అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today  September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీతో బయటకు వెళ్దామన్న అమర్‌ – భాగీ అందానికి అమర్‌ ఫిదా

Nindu Noorella Saavasam Today Episode:  అరవింద్‌ ను పట్టుకోవడానికి  భాగీని తీసుకుని బయటకు వెళ్లాలనుకుంటాడు అమర్‌ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  అరవింద్‌ను పట్టుకోవడానికి అమర్‌ చెప్పిన ఐడియా బాగుందని పై ఆఫీసర్‌ చెప్పి కానీ నువ్వు నీ కుంటుంబం రిస్కులో పడతారు అంటాడు. దీంతో అమర్‌ నేను ఇండియన్‌ ఆర్మీ సార్‌. నేనే అరవింద్‌ ను పట్టుకుంటాను అంటాడు. పై ఆఫీసర్‌ సరే అని వెళ్లిపోతాడు. మరోవైపు రణవీర్‌ దగ్గరకు లాయర్‌ వచ్చి మనోహరి మనిషి బాబ్జీ కలకత్తా వెళ్లాడట. అక్కడ మథర్‌ థెరిస్సా ఆశ్రమానికి వెళ్లాడట అని చెప్తాడు. మనోహరి నీ దగ్గర నుంచి వెళ్లాక దుర్గను అక్కడ వదిలేసిందేమో అంటాడు లాయర్‌. కచ్చితంగా అలా చేసి ఉండదని రణవీర్‌ అంటాడు. దుర్గ ఎక్కడుందో కచ్చితంగా మనోహరికి తెలిసే ఉంటుందంటాడు. మరోవైపు అమర్‌ ఇంటికి వస్తాడు.

ఆరు: మా ఆయన.. ఏవండి…?

అమర్‌: మిస్సమ్మా… మిస్సమ్మా…

ఆరు: ఈయనేంటి? వచ్చీ రాగానే మిస్సమ్మను అలా పిలుస్తున్నాడు.

భాగీ: ఏంటండి అలా అరిచారు..

అమర్‌: అరవలేదు పిలిచాను. ఈరోజు మనం బయటకు వెళ్తున్నాం వెళ్లి రెడీ అవ్వు..

భాగీ: మనమంటే..

అమర్‌: మనమంటే నువ్వు నేను కాకుండా ఇంకెవరైనా వస్తారా? ఇద్దరం కలిసే బయటకు వెళ్తున్నాం.

ఆరు: ఏంటి ఇలా అడుగుతుంది మా ఆయనేనా?

మనోహరి: అమరేంటి? దాన్ని బయటకు తీసుకెళ్తా అంటున్నాడు.

అమర్: ఏయ్‌ లూజ్‌ మాట్లాడుతుంటే వెళ్లిపోతావేంటి?

భాగీ: ఇదంతా కల అండి ఇప్పుడు నేను కలలో నుంచి లేవాలి అంటే ముందు పడుకోవాలి కదా అందుకే వెళ్తున్నా..

 అని చెప్పగానే నిర్మల వచ్చి కల కాదు కాకరకాయ కాదు అంటుంది. అమర్‌ కూడా ఇది కల కాదు అంటాడు. ఎవరు చెప్పినా భాగీ కలే అంటుంది. పిచ్చి పట్టిన దానిలా నవ్వుతుంది. ఇంతలో అమర్‌ చెయ్యి పట్టుకుని గిల్లగానే భాగీ నిజమే కదా అంటూ పది నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ వెళ్తుంది.  తర్వాత అమర్‌, భాగీతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని ఒకవైపు ఆరు, మరోవైపు మనోహరి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంటారు. మరోవైపు రెడీ కావడానికి పైకి వెళ్లిన భాగీ హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో రాథోడ్‌ పైకి వచ్చి అసలు విషయం చెప్పబోతే సంతోషంలో భాగీ వినదు. రాథోడ్‌ కిందకు వెళ్లిపోతాడు. మరోవైపు అరవింద్‌ కు తన అనుచరుడు ఫోన్‌ చేస్తాడు.

అరవింద్‌: హలో చెప్పు..

అనుచరుడు: అన్నా నువ్వు చెప్పినట్టు సింగ్‌ సాబ్‌ ను కలిశాను అన్న.

అరవింద్‌: అమరేంద్ర ఎప్పుడు ఎక్కడ ఉంటాడు. ఎప్పుడు సెక్యూరిటీ ఉండదు. మొత్తం డీటెయిల్స్‌ నాకు కావాలి.

