Nindu Noorella Saavasam December 9th Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: ప్రిన్సిపల్‌కు షాకిచ్చిన అమర్, భయంతో పరుగులు తీసిన ఘోర!
Nindu Noorella Saavasam Today Episode: హాస్పిటల్లో అమర్ కంట్లో పడిన ఘోర భయంతో తప్పించుకుని అక్కడి నుంచి పారిపోవటంతో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠత ఏర్పడుతుంది.
Nindu Noorella Saavasam Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ముసుగు వేసుకొని హాస్పిటల్ లోకి ఎంటర్ అయిన ఘోర అరుంధతిని వెతుకుతూ ఉంటాడు.
మరోవైపు అంజు ఎగ్జామ్ రాయటానికి రాదు అని చెప్పటానికి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తారు అమ్ము వాళ్లు.
ప్రిన్సిపల్: ఏంటి ఇలా వచ్చారు.
పిల్లలు: అంజు ఎగ్జామ్ రాయటానికి రావడం లేదు, తనకి హెల్త్ బాగోలేదు.
ప్రిన్సిపల్: గట్టిగా నవ్వుతూ ఇన్ని రోజులు ఎగ్జామ్ ఎగ్గొట్టటానికి ఏం కారణం చెప్తుందో అనుకున్నాను ఈ కారణం చెప్పిందన్నమాట అంటుంది. అయినా తను ఎగ్జామ్ రాసి ఎక్కడ ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటుందో అని టెన్షన్ పడ్డాను.
పిల్లలు: అలా అనకండి మేడం తను ఎగ్జామ్ రాయటం కోసం ఎంత కష్టపడిందో మాకు తెలుసు. అయినా అంజు అల్లరి చేస్తుంది గాని ఎవరిని ఇబ్బంది పెట్టదు.
ప్రిన్సిపల్: పిల్లలు చేసేదాన్ని అల్లరి అంటారు, మీ చెల్లెలు చేసేదాన్ని న్యూసెన్స్ అంటారు. అయినా తన సంగతి నాకు తెలియదా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఇంతలో అమర్ ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రిన్సిపాల్ ఏంటి సార్ మీ అమ్మాయికి హెల్త్ బాగోలేదంట ఎగ్జామ్ రాయడానికి రాదంట అంటుంది.
అమర్: ఆమెకి హెల్త్ బాలేని మాట నిజమే కానీ ఎగ్జామ్ రాయటానికి వస్తుంది అనటంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రిన్సిపల్. ఎగ్జామ్ రాయటానికి ప్రిపేర్ చేయమని అటెండర్ కి చెప్తుంది.
అంజు ఉన్న పరిస్థితుల్లో ఎగ్జామ్ రాయగలదా అంటారు డాక్టర్, మనోహరి.
అమర్: తనకి ఒంట్లో బాగోలేదని, తను కూర్చోలేదని తనకి తెలుసు అయినా ఎగ్జామ్ రాయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే తనచేత ఎగ్జామ్ రాయించడమే మంచిది.
మిస్సమ్మ కూడా అదే అంటుంది. అప్పుడే అటువైపుగా వచ్చిన ఘోర అరుంధతిని చూస్తాడు. ఆమెని పట్టుకుందాం అనేసరికి అక్కడికి అమర్ వస్తాడు.
అరుంధతి: ఇప్పుడు అంజు ఎగ్జామ్ రాయటం కరెక్టేనా అంటుంది.
కరెక్టే అంటాడు అమర్. ఒకసారి గా షాక్ అవుతుంది అరుంధతి.. నా మాటలు మీకు వినిపిస్తున్నాయా అంటుంది.
అమర్: నువ్వు ఎక్కడ ఉన్నా అంజుని ఈ పరిస్థితుల్లో ఎగ్జామ్ తీసుకువెళ్లడానికి ఇష్టపడవు. కానీ అంజు కోసం తప్పడం లేదు సారీ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు అరుంధతి ఘోరని చూస్తుంది. అప్పటికే ఘోర అరుంధతిని బంధించడానికి వస్తూ ఉంటాడు. భయంతో వణికిపోతుంది. అంతలోనే మళ్లీ బయటకు వస్తాడు అమర్. ఘోరని చూసి అంజు చెప్పిన పోలికలన్నీ ఇతనిలో ఉన్నాయి అనుకుంటూ ఎవరు నువ్వు అని అడుగుతాడు. సమాధానం చెప్పకుండా పరిగెడతాడు ఘోర.
అమర్ కూడా అతనిని వెంబడిస్తాడు దారిలో వీల్ చైర్ తీసుకువస్తూ రాథోడ్ కనిపిస్తే ఆరోజు మన ఇంటికి వచ్చింది ఇతనే కదా అని అడుగుతాడు అవును అంటాడు రాథోడ్.
అమర్: డాక్టర్ ని పిలిచి ఇతనికి సిసి ఫుటేజ్ చూపించండి అని చెప్తాడు.. రాథోడ్ తో పాపని నేను స్కూల్ కి తీసుకెళ్తాను అని చెప్పి వీల్ చైర్ లో అంజుని కూర్చోబెట్టి తీసుకువెళ్తారు.
మరోవైపు ఆలోచనలో ఉన్న మంగళ దగ్గరికి కాళీ వచ్చి తను స్కూల్లో చూసిందంతా చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అవుతుంది మంగళ.
కాళీ : అక్క భాగి పనిచేస్తున్నది వాళ్ళ అక్క ఇంట్లో అని తెలిసినా, బావ అంత ప్రేమగా మసులుకుంటున్నది తన పెద్ద కూతురు పిల్లలతో అని తెలిసినా వాళ్లు వాళ్లు ఒకటి అయిపోతారు.. మనల్ని పక్కకి నెట్టేస్తారు. అప్పుడు వాళ్లు బంగ్లాలలోని మనం ఇక్కడ ఉండిపోవాల్సిందే అని గోల పెడతాడు.
మంగళ: ఇంక లాభం లేదు మనం రంగంలోకి దిగాల్సిందే.. భాగి పనిచేస్తున్న ఇంట్లో మనకి పనికొచ్చే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. వాళ్లు వాళ్లు కలిసే సమయానికి మధ్యలో నేనుండాలి అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కళ్యాణ్‌కు కనకం, కనకానికి కావ్య.. షాకుల మీద షాకులు