Nuvvunte Naa Jathaga Serial Today April 2nd: నువ్వుంటే నా జతగా సీరియల్: 30 రోజుల్లో భర్తని మార్చుకోవడం ఎలా? మిధున లేటెస్ట్ ఐడియా!
Nuvvunte Naa Jathaga Today Episode మిధున దేవాతో సత్యమూర్తి, శారదల ఆవేదన చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode ముగ్గురు కొడుకుల్లో ఒక్క కొడుకు కూడా సక్రమంగా లేడని సత్యమూర్తి బాధపడిన మాటల్ని మిధున గుర్తు చేసుకొని బాధ పడుతుంది. ఇంతలో దేవా ఇంటికి వస్తాడు. కరెంట్ బిల్ కట్టలేదని కరెంట్ కట్ చేశారు కదా మరి కరెంట్ ఎలా వచ్చింది అని మిధునని అడుగుతాడు. మావయ్య గారు కరెంట్ బిల్ కట్టి వచ్చిన తర్వాత కరెంట్ వచ్చిందని మిధున చెప్తుంది.
దేవా: ఏంటి ఇళ్లంతా సైలెంట్‌గా ఉంది. అందరూ ఎక్కడున్నారు.
మిధున: అందరూ గొడవ జరిగిన బాధలో ఉన్నారు ఎవరూ బయటకు రావడం లేదు. భోజనం చేద్దురు పదండి.
దేవా: నాకు మనసు ఏం బాలేదు తినాలని లేదు.
మిధున: మీ అమ్మగారు మీకు కచ్చితంగా తినమన్నారు లేదంటే బాధ పడతారు.
దేవా: బాధ మా అమ్మ జీవితంలో ఒక భాగం అయిపోయిందో లేదంటే బాధే మా అమ్మ జీవితం అయిపోయిందో అర్థం కావడం లేదు. మమల్ని కన్న నేరానికి మా అమ్మ జీవితాన్ని ఆ దేవుడు అలా రాసి పెట్టాడు. ఏం చేస్తాం మా ముగ్గురు అన్నదమ్ములవి మూడు దారులు. మూడు ప్రపంచాలు. ఎవరి దారి వాళ్లది. ఒకరికీ ప్రేమ లేదు. వాళ్లు అసలు అన్నయ్యలేనా.
మిధున: మీరు వాళ్లని అంటున్నారు. కానీ మీకు బాధ్యతలు తెలీడం లేదని జీవితం అర్థం లేకుండా పోతుందని మీరు రౌడీ అయిపోయారని మామయ్యగారు, అత్తయ్య గారు ఎంత బాధ పడుతున్నారో మీకు తెలుసా.
దేవా: ఇది నేను ఊహించని జీవితం. ఇది నేను తప్పక చేయాల్సిన యుద్ధం. ఆ రౌడీ అనే ప్రపంచం నుంచి నేను బయటకు రాలేను. నేను రౌడీగా మారడానికి నా వైపు నుంచి న్యాయం ఉంది. నా వాళ్లు నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఏదో కన్నందుకు ఇంత తిండి పెడుతున్నారు. పడుకోవడానికి ఇంత ప్లేస్ ఇచ్చారు. నా ఇంట్లో నేను ఓ అతిథిని. నేను ఓ పరాయి వాడిని. కానీ మా అన్నలు ఇద్దరు ఉన్నారు కదా వాళ్లకి అమ్మానాన్నల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత లేదా.
మిధున: వాళ్లకే కాదు నీకు ఆ బాధ్యత ఉంది. నువ్వు కొడుకువే. ఈ ఇంటిని మీ అమ్మానాన్నల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. మరి నీ బాధ్యతల్ని నువ్వు వదిలేసి వాళ్ల మీద తోసేస్తున్నావేంటి.
దేవా: ఏయ్.. నేను చూసుకోను అన్నానా. నా డబ్బు మా నాన్న తీసుకోవడం లేదు కదా నాకు డబ్బు ఇవ్వమని ఒక్క మాట చెప్పమను. మా నాన్న రూపాయి తీయకుండా అందర్నీ నేనే దర్జాగా చూసుకుంటా.
మిధున: కన్నవాళ్లని చూసుకునేది దర్జాగా కాదు. సంతోషంగా చూసుకోవాలి. మీ అన్నాదమ్ములు ముగ్గురు ఎందుకు అంత కడుపు కోత పెడుతున్నారు వాళ్ల బాధ కళ్లారా చూస్తే నా గుండె తరుక్కుపోయింది.
దేవా: తెలీకుండా మాట్లాడకు. అనుకోకుండా నేను రౌడీ అనే ఊబిలో ఇరుక్కుపోయాను. నేను చేస్తున్నది చేసింది కరెక్ట్ అని నేను సమర్దించుకోను. మరి మా పెద్దోడు ఆనంద్ బాగా చదువుకున్నాడు. వాడి బుద్ధి ఏమైంది. అమ్మానాన్నల్ని సంగతి అటు ఉంచు కనీసం మా వదినను అయినా చూసుకున్నాడా. ఒక్క రోజు ఒక్క మూర మల్లెపూలు తీసుకొచ్చాడా. మా వదిన దేవత కాబట్టి వాడిని భరిస్తుంది. అదే స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే వాడి ముఖం మీద ఊసేసి వెళ్లిపోయేది. అంత చదువుకొని ఉద్యోగం చేయడానికి ఏమైంది వాడికి.
