకు టీ తీసుకెళ్తుంది. ఇప్పట్లో మాట్లాడవు అనుకుంటే టీ ఇస్తున్నావా షాకింగ్‌గా ఉందని ఆనంద్ అంటాడు. నా బాధ అర్థం చేసుకోండి అని ప్రమోదిని భర్తతో చెప్తుంది. మీకు పని చేతకావడం లేదని అందరూ అంటున్నారు ఇంకెంత కాలం ఇలా ఉద్యోగం చేయమని చెప్తుంది. డస్ట్ అలర్జీ కదా అందుకే చేయడం లేదు మంచి ఉద్యోగం దొరికితే చేస్తాలే అని చాలా తేలికగా మాట్లాడుతాడు. ఏదో ఒక పని చేయండి కనీసం వంద రూపాయలు తీసుకురండి అని దండం పెడుతుంది. ఉద్యోగం ఉద్యోగం అని చంపకు అని ఆనంద్ ప్రమోదినితో చెప్తాడు.
బాత్‌రూంలో రొమాన్స్..
దేవా స్నానం చేయడానికి వెళ్తుంటే మిధున దేవాని చూసి దేవా దగ్గరే బుక్ చదువుతుంది. ఇలాంటి వేషాలు వేస్తే అయిపోతావ్ అంటే దేవా మిధున ముక్కు పట్టి లాగేస్తాడు. నీ పని చెప్తా అని దేవా స్నానానికి వెళ్లాగానే మిధున ట్యాంక్ ఆపేస్తుంది. దేవా ఒళ్లంతా సబ్బు రాసేస్తాడు. నీరు రాకపోవడంతో అమ్మా అమ్మా అని అరుస్తాడు. మిధున వచ్చి మీ అమ్మ పడుకున్నారని చెప్తుంది. దేవా నీరు తీసుకురమ్మని అడిగితే తనకు సారీ చెప్తేనే తెస్తానని విసిగిస్తుంది. దేవా మిధునతో వాదించి వాదించి ఇక సారీ చెప్పి నీరు తీసుకురమ్మని అంటాడు. మిధున బకెట్‌తో నీరు తీసుకొస్తూ దేవా దగ్గరకు వెళ్లబోతూ సబ్బు తొక్కి దేవా మీద జారిపోతుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు హగ్ చేసుకొని బాత్‌రూమ్‌లో ఒకర్ని ఒకరు పట్టుకొని చూస్తూ ఉండిపోతారు.
చీర కట్టులో దేవాని అల్లాడించిన భానుమతి
దేవా తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి మిధున తనకు టార్చర్ పెడుతుందని తనని వదిలించుకోవడానికి బ్రహ్మాండమైన ఐడియా కావాలి అని అంటాడు. అందరూ ఏం ఐడియా ఇవ్వాలా అని ఆలోచిస్తారు. మిధున మీద గృహ హింస కేసు పెట్టమని అంటారు. దేవా తల పట్టుకుంటాడు. ఇంతలో దేవా దగ్గరకు భానుమతి చక్కగా రెడీ అయి చీర కట్టులో వస్తుంది. ఐలవ్‌యూ రాజా అంటుంది. దేవా తిక్కతిక్కగా ఉందా అని తిడతాడు. నాకు ఫుల్ క్లారిటీ ఉంది రాజా నా మీద నీకు చాలా ప్రేమ ఉందని అంటుంది. దేవా కసురుకున్నా వదలదు. త్వరలోనే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావ్ చూస్తూ ఉండు అని చెప్పి వెళ్లిపోతుంది. ఇంట్లో ఆవిడ ఇక్కడ ఈవిడ ఏంట్రా నాకు ఈ టార్చర్ అని దేవా నెత్తిబాదుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రి కాలర్ పట్టుకున్న కార్తీక్.. శ్రీధర్ చెప్పిన నిజం దీప మాయం!





















