Nuvvunte Naa Jathaga Serial Today April 21st: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా తెచ్చిన బట్టలు వేసుకొన్నసత్యమూర్తి.. తండ్రి సంతోషం దేవాలో మార్పు తీసుకొస్తుందా!
Nuvvunte Naa Jathaga Today Episode దేవా తీసుకొచ్చిన బట్టలు తల్లిదండ్రలు వేసుకోవడం అది చూసి దేవా మురిసిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode శారద దేవా తీసుకొచ్చిన చీర కట్టుకుంటుంది. ఇద్దరు కొడుకులు వాళ్ల భార్యలు వచ్చి చీర చాలా బాగుంది అంటే నా చిన్న కొడుకు దేవా తన కష్టంలో కొన్నాడు అని చెప్తూ శారద మురిసిపోతుంది. చీర అంతే బాలేదు ఒక్క ఉతుకు ఉతికితే పోతుంది కాస్ట్‌లీ చీర తీసుకురాలేదు అంటుంది కాంతం. దానికి శారద మీ ఆయనకు చెప్పి కాస్ట్‌లీ చీర తీసుకురమ్మని చెప్పు అంటుంది. కాంతం షాక్ అయిపోతుంది.
ఇదంతా నీ వల్లే అని నాకు తెలుసు..
మిధున చాలా సంతోషడుతుంది. శారద వెళ్లి దేవాకి మేం చాలా ఇష్టం మా కోసం ఏమైనా చేస్తాడు లక్షలు ఖర్చు పెడతాడు కానీ ఇలా కష్టపడి చీర తీసుకొని రావడానికి కారణం ఏంటి? ఎవరి మాట వినని దేవా నీ మాట ఎలా విన్నాడు అని శారద అడిగితే కాస్త హర్ట్ అయినట్లు చెప్పడంతో విన్నాడు అని మిధున చెప్తుంది. దేవాలో ఈ మార్పు ఇంకా మర్చిపోలేకపోతున్నా అని శారద అంటుంది. దానికి మిధున శారదతో మీ అబ్బాయి మంచోడు ఏదో బలమైన కారణంతో ఇలా రౌడీగా మారాడు అతన్ని కరిగిస్తే కచ్చితంగా మారుతాడని అంటుంది. నువ్వు నా కోసం ఆ దేవుడే నిన్ను గిఫ్ట్‌గా పంపాడని అంటుంది. మనం అంతా సంతోషంగా ఉండే రోజుని మీరు త్వరలోనే చూస్తారని మిధున అంటుంది.
నీ నోట సంతోషం అనే మాట విని ఎన్నాళ్లైందో..
తండ్రి తాను కష్టపడి తెచ్చిన బట్టలు విసిరేయడంతో దేవా బాధ పడుతుంటాడు. శారద దేవా దగ్గరకు చీర కట్టుకొని వెళ్లడంతో దేవా చాలా సంతోష పడతాడు. నేను చాలా సంతోషంగా ఉన్నానని శారద అనడంతో నీ నోటి నుంచి సంతోషం అనే మాట విని ఎన్నాళ్లు అయిందని దేవా బాధ పడతాడు. ఈ సంతోషం మాకు జీవితాంతం అందించరా ఆ పురుషోత్తం దగ్గర మానేసి నీ సొంత కాళ్ల మీద నిలబడరా. మీ నాన్న కూడా నిన్ను దగ్గరకు తీసుకుంటారని శారద చెప్పి కొడుకుని ముద్దాడి వెళ్లిపోతుంది.
మిధునే కారణం అండీ..
శారద దేవా తెచ్చిన చీర కట్టుకొని భర్త దగ్గరకు వెళ్తుంది. కొత్త చీరలో నిన్ను చూసి చాలా ఏళ్లు అయిందని అంటారు. నా సంతోషానికి ఈ చీరకి అన్నీంటికీ మిధునే కారణం అని శారద భర్తతో చెప్తుంది. మిధున దేవాలో మార్పునకు కారణం అవుతుందని అంటుంది. మీరు చెప్పినా నేను చెప్పినా వినని దేవా కనీసం ఒక్క రోజు అయినా మీకు నచ్చినట్లు మార్చిందని మిధున చాలా మంచిదని అంటుంది. దానికి సత్యమూర్తి తను మంచిదే కానీ ఈ ఇంటికి సంబంధం లేని మనిషి అంటుంది. మిధునని ఇంటి నుంచి వెళ్లగొట్టదని శారద అంటే నా నిర్ణయం నాకు ఉంది ఈ విషయం గురించి మాట్లాడొద్దని అంటారు.
ఈ బట్టలు కట్టుకోండి..
శారద దేవా కొన్ని బట్టలు భర్తకి ఇస్తుంది. ఇవి నాకు ఇస్తావేంటి అని సత్యమూర్తి అంటే వాడు మన కోసం కష్టపడి కొన్నాడు దయచేసి నా కోసం వీటిని కట్టుకోండి అని భర్తని బతిమాలుతుంది. దాంతో సత్యమూర్తి వాటిని సంతోషంగా వేసుకుంటాడు. సంతోషంగా వాటిని వేసుకొని బయటకు వెళ్లడం మిధున శారద చూసి సంతోష పడతారు.
నా చిన్న కొడుకు కొన్నాడు..
దేవా తండ్రిని కొత్త బట్టల్లో చూసి మురిసిపోతాడు. సత్యమూర్తి తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లడం వాళ్లు కొత్త బట్టలు ముగ్గురి కొడుకుల్లో ఎవరు కొన్నారని అడగటంతో నా చిన్న కొడుకు కొన్నాడని సత్యమూర్తి చెప్తాడు. నేను కష్టపడి తెచ్చిన బట్టలు మీరు కట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది జీవితాంతం గుర్తిండిపోతుందని అనుకుంటాడు. ఇక రాత్రి ముగ్గురు కొడుకులు పుట్టిన రోజు వేడుకలు జరిపిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: రత్నమాలకు పక్షవాతం.. గిరి మారిపోయాడా.. త్రిపుర పెళ్లికి ఒప్పుకుంటుందా!





















