Nindu noorella savaasam Serial Weekly Roundup September 1st to 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: గడచిన వారం నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌లో ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం.
Nindu nooleralla savaasam serial weekly episode September 1st to 6th: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈ వారంలో చాలా ఆసక్తికరంగా జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఏం జరిగిందంటే

Nindu noorella savaasam Serial weekly Episode: చిత్ర వెటకారంగా మనును చూస్తూ ఇక నువ్వు తట్టా బేడా సర్దేసుకో మను.. ఎందుకంటే అమరేంద్ర బావ ఇక నీకు పడడు.. ఆ భాగీ ఉన్నంత వరకు నీ ఆశలు అడియాసలే అవుతాయని చెప్తుంది. మను కోపంతో ఊగిపోతూ.. ఆ మాట ఇంకొక్కసారి అన్నావంటే.. నిన్ను చంపేస్తాను చిత్ర అంటూ కోప్పడుతుంది. ఉన్న మాటే అన్నాను కదా మను నిజం యాక్సెప్ట్ చేయాలి అనగానే.. ఏంటే నిజం నేను ఇన్నాళ్లు ఎదురుచూసింది.. ఎందుకు ఇక అనగానే.. మను నువ్వు ఇక ఎన్నాళ్లు వెయిట్ చేసినా నీ వయసు అయిపోతుంది తప్పా ప్రయోజనం లేదు.
మను హాయిగా నువ్వు కొల్‌కతా వెళ్లి రణవీర్‌తో నీ కూతురును వెతుక్కో.. నీ టైం సేవ్ అయిపోతుంది అని చిత్ర చెప్పగానే.. మనోహరి కోపంగా చిత్ర గొంతు పట్టుకుంటుంది. చంపేస్తాను అంటూ తిడుతుంది. దీంతో మను వదులు మను..నీ వల్లే ఈ ఇంటికి కోడలు అయ్యాను. వినోద్‌కు భార్యను అయ్యాను. ఇప్పుడిప్పుడే ఒక షాపింగ్ మాల్‌కు ఓనరు అయ్యాను. ఫ్లీజ్ మను ఫ్లీజ్ నా డ్రీమ్స్ అన్ని ఒక్కోక్కటిగా ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నాను నన్ను వదులు మను.. అంటూ అడుక్కుంటుంది చిత్ర.
మనోహరి వదిలేసి వెళ్లిపోతుంది. అమర్ ఇంట్లో గణపతి పూజ స్టార్ట్ చేస్తారు. మరోవైపు రణవీర్ ఇంట్లో చంభా పూజ చేసి ఆరును బంధించేందుకు కాలాను పంపిస్తుంది. వెంటనే కాలా అమర్ ఇంటికి వెళ్లి ఆరును బంధిస్తుంది. వెంటనే గణపతి ప్రత్యక్షమై కాలాను చంపేసి.. ఆరును రక్షిస్తాడు. ఆరు హ్యాపీగా ఫీలవుతుంది. చంభా భయంతో వణికిపోతుంది.
రణవీర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి అమర్, భాగీ ప్లాన్ చేస్తారు. అందుకోసం ఒక పాపను తీసుకొచ్చి రణవీర్ కూతురిలా నాటకం ఆడించాలనుకుంటారు. అందుకోసం భాగీ అనాథ శరణాలయానికి వెళ్లి ఒక పాపను తీసుకొస్తుంది. మరుసటి రోజు అమర్, రణవీర్‌ను ఆఫీసుకు పిలిచి పాప దొరికిందని రేపు ఇక్కడకు వస్తుందని చెప్తాడు.
రణవీర్ హ్యాపీగా ఫీలవుతుంటే.. ఈ విషయం మీ ఆవిడకు చెప్పండి అని అమర్ అంటాడు. ఇప్పుడే చెప్తాను అంటూ ఫోన్ తీసుకుని వెంటనే ఆగిపోతాడు రణవీర్. దీంతో అమర్ కోపంగా రణవీర్ మీ భార్య మీకు టచ్‌లోనే ఉంది కదా..? అని అడుగుతాడు. దీంతో రణవీర్ అలాంటిదేం లేదు సార్ పాప దొరికిందన్న ఆనందంలో నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు అంటూ తప్పించుకుంటాడు.
తర్వాత ఆశ్రమం నుంచి తీసుకొచ్చిన పాపను రణవీర్ ఇంటికి తీసుకెళ్లి ఈ పాపే మీ కూతురు అని చెప్తారు అమర్, భాగీ. రణవీర్ హ్యాపీగా ఫీలవుతాడు. పాపతో ఎమోషనల్ అయినట్టు నటిస్తాడు. ఇక అమర్, భాగీ, రాథోడ్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. బయట వచ్చి ఎవ్వరికీ కనిపించకుండా మఫ్టీ కాస్తుంటారు. ఇంతలో మనోహరి ముసుగు వేసుకుని రణవీర్ ఇంటికి వస్తుంది. లోపలికి వెళ్తుంది. వెనకే అమర్, భాగీ, రాథోడ్ వచ్చి వాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాడు.
సడెన్‌గా అక్కడకు వచ్చిన అమర్ వాళ్లను చూసిన రణవీర్, మనోహరి షాక్ అవుతారు. ఏం చేయాలో తెలియక అలాగే ఫ్రీజ్ అయిపోతారు. కానీ మను తన తెలివి ఉపయోగించి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. మంచి చాన్స్ మిస్ అయిందని అమర్ ఫీలవుతాడు. దీంతో ఈ వారం నిండు నూరేళ్ల సావాసం అయిపోతుంది.





















