Nuvvunte Naa Jathaga Serial Today April 25th: నువ్వుంటే నా జతగా సీరియల్: సంస్కారం అంటే ఇదేనా మాస్టారూ.. మామని ప్రశ్నించిన మిధున.. జడ్జిగారికి హార్ట్‌ఎటాక్!
Nuvvunte Naa Jathaga Today Episode తన తల్లి, నానమ్మని అవమానించినందుకు సత్యమూర్తిని మిధున ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున పుట్టింటి నుంచి వచ్చిన సారెను దేవా, సత్యమూర్తి వాళ్లని అవమానించి పంపేస్తారు. మిధున లోపలికి వస్తుంటే దేవా ఆపి మీ వాళ్లు మా పరువు తీయాలని వస్తున్నారు. ఇప్పుడు సారె పేరుతో మా పరువు బజారులో పెట్టేశారు అని అంటాడు. నువ్వు మాత్రం ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి లేకుండా మా ఇంట్లోనే ఉంటున్నావ్ అని మిధునని కొట్టడానికి చేయి ఎత్తుతాడు.
సత్యమూర్తి: రేయ్ ఆగు అసలు మనం ఈ రోజు ఇలాంటి పరిస్థితిలో ఉండటానికి కారణం ఎవరు నువ్వు కాదా. ఈ అమ్మాయి మెడలో బలవంతంగా తాళి కట్టడం వల్లే కదా. ఇంతకు ముందు ఈ ఇంటి పరువు తీయడానికి నువ్వు ఒక్కడివే ఉన్నావ్ ఇప్పుడు పెద్ద ఘనకార్యం చేసి ఈ అమ్మాయి మన నట్టింట్లో కూర్చొనేలా చేశావ్. ఇప్పుడు అటు నువ్వు ఇటు ఈ అమ్మాయి ఇద్దరూ కలిసి నా పరువుని నడిరోడ్డులో నవ్వులు పాలు చేసేశారు.
మిధున: బాగుంది సార్ బాగుంది. పరువు మర్యాద అని మీరు చాలా బాగా మాట్లాడారు. మరి మీరు ఇప్పుడు బయట ప్రవర్తించిన తీరుని మా వాళ్లతో ప్రవర్తించిన దాన్ని మర్యాద, గౌరవం అంటారా సార్.
దేవా: ఏయ్..
మిధున: నేను నీతో మాట్లాడటం లేదు ఈయనతో మాట్లాడుతున్నా. మీరు బయట నడుచుకున్న పద్ధతేనా సార్ ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్ది పరువు మర్యాదలు సంపాదించే వ్యక్తులు ప్రవర్తించే తీరు.
శారద: చూడమ్మా ఆయన కోట్లు సంపాదించకపోవచ్చు కానీ అంత కంటే గొప్ప ఆత్మ గౌరవం సంపాదించుకున్నారు. ఈ ఇంటి పెద్దగా వాటిని వద్దు అని చెప్పే హక్కు ఆయనకు ఉంది. నువ్వు ఆయన నిర్ణయాన్ని తప్పు అని చెప్పే హక్కు నీకు లేదు.
మిధున: నేను ఆయన నిర్ణయాన్ని తప్పు అని చెప్పడం లేదు. కానీ ఆ నిర్ణయం చెప్పిన విధానం ప్రవర్తించి తీరు కరెక్ట్ కాదు అని చెప్తున్నా. ఇంటికి వచ్చిన శత్రువుకైనా కూర్చొపెట్టి గ్లాస్ మంచి నీరు ఇస్తారు కానీ మీరు మా అమ్మని నానమ్మని ఎంతలా అవమానించారో తెలుసా సార్. మీ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్‌కి ఇలాంటి సంస్కారమే నేర్పారా సార్.
దేవా: ఏయ్ మా నాన్నని పట్టుకొని అలా మాట్లాడటానికి ఎంత ధైర్యం నీకు. ఎదుటి వాళ్లు నచ్చకపోతే అలాగే ప్రవర్తిస్తారు.
మిధున: ఇవే మాటలు ఇంట్లోకి పిలిచి చెప్పొచ్చు అలా రోడ్డు మీద నిలబెట్టి చెప్పాలా. ఇంట్లోకి పిలిచి మాట్లాడుంటే మీ గొప్పతనం ఇంకా పెరిగేది సార్. అంతే కానీ వాళ్లని అలా రోడ్డు మీద పెట్టి మాట్లాడటానికి వాళ్లేం ద్రోహం చేయలేదు సార్ మీకే కాదు సార్ వాళ్లు ఎవరికీ ద్రోహం చేయరు.
దేవా: మానాన్నకే చెప్తావా నువ్వెంత నీ వయసు ఎంత.
