Nindu Noorella Saavasam Serial Today September 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: బాంబును డియాక్టివ్ చేసిన అమర్, రణవీర్ – పౌర్ణమికి ఆరును తీసుకెళ్తానన్న గుప్త
Nindu Noorella Saavasam Today Episode: తన రూంలో క్యాలెండర్‌లో పౌర్ణమిని రౌండప్ చేసి అరుంధతి ఈసారి నిన్ను వదలను అంటూ మనోహరి గట్టిగా అరవడం అమర్ వినడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: బయటి నుంచి అరవింద్ రిమోట్ ఆన్ చేస్తాడు. బాంబు పేలదు. దీంతో జామర్లు ఆన్ చేశారు. అందుకే పేలలేదు అని ఇది ఫెయిల్ అయినా దీపాలు వెలిగిస్తే వచ్చే హీట్ కు బాంబు పేలేటట్లు సెట్ చేశాను అంటాడు అరవింద్. ఇంట్లో అందరూ భక్తితో పూజ చేస్తారు. పూజ అయిపోయాక అంజు నేను హారతి ఇస్తానని అందరికీ హారతి ఇస్తుంది. బయట అరవింద్ బాంబు ఎప్పుడు పేలుతుందా..? అని వెయిట్ చేస్తుంటాడు. లోపల కళ్లు మూసుకుని మొక్కుతూ బాంబు సౌడ్ వింటాడు అమర్. అందర్నీ సైలెంట్ గా ఉండమని చెప్పి బాంబును వెతుకుతాడు. వెతగ్గా విగ్రహంలో బాంబు ఉందని తెలుసుకుని రాథోడ్ కు అదర్నీ బయటకు తీసుకెళ్లమని చెప్పి అమర్ బాంబును రణవీర్, అమర్ కలిసి డీయాక్టివేట్ చేస్తారు.
రణవీర్: సార్ ఫ్యామిలీ అంతా టెన్షన్ లో ఉన్నారు మీరు వెళ్లి మాట్లాడండి సార్.
రాథోడ్: సార్ ఏమైంది సార్..
అమర్: కంగారు పడాల్సిన పనేం లేదు. బాంబు డీయాక్టివేట్ అయిపోయింది.
అరవింద్ అనుచరుడు: అన్నా ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అన్న.
అరవింద్: వాళ్ల సంగతి తర్వాత చూస్తాను. ముందు పద
శివరాం: ఎంత పెద్ద గండం తప్పింది. అమర్, రణవీర్ లేకుంటే ఏం జరిగేదే తలుచుకుంటే భయమేస్తుంది.
నిర్మల: అంతా ఆ దేవుడి దయ అండి లేకపోతే ఇవాళ మనం ఎవరం బతికి బట్టకట్టేవాళ్లం కాదు.
అమర్: థాంక్స్ రణవీర్ నువ్వు ఉండబట్టే ఈజీ అయ్యింది. నా ఫ్యామిలీ కోసం నీ ప్రాణాలకు తెగించి నిలబడ్డావు.
రణవీర్: చేసిన తప్పును మన్నించే మంచి మనసు ఎంత మందికి ఉంటుంది సార్. అది మీకుంది. మీ లాంటి మంచోళ్లకు సాయపడ్డాను నాకు అదే చాలు సార్.
రాథోడ్: అసలు వినాయక విగ్రహం లోకి బాంబు ఎలా వచ్చింది సార్.
అని రాథోడ్ అడగ్గానే మనోహరి టెన్షన్ పడుతుంది. అమర్ అది నాకు కూడా అర్థం కాలేదు అని మనోహరిని విగ్రహం నేను చెప్పిన షాపు నుంచే తీసుకొచ్చావా? అని అడుగుతాడు. దీంతో మనోహరి షాపు అతనే కారులో పెట్టాడు అని సారీ చెప్తుంది. సరే అయిపోయింది కదా. అందరూ లోపలికి పదండి అని లోపలికి వెళ్లిపోతారు. తర్వాత గుప్త యమలోకం నుంచి కిందకు వస్తాడు. ఇంతలో యముడు వచ్చి గుప్త నువ్వు చేయవలసిన పని గుర్తుంది కదా? అని అడుగుతాడు. గుర్తుంది ప్రభు అంటూ చెప్తాడు గుప్త. ఆ బాలికకు ఇష్టము ఉంటేనే పైకి తీసుకురావాలని గుర్తు ఉంది. ఈ పౌర్ణమికి నీకా అవకాశం వచ్చింది. ఏం జరుగుతుందో ఆ బాలికకు తెలియక ముందే మన లోకమునకు తీసుకురా అని చెప్తాడు. ఇంతలో ఆరు వస్తుంది. గుప్త పైకి చూసి మాట్లాడుతున్నాడంటే రాజు గారు వచ్చినట్లున్నారు అని ఆరు పిలుస్తుంది.
ఆరు: గుప్త గారు నేను చెప్పిన హాయ్ రాజు గారికి వినిపించలేదా? అలా మాయం అయిపోయారేంటి?
గుప్త: వినిపించింది కనుకే మాయమయ్యారు. ఆయన నా వల్లే అమాయకుడు కాదు. చాలా తెలివైన వారు.
ఆరు: అబ్బో గ్యాప్ రాగానే మనిషి మాట బాగానే మారింది. అయినా ఏంటి మీరిద్దరు మీటింగ్ పెట్టారు. నన్ను పైకి తీసుకెళ్లే ప్లాన్ ఏమైనా చేశారా?
గుప్త: ఎటుల కనిపెట్టింది. నేను మాట్లాడింది విన్నదా? ఏంటి? ( అని మనసులో అనుకుంటాడు)
ఆరు: గుప్త గారు మరీ ఎక్కువ ఆలోచించకండి. నేనేమీ వినలేదు.
అని అసలు ఈరోజు ఏం జరిగిందంటే అని బాంబు విషయం గుప్తకు చెప్తుంది ఆరు. పౌర్ణమి నాడు ఆరును బంధించేందుకు ఘోర ప్రయత్నిస్తున్నాడని.. వాడి నుంచి ఆరును కాపాడాలనుకుంటాడు గుప్త. మరోవైపు పూజలు చేస్తున్న ఘోర.. ఈ పౌర్ణమి నాడు ఆ ఆత్మను బంధిస్తాను అంటాడు. మరోవైపు రూంలో క్యాలెండర్‌లో పౌర్ణమిని రౌండప్ చేసి ఈసారి నిన్ను వదలను అరుంధతి అని గట్టిగా అరుస్తుంది. ఇంతలో ఆమర్ అక్కడికి వచ్చి అరుందతిని వదలను అంటూ ఎందుకు అన్నావు. అని ప్రశ్నించడంలో మనోహరి టెన్షన్ పడుతుంది. పౌర్ణమిని ఎందుకు రౌండప్ చేశావు అని అడగడంతో మనోహరి కట్టుకథ చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: శోభ గదిలోకి వెళ్లిన భూమి – గగన్ కు పెళ్లిచూపులు అరెంజ్ చేసిన శారద