Nuvvunte Naa Jathaga Serial Today April 29th: నువ్వుంటే నా జతగా సీరియల్: నేను చచ్చినా నువ్వు రావొద్దు.. మిథునతో కఠినంగా మాట్లాడిన హరివర్దన్..!
Nuvvunte Naa Jathaga Today Episode మిథునని తండ్రి తన దగ్గరకు రావొద్దు అని చెప్పడం దేవా, రాహుల్‌తో గొడవ పడటంతో మిథున దేవాని తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున హాస్పిటల్ బయట బాధపడుతుంటే మిథున చెల్లి అలంకృత వచ్చి మిథునని తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంది. మిథున తండ్రి తల నిమిరి నాన్న అని పిలుస్తుంది. హరివర్దన్ కళ్లు తెరిచి మిథునని చూస్తారు. మిథున అని ఎమోషనల్ అవుతారు. అంతలోనే మిథున చేయి తోసేసి ముఖం తిప్పుకుంటారు.
మిథున: నాన్న ఎలా ఉన్నారు.
హరివర్దన్: బతికే ఉన్నాను చంపేసి పుణ్యం కట్టుకోవాలని చూస్తున్నావా. నీ వల్లే నాకు ఈ దుస్థితి. నేను ఇలా అవడానికి కారణం నువ్వే కదా.
మిథున: ప్లీజ్ నాన్న అలా అనకండి మీ మాటలు భరించడం నా వల్ల కాదు.
హరివర్దన్: నువ్వు ఇక్కడ ఉంటే నాకు భరించడం కష్టంగా ఉంది వెళ్లిపో. కన్న కూతురు ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది. తెగిపోవడం కాదు ఒక దిక్కుమాలిన రాడీ కోసం తనే తెంచేసి వెళ్లిపోయింది.
రాహుల్: దేవా హాస్పిటల్‌కి వస్తే ఎందుకు వచ్చావ్‌రా ఇక్కడికి.
దేవా: మిథున కోసం.
దేవా మీద రాహుల్ సీరియస్ అవుతాడు. కాలర్ పట్టుకొని బయటకు వెళ్లిపోమని అంటాడు. దేవా కూల్గా మీ పరిస్థితి అర్థమైంది మిథున కోసం వచ్చా తను ఎలా ఉందో అని టెన్షన్ పడుతున్నారు ఇంట్లో అని చెప్తారు. ఇక హరివర్దన్ మిథునని వెళ్లిపోమని చెప్తారు. నాన్నని చావు బతుకుల మధ్య వదిలేసి నువ్వు ఆనందంగా వెళ్లిపోగలవులే వెళ్లిపో అని చెప్తారు. ఒక రౌడీ కోసం నువ్వు కన్న తండ్రితో పాటు నీ కల అయిన చదువు వదిలేశావ్ అలాంటి నిన్ను నేను కూతురిగా వదిలేయాలి అనే నిర్ణయానికి వచ్చాను నువ్వు వెళ్లిపో అని చెప్తాడు. మిథున షాక్ అయిపోతుంది.
రాహుల్ దేవాని తిడతాడు. విలాస వంతమైన బతుకు బతికిన నా చెల్లిని నీ లోఫర్ స్థాయికి తీసుకెళ్లి ఇప్పుడు మా స్థాయికి రావాలి అని మేం అంతా ఉన్నదగ్గరకు వచ్చావా అని అంటాడు. ఇద్దరూ గొడవ పడతారు. డబ్బు కోసం దిగజారే బతుకురా నీది అని రాహుల్ అంటాడు. రాహుల్ మాటలకు దేవా చాలా కోపంతో ఉంటాడు. ఇక హరివర్దన్ మిథునతో నువ్వు నా ప్రాణం తీయడానికే వచ్చుంటే ఇక్కడే ఉండు.. ఒక వేళ నేను చనిపోయినా దయచేసి నువ్వు మాత్రం రావొద్దు అని చెప్తారు. దాంతో మిథున ఏడుస్తూ వెళ్లిపోతుంది.
మిథున ఏడుస్తుంది. హరివర్దన్, లలిత కూడా ఏడస్తారు. రాహుల్ దేవాతో నువ్వే ఇలా ఉంటే మీ అమ్మాబాబులు ఇంకెలా ఉంటారో అని అంటాడు. దాంతో దేవా రాహుల్ గొంతు పట్టుకొని నలిపేస్తాడు. అది మిథున చూస్తుంది. దేవాని వదలమని చెప్పి దేవాని తిడుతుంది. నీకు బుద్దుందా నీకు మనసు ఉందా ఇక్కడ పరిస్థితి నీకు తెలుసా అని తిడుతుంది. దేవా జరిగింది చెప్పబోతే మాట్లాడొద్దని తిడుతుంది. బాధలో ఉన్న వారిని ఇంకా ఇంకా బాధపెడతావేంటి అసలు నీకు ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని అడుగుతుంది. బుద్ధి తక్కువై వచ్చాను అని వెళ్లిపోతాడు. మిథున అక్కడే కూర్చొని ఏడుస్తుంది.
మిథున రాత్రి అయిన ఇంటికి రాలేదు, దేవా కూడారాలేదు అంటే మిథున వాళ్ల నాన్న బకెట్ తన్నేసుంటాడేమో అని కాంతం రంగంతో చెప్తుంది. ఇంతలో దేవా సీరియస్‌గా ఇంటికి వస్తాడు. దేవాని చూసి ఇద్దరూ హరివర్దన్ చనిపోయాడేమో అని ఏడుపు మొదలెడతాడు. శారద, ప్రమోదిని వాళ్లు వచ్చి మిథున వాళ్ల నాన్నకి ఎలా ఉంది అని అడుగుతారు. ఇంతలో మిథున అక్కడికి వస్తుంది. దేవా సీరియస్‌గా చూసి వెళ్లిపోతాడు. మిథున కూడా మాట్లాడకుండా వెళ్లిపోతుంది. అందరూ టెన్షన్ పడతారు. దానికి కాంతం మిథున నాన్నకి ఏం కాలేదు కానీ దేవా, మిథునల మధ్య ఏదో పెద్ద గొడవే జరిగిందని చెప్తుంది. మిథున తండ్రి మాటలు తలచుకొని ఏడుస్తుంది. దేవా రాహుల్ చేసిన అవమానం గుర్తు చేసుకొని బాధ పడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మీ నాన్నని చంపేస్తావా మిధున.. వెళ్లిపో ఇక్కడి నుంచి: మిధునని గెంటేసిన త్రిపుర





