మిధున: ఎదుటి వాళ్లు తప్పు చేస్తే నిలదీయడానికి వయసుతో సంబంధం లేదని మీ నాన్న లాంటి మాస్టారే చెప్పారు. నన్ను మా వాళ్లు సంస్కారంగానే పెంచారు. మరి ఇష్టం లేని అమ్మాయి మెడలో తాళి కట్టమని నీకు సంస్కారం నేర్పిన మాస్టారు ఎవరు.
శారద: మిధున ఏంటమ్మా ఆ మాటలు జీవితాన్ని చూసిన పెద్దమనిషితో అలాగేనా మాట్లాడేది.
మిధున: నేను మాట్లాడుతుంది ఓ మాస్టారుతో నాకు తాళి కట్టిన భర్త తండ్రితో కాదు. ఒక వేళ నేను ఆ తాళి ఇష్టపడి కట్టించుకున్నా నా వాళ్లని అవమానించే హక్కు ఎవరికీ లేదు ముందు ఆ విషయం తెలుసుకో మిస్టర్ దేవా.
మిధున మామని ప్రశ్నించి లోపలికి వెళ్లిపోతుంది. మరోవైపు హరివర్దన్ కోర్టు నుంచి వచ్చి లలిత గురించి అడిగితే త్రిపుర వచ్చి అత్తయ్య అల్లుడి ఇంటికి వెళ్లిందని అంటుంది. ఆ రౌడీ మాకు అల్లుడు ఏంటి అని హరివర్దన్ కోప్పడతాడు. అత్తయ్య సారె తీసుకొని వెళ్లిందని కావాలంటే వెళ్లి చూడండి అని త్రిపుర అంటుంది. ఇక మీరు కూతురి కోసం ఎంత ప్రయత్నించినా ఇక మీరు జీవితంలో మిధునని ఇంటికి తీసుకురాలేరు మీ భార్య అమ్మే మీకు శత్రువులుగా మారారు ఇక మిధున ఎప్పటికీ రాదు అని త్రిపుర చెప్తుంది.
దేవాతో సత్యమూర్తి నీ వల్ల నాకు రౌడీ తండ్రీ అనే బిరుదు వచ్చింది. నువ్వు చేసిన ఓ పాపం ఓ ఆడపిల్ల రూపంలో నా ఇంట్లో నా ముందే నిలబడి నన్ను ప్రశ్నిస్తుందిరా. నా సంస్కారాన్ని నా పెంపకాన్ని ప్రశ్నించిందిరా నిన్ను కని పెంచినందుకు నాకు నువ్వు ఇలా రుణం తీర్చుకున్నవ్‌రా నీ వల్ల ఏదో ఒక రోజు ఎవరో ఒకరు చెప్పుతో కొట్టే రోజు తీసుకొస్తావ్‌రా అని ఏడుస్తూ సత్యమూర్తి వెళ్లిపోతారు. దేవా బాధతో ఇరిటేట్ అయి మిధునని చూసి నీ వల్ల నాకు మనస్శాంతే కాదు మా నాన్నకు ప్రశాంత లేకుండా చేస్తున్నావ్ నిన్ను ఎలా పంపిస్తానో చూడు అని ఛాలెంజ్ వేస్తాడు.
లలిత బామ్మ ఇంటికి వెళ్తూ మిధున గురించి మాట్లాడుతారు. ఇద్దరూ ఇంటి లోపలికి వెళ్లే సరికి హరివర్దన్ కోపంగా కూర్చొని ఉంటారు. ఎక్కడికి వెళ్లి వస్తున్నారు అని కోపంగా అరుస్తాడు. లలిత తడబడుతుంది. నమ్మకద్రోహం చేశారని భార్య, తల్లిని అంటారు. నా మాట అంటే నీకు లెక్క లేదు అని అంటారు. మిధున ఆ ఇంటిని వదిలేసి రాదు అని అర్థమైనప్పుడు మనం వదిలేస్తే ఎలా ఆ ఇంట్లో వాళ్లు మిధునతో సరిగా మాట్లాడటం లేదు మన సపోర్ట్ కూడా లేకపోతే మన మిధున మానసికంగా కృంగిపోతుంది. తనకు ఏమైనా అయితే ఆ కడుపుకోత ఎలా భరిస్తాం అని అంటుంది. అర్థం చేసుకోమని భర్తని బతిమాలుతుంది. మీరు నా వాళ్లు కాదు నా శత్రువులు అని అర్థమైందని తల్లి, భార్యతో అంటారు. ఎవర్నీ గుడ్డిగా నమ్మకూడదు అని అర్థమైందని మిధున ఇక ఎప్పటికీ ఇక్కడికి రాదు అని ఆలోచిన వస్తే గుండె నొప్పి వస్తుందని మిధున సగం చంపేస్తే మీరు పూర్తిగా చంపేశారు అని గుండె పట్టుకొని హరివర్దన్ కూలబడిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!





