అనుచరుడు: అన్నా అన్నీ డీటెయిల్స్‌ అవసరం లేదు. అన్నా ఒక ముఖ్యమైన విషయం. అమరేంద్ర ఏ సెక్యూరిటీ లేకుండా తన వైఫ్‌ తో కలిసి బయటకు వెళ్తున్నాడట.

అరవింద్‌: ఏంటి నువ్వు చెప్తుంది నిజమా..? సమాచారం కరెక్టేనా..?

అనుచరుడు: పక్కా సమాచారం అన్న..

 అని చెప్పగానే నాకు ఒక లోకల్‌ బైకు ఒక స్నీపర్‌ కావాలని అడుగుతాడు అరవింద్. అలాగేనని కానీ అమరేంద్రను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని హెచ్చరిస్తాడు. దీంతో అమరేంద్రను ఎదుర్కోవడం ఈజీ కాదు కానీ వాడి భార్యను చంపడం ఈజీయే కదా అంటాడు అరవింద్‌.   మరోవైపు భాగీ, అమర్‌ బయటకు వెళ్తున్నారని నిర్మల, శివరాం హ్యాపీగా ఫీలవుతుంటారు. రాథోడ్‌ మాత్రం బయపడుతుంటాడు. ఇంతలో అమర్‌ రెడీ అయి రాగానే మనోహరి ఈరోజు ఏమైనా స్పెషలా అని అడుగుతుంది. ఏం లేదని ఎప్పుడూ తనని బయటకు తీసుకెళ్లలేదు కదా అని చెప్తుంది. ఇంతలో భాగీ రెడీ అయ్యి వస్తుంది. భాగీని చూసిన అమర్‌ షాకింగ్‌ గా లేచి అచ్చం మీ అక్కలాగే ఉన్నావు మిస్సమ్మ అంటాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Arrested : మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు-కౌశిక్ రెడ్డికి ఇంటి వద్ద ఉద్రిక్తత
మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు-కౌశిక్ రెడ్డికి ఇంటి వద్ద ఉద్రిక్తత
Vajedu SI Harish Suicide Case: వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్- పోలీసుల అదుపులో యువతి
వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్- పోలీసుల అదుపులో యువతి
Kaushik Reddy Latest News: మరో వివాదంలో కౌశిక్ రెడ్డి- ఇంటి చుట్టూ పోలీసుల మోహరింపు- ఇదేం ప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ 
మరో వివాదంలో కౌశిక్ రెడ్డి- ఇంటి చుట్టూ పోలీసుల మోహరింపు- ఇదేం ప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ 
Pushpa 2 Dialogues: మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga Chaitanya Sobhita dhulipala wedding Photos | వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభితా | ABP DesamAllu Arjun Sandhya Theatre Pushpa 2 | పుష్ప 2 ప్రీమియర్ కోసం సంధ్యా థియేటర్ కు బన్నీ | ABP DesamShinde Suspense in Maharastra | మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ఖరారు..కానీ | ABP Desamగోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Arrested : మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు-కౌశిక్ రెడ్డికి ఇంటి వద్ద ఉద్రిక్తత
మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు-కౌశిక్ రెడ్డికి ఇంటి వద్ద ఉద్రిక్తత
Vajedu SI Harish Suicide Case: వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్- పోలీసుల అదుపులో యువతి
వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్- పోలీసుల అదుపులో యువతి
Kaushik Reddy Latest News: మరో వివాదంలో కౌశిక్ రెడ్డి- ఇంటి చుట్టూ పోలీసుల మోహరింపు- ఇదేం ప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ 
మరో వివాదంలో కౌశిక్ రెడ్డి- ఇంటి చుట్టూ పోలీసుల మోహరింపు- ఇదేం ప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ 
Pushpa 2 Dialogues: మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
Pushpa 2 Review - పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?
పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?
Telangana: ప్రజాపాలన ముగింపు కార్యక్రమాల షెడ్యూల్ విడుదల- 7,8,9 తేదీల్లో ధూంధాం
ప్రజాపాలన ముగింపు కార్యక్రమాల షెడ్యూల్ విడుదల- 7,8,9 తేదీల్లో ధూంధాం కార్యక్రమాలు
Pushpa 2 Benefit Show Stampede: కుటుంబంలో విషాదం నింపిన పుష్ప 2 బెనిఫిట్‌ షో - తల్లి మృతి, కుమారుడి పరిస్థితి విషమం
కుటుంబంలో విషాదం నింపిన పుష్ప 2 బెనిఫిట్‌ షో - తల్లి మృతి, కుమారుడి పరిస్థితి విషమం
Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Embed widget