Nuvvunte Naa Jathaga Serial Today April 23rd: నువ్వుంటే నా జతగా సీరియల్: పురుషోత్తానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మిధున.. దేవాని అల్లుడిగా అంగీకరించిన లలిత!
Nuvvunte Naa Jathaga Today Episode మిధునని ఇంటికి వెళ్లిపోమని పురుషోత్తం చెప్పడం మిధున పురుషోత్తంతో దేవాని రౌడీ వృత్తి నుంచి బయటకు తీసుకొస్తా అని ఛాలెంజ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున దేవా థ్యాంక్స్ చెప్పడం గుర్తు చేసుకొని అద్దం ముందు దేవాలా నటిస్తూ థ్యాంక్స్ చెప్పుకొని నవ్వుకుంటుంది. ఇగోతో కూడా థ్యాంక్స్ చెప్తారని నువ్వు చెప్పిన విధానం చూసిన తర్వాత అర్థమైందని అనుకుంటుంది. నేను ఎందుకు నీ కోసం ఇంత ఆలోచిస్తూ మురిసిపోతున్నాను నేను నిన్ను ఇష్టపడుతున్నానా అనుకుంటుంది.
దేవా వచ్చి వింతగా చూసి ఏం చేస్తున్నావే అని అడుగుతాడు. దానికి మిధున అమ్మమ్మా నీ మీషం నన్ను గుచ్చునే గుచ్చనే అని పాటలు పాడుతుంది. దానికి దేవా హాస్పిటల్‌లో ఉండాల్సిన వాళ్లు మా కొంపలో ఉన్నారు ఏం చేస్తాం అంటాడు. దానికి మిధున థ్యాంక్స్ థ్యాంక్స్ అని వెంటపడుతుంది. లలిత మిధున గురించి ఆలోచిస్తూ ఉంటుంది. లలిత అత్తయ్య లలిత దగ్గరకు వచ్చి తన నిర్ణయాన్ని మనం గౌరవించాలమ్మ తను బాగానే ఉంది కదా ఇంక బాధ ఎందుకు అంటుంది. నా కూతురి ఇష్టాన్ని గౌరవాన్ని అంగీకరించాలని నిర్ణయించుకున్నానని లలిత అత్తయ్యతో చెప్తుంది. మంచి నిర్ణయం తీసుకున్నావ్ ఇప్పుడు మిధునకు మన సపోర్ట్ అవసరం అని బామ్మ అంటుంది. నా మనవరాలికి తల్లి రూపంలో పుట్టింటి నుంచి కొండంత బలం వచ్చిందని అంటుంది బామ్మ.
లలిత అత్తయ్యతో నా కూతురికి పెళ్లి అయినట్లు నెలపైగా అయింది కదా ఏం చేయాలి అంటే పసుపు కుంకుమ చీర సారె తీసుకెళ్లమని చెప్తుంది. భర్తకి తెలీకుండా వెళ్తాను మీరు తోడుగా వస్తారా అని లలిత అడుగుతుంది. అదంతా విన్న త్రిపుర ఆ దేవాని అల్లుడిగా ఒప్పుకుంటారా.. నా తమ్ముడు మిధున కోసం పిచ్చోడు అయిపోతుంటే మీరు సారె తీసుకెళ్తారా వెళ్లండి నేను నట్టింట్లో రచ్చ చేస్తానని అనుకుంటుంది.
మరోవైపు పురుషోత్తం దేవా మిధునల్ని దూరం చేయాలి అని అప్పుడే తనకు రాజకీయ జీవితం ఉంటుందని పురుషోత్తం లాయర్‌తో చెప్తాడు. హరి వర్దన్ కేసులతో మీకు షాక్‌లు ఇస్తాడని అంటాడు లాయర్. ఇక మిధున దగ్గరకు వచ్చిన శారదతో మిధున దేవాని పురుషోత్తానికి దూరం చేయాలని అంటుంది. దేవా బయటకు వెళ్తుంటే మిధున కీస్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావ్ అంటుంది. ఇక నుంచి నువ్వు పురుషోత్తం దగ్గరకు వెళ్లడానికి వీల్లేదని అంటుంది. నా పర్సనల్ విషయం నీకు ఎందుకు అని దేవా అంటాడు. నువ్వు ఎప్పటికీ నాకు ముక్కూ ముఖం తెలియని దానివే ఇది నా కుటుంబం నువ్వు ఎప్పటికీ నా కుటుంబం కాదు అంటాడు. ఒక్క రోజు నువ్వు కష్టపడి సంపాదించినందుకే మీ నాన్న సంతోషం చూశావ్ ఇక నువ్వు మంచి జాబ్ చేస్తే ఎంత సంతోషంగా ఉంటారో ఆలోచించు. మీ నాన్నకి ఉన్న ఏకైక బాధ నువ్వే నీకు నీ కన్న వాళ్ల కంటే ఆ పురుషోత్తమే ఎక్కువ అంటే దానికి దేవా పురుషోత్తం అన్న దగ్గర నాకు తీర్చుకోలేని రుణం ఉంది ఈ జన్మలో ఆయన్ని వదిలి రాను అంటాడు.
దేవా వెళ్లిపోయిన తర్వాత మిధున తనలో తాను రుణం అనే పెద్ద మాట వాడాడు అంటే ఏదో బలమైన కారణం ఉంది అది తెలుసుకోవాలి అనుకుంటుంది. తర్వాత మిధున ప్రమోదినితో కలిసి మార్కెట్‌కి వెళ్తుంది. దేవా మిధునని చూసి మిధున దగ్గరకు వెళ్తాడు. పురుషోత్తం తనని తాను పరిచయం చేసుకుంటాడు. గొప్పింటి అమ్మాయి అయిన నీకు రౌడీ అయిన దేవా కరెక్ట్ కాదు. నువ్వు ఎంత ప్రయత్నించినా దేవా నిన్ను భర్యగా అంగీకరించడు. నువ్వు మీ ఇంటికి వెళ్లిపో అని అంటాడు.. దానికి మిధున మీరు ఇప్పుడు ఈ విషయంలో జోక్యం చేసుకోలేరు దేవా మీ దగ్గర పని చేస్తున్నంత మాత్రాన మీరు మధ్యలో దూరలేరు అని అంటుంది. ఎంత మంది వచ్చి చెప్పినా నా నిర్ణయం మారదు మా బంధం తెగిపోదు అని చెప్తుంది. రౌడీ అనే ఒక్క దాన్ని వదిలేస్తే దేవా లాంటి మంచి వాడు ఇంకోకడు ఉండరు. దేవాని త్వరలోనే నీ దగ్గర నుంచి రౌడీ వృత్తి నుంచి బయటకు తీసుకొస్తా నా భర్తని మార్చుకుంటా అని ఛాలెంజ్ చేస్తుంది. ఈ పిల్ల మహా ముదురు మాటలతో చెప్తే వినదు అని మన రూట్‌లో వెళ్లాల్సిందే అని పురుషోత్తం అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఇక నుంచి నువ్వు దేవా భార్యవి.. ఈ ఇంటి చిన్న కోడలివి.. ఓర్నీ ఇదంతా కలా!





















