Nindu noorella savaasam Serial Weekly Roundup August 11th to 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: గడచిన వారం నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌లో ఏం జరిగిందో మొత్తం ఏపిసోడ్స్ హైలెట్స్ పై ఓ లుక్కేద్దాం.
Nindu nooleralla savaasam serial weekly episode August 11th to 16th: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈ వారంలో చాలా ఆసక్తికరంగా జరిగింది. ఆగస్టు 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరిగిన ఏపిసోడ్స్ చూద్దాం

Nindu noorella savaasam Serial weekly Episode: యాడ్ ఫిల్మ్‌లో భాగీని నటించమని డైరెక్టర్ అడగ్గానే భాగీ ఆశ్చర్యపోతుంది. చిత్ర, మను షాక్ అవుతారు. కోపంగా భాగీని చూస్తారు. ఇంతలో అమర్ రాగానే.. భాగీ వెళ్లి అమర్ పర్మిషన్ తీసుకుంటుంది. అమర్ ఓకే అనడంతో భాగీ రెడీ అయి కిందకు వస్తుంది. భాగీని చూసిన డైరెక్టర్ షాక్ అవుతాడు. తర్వాత భాగీ యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయిపోతారు. సూపర్‌గా చేశావమని మెచ్చుకుంటారు. తర్వాత భాగీని అమర్ బెడ్ రూంలోకి తీసుకెళ్లి మిరపకాయలు, ఉప్పుతో దిష్టి తీస్తాడు. భాగీ ఎమోషనల్ అవుతుంది. అంతా కిటికీలోంచి చూసిన ఆరు కూడా ఎమోషనల్ అవుతుంది.
అమ్ము స్కూల్ లీడర్ ఎలక్షన్స్‌లో పాల్గొనడం లేదని ఆనంద్ పోటీ చేయించాలనుకుంటుంది అంజు. అనుకున్నట్టుగానే అంజు, ఆనంద్‌ను ఒప్పించి నామినేషన్ వేయడానికి తీసుకెళ్తుంది. అదే టైంలో బంటి కూడా నామినేషన్ వేయడానికి వస్తాడు. ఇద్దరి మధ్య వార్ నడుస్తుంది. అందరూ కలిసి ప్రిన్సిపాల్ రూంలో నామినేషన్ వచ్చి బయటకు వస్తారు. అయితే ఎలక్షన్స్‌కు అమ్ము, ఆకాష్ దూరం ఉంటారు. ప్రచారం చేయమని అడిగినా అమ్ము ఒప్పుకోదు. దీంతో అంజు కోపంగా ఆనంద్‌ను తీసుకుని వెళ్లిపోతుంది. మరోవైపు రాఖీ తీసుకుని గార్డెన్‌లో ఉన్న ఆరు దగ్గరకు వెళ్తుంది భాగీ. మిస్సమ్మ ఏంటి ఇవన్నీ.. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు..? అని ఆరు అడగ్గానే భాగీ ఎమోషనల్ అవుతుంది. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా అక్కా నా చిన్నప్పటి నుంచి నాకు తోడుగా ఎవ్వరూ లేరు. ఇక్కడికి వచ్చాక నువ్వు పరిచయం అయ్యావు అక్క నాకు అక్కవైన అన్నవైన నువ్వే కాబట్టి నీ చేతికి రాఖీ కట్టాలనుకుంటున్నాను అక్క. కట్టనా అక్కా.. అని అడగ్గానే కట్టు అంటూ ఆరు చేయి చాపుతుంది. భాగీ ఎమోషనల్ తో రాఖీ కట్టి ఆరుకు స్వీట్లు తినిపిస్తుంది.
తర్వాత చిత్ర వాళ్ల షాప్ ఓపెనింగ్ జరుగుతుంది. అక్కడ పంతులు షాప్ ఓపెనింగ్ ఎవరు చేస్తారు అని అడగ్గానే దూరం నుంచి చిత్రను పెంచిన తండ్రి రావు నేను చేస్తాను అంటూ వస్తాడు. రావును చూసిన చిత్ర షాక్ అవుతుంది. ఆయన దగ్గరకు రాగానే వినోద్ ఎవరు మీరు అని అడుగుతాడు. నేను చిత్రను పెంచిన తండ్రిని అంటూ తన గురించి చెప్పుకోగానే అందరూ కలిసి షాప్ ఓపెనింగ్ రావు చేత చేయిస్తారు. తర్వాత రావును పక్కకు తీసుకెల్లిన చిత్ర అక్కడి నుంచి వెళ్లకపోతే చంపేస్తానని బెదిరిస్తుంది. నువ్వు చంపినా సరే ఇవాళ వాళ్లకు నిజం చెప్తానని రావు కోపంగా వినోద్ దగ్గరకు వెళ్తుంటాడు. రావు లిప్ట్‌లో వెళ్తుంటే.. చిత్ర వెళ్లి లిప్ట్ ఆప్ చేస్తుంది. రావు మధ్యలో ఇరక్కుపోతాడు.
అమర్, రాథోడ్ గమనించి ఎలాగైనా కాపాడాలని అనుకుంటారు. ఇంతలో అమర్ రాథోడ్‌ను వెంటనే వెళ్లి లిప్ట్ ఆన్ చేయమని చెప్తాడు. రాథోడ్ వెళ్లి లిఫ్ట్ ఆన్ చేయగానే.. లిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. రావు వినోద్ దగ్గరకు వెళ్లి నిజం చెప్పబోతుంటే అప్పుడే పైకి వచ్చిన భాగీ ఆపేస్తుంది. తర్వాత చిత్ర వచ్చి రావును పక్కకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. వినోద్ తిట్టి రావును చెప్పమని అడుగుతాడు. రావు నిజం చెప్పబోతుంటే అమర్ అడ్డుపడి వినోద్‌ను కిందకు పంపిస్తాడు. రావును రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి పంపించేస్తాడు.
తర్వాత ఇంటికి వచ్చిన భాగీకి స్కూల్ లో జరిగిన ఎలక్షన్స్ విషయం చెప్తాడు ఆనంద్. దీంతో భాగీ అమ్మును ఒప్పించి ఎలాగైనా ఆనంద్ గెలిచేలా చేయాలని చెప్తుంది. అమ్ము సరే అంటుంది. అంతా విన్న మనోహరి ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసి ఆనంద్ ఓడిపోవాలని చెప్తుంది. ప్రిన్సిపాల్ సరే అంటుంది. చిత్ర మాత్రం భాగీ మీద కోపం పిల్లల మీద ఎందుకు చూపిస్తావు అని అడుగుతుంది. దీంతో అమ్మును ఒప్పించి భాగీ ఎలక్షన్స్ లో ఆనంద్ గెలవాలని చూస్తుంది. ఇప్పుడు ఆనంద్ ఓడిపోతే డిప్రెషన్ లోకి వెళ్తాడు. అందుకు కారణం భాగీ అని చెప్పి అమర్ చేత తిట్టించి వాళ్లను దూరం చేయోచ్చు అంటుంది. మను మాటలు విన్న ఆరు తిడుతుంది. దీంతో ఈ వారం నిండు నూరేళ్ల సావాసం అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