మిధున: ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేకుండా అన్నీ సమకూరుతున్నాయి కదా మరి జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటారు. మీ అన్నయ్య కూడా అలాంటి వాడే మీ అన్నయ్య కూడా.
దేవా: అంటే వాడిని మార్చడం కష్టం అంటావా.
మిధున: దానికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. కష్టపడితేనే తిండి అయినా ఏమైనా వస్తాయని మనం తెలిసేలా చేయాల్సింది.
దేవా: పెద్దోడు ఓ రకం అయితే ఇదిగో ఈ గదిలో ఉంటారు రెండోవాడు. బిర్యాని వాసన రాకుండా అగరబత్తీ వెలిగించుకొని పెళ్లానికి గోరు ముద్దలు తినిపించుకుంటాడు. అటు వాడు ఇటు వీడు వేస్ట్ ఫెలోలు.
మిధున: ఈ ఇంటి విషయంలో మీ ముగ్గురు అన్నదమ్ములు చేస్తుంది తప్పు. నువ్వు ముందు మారాలి.
అటు తిరిగి ఇటు తిరిగి ఇద్దరూ తమ పెళ్లి గురించి గొడవ పడతారు. మన గొడవ ఆపి మీ అన్నయ్యలు ఎలా దారిలోకి రావాలో చూడు అని మిధున అంటే దేవా మిధునని తిట్టి వెళ్లిపోతాడు. ఉదయం ఆనంద్ పేపర్‌లో కథలు చదువుకుంటూ నవ్వుకుంటూ ఉంటే ప్రమోదిని వచ్చి పేపర్ లాక్కొని విసిరేసి నీకు బుద్ధి ఉందా.. రోషం.. పౌరుషం ఉందా.. మామయ్య మీకు తిట్టిన తిట్టులకు నేను అవమానంతో చచ్చిపోతుంటే మీరు ఏంటి కథలు చదువుకుంటూ ఇలా ఉన్నారని అసహ్యించుకుంటుంది. ఆనంద్ ఏం పట్టించుకుంటాడు. ప్రమోదిని భర్త మీద కోప్పడటం మిధున వింటుంది. మెడలో తాళి కట్టి ఒక బిడ్డకు తల్లిని చేస్తే భర్త అయిపోతారా.. మిమల్ని నమ్ముకొని నేను ఉన్నాను. చదివించి పెద్ద చేయాల్సిన ఓ బిడ్డ ఉంది ఏం పట్టించుకోవడం లేదా అని అడుగుతుంది. దానికి ఆనంద్ ఉండటానికి ఇళ్లు ఉంది.. తినడానికి తిండి ఉంది ఇంక ఎందుకు మనకు బాధలు ఏముంటాయ్ చెప్పమని అంటాడు. ప్రమోదిని భర్తతో మనకు ఉన్న ఒక్కగానొక్క కూతురు దాన్ని తిండి పెట్టి చదివించుకోవాల్సిన మనం మీరు చదివించలేక నాపుట్టింట్లో పెట్టానని కనీసం వెళ్లడానికి టికెట్ డబ్బులు కూడా మామయ్యకి అడగాల్సి వస్తుంది మనం బిడ్డ దగ్గరకు వెళ్లడం లేదని ఏడుస్తుంది. మా అమ్మానాన్న కాలం చేస్తే మన బిడ్డని మనం ఎలా చదివిస్తామని అడుగుతుంది. అవన్నీ చిన్న విషయాలు వదిలేయ్ అని ఆనంద్ అంటాడు. ప్రమోదిని విసిగిపోయి వెళ్లిపోతుంది.
మిధున వెంటనే ఆనంద్‌ని ఏదో ఒక జాబ్‌లో చేరేలా చేయాలని అనుకుంటుంది. దేవా బయట నుంచి వస్తే కొరియర్ వస్తుంది. మిధున పేరు మీద బుక్ కొరియర్ వస్తుంది. నాకు కిక్ ఇచ్చే బుక్ అని మిధున అంటే ఏంటి అని దేవా అడిగిగే నువ్వే చూసుకో అని దేవా చేతిలో పెడుతుంది. అది 30 రోజుల్లో భర్తని మార్చుకోవడం ఎలా అనే బుక్ దేవా అది చూసి ఏంటి ఇది అని అరుస్తాడు. మిమల్ని నా దారిలోకి తీసుకురావడానికి ఇంటర్‌నెట్‌లో కూడా టిప్స్ వెతుకుతున్నానని అంటుంది. నువ్వు టార్చన్ అనే ప్రపంచానికి సిగ్నేచర్‌లా ఉన్నావే అని దేవా నెత్తిబాదుకుంటాడు. మిధున బుక్ తీసుకొని లోపలికి వెళ్లి దేవుడికి దండం పెట్టి చదవడం ప్రారంభిస్తుంది. దేవా వెనకాలే తిరుగుతూ బుక్‌లో ఏముందో చూడటానికి ప్రయత్నిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: అనంత్ పక్కనే గాయత్రీ.. ఊర్వశి దొరికిపోతుందా.. కంకణం కట్టించుకునేదెవరు?





















