Nindu Noorella Saavasam Serial Today September 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనోహరికి ఫోన్ చేసిన బాబ్జీ – మార్కెట్ కు తాను వెళ్తానన్న మనోహరి
Nindu Noorella Saavasam Today Episode: సెక్యూరిటీ వాళ్లతో గొడవ పడుతున్న మనోహరికి రాథోడ్ ఇంటికి థ్రెట్ ఉందని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: కలకత్తా వెళ్లిన బాబ్జీ అంజు గురించి ఎంక్వైరీ చేస్తుంటాడు. మరోవైపు మనోహరి టెన్షన్ పడుతుంటుంది. బాబ్జీ ఇంకా ఏ విషయం చెప్పలేదని ఫోన్ కోసం ఎదరుచూస్తుంది. ఇంతలో బాబ్జీ ఫోన్ చేసి ఇక్కడ దుర్గ గురించి ఎవరూ సరిగ్గా ఇన్ఫర్మేషన్ చెప్పడం లేదని ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పడంతో మనోహరి కొన్ని గుర్తులు చెప్తుంది. ఇంతలో ఫోన్ సిగ్నల్ కట్ కావడంతో మనోహరి ఫోన్ పట్టుకుని బయటకు వెళ్తుంది. బయట ఉన్న సెక్యూరిటీ వాళ్లు మనోహరిని ఆపుతారు.
మనోహరి: మిమ్మల్ని పర్మిషన్ ఎవరు అడిగారు. ఇది నా ఇల్లు ఇష్టం వచ్చినప్పుడు వస్తా.. ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. అడగడానికి ఆపడానికి మీరెవరు..?
సెక్యూరిటీ: అమరేంద్ర సార్ చెప్పారు మేడం సార్ పర్మిషన్ లేకుండా ఎవరూ బయటకు వెళ్లకూడదు. ఎవరూ లోపలికి రాకూడదు.
మనోహరి: అమర్ తో నేను మాట్లాడతానులే..
సెక్యూరిటీ: ఆగండి మేడం ప్లీజ్ బయటకు వెళ్లడానికి కుదరదు. లోపలికి వెళ్లండి మేడం.
మనోహరి: చూడు అర్జెంట్ గా నేను కాల్ మాట్లాడాలి. ఇక్కడ సిగ్నల్ రావడం లేదు.
సెక్యూరిటీ: మేడం సిగ్నల్స్ ఈ ఇంటి చుట్టుపక్కల ఎక్కడా ఉండవు. ఎందుకంటే మేము జామర్స్ ఆన్ చేశాం.
అని చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది. సెక్యూరిటీ వాళ్లతో గొడవ పడుతుంది. ఇంతలో రాథోడ్ వస్తాడు. వాళ్లు మీ ప్రాణాలు కాపాడటానికే వాళ్లు ఉన్నది. మీరు లోపలికి వెళ్లండి. అని జరిగిని విషయం మొత్తం చెప్తాడు. మళ్లీ మనోహరి షాక్ అవుతుంది. మరోవైపు లోపల పిల్లలు రెడి అయ్యి హ్యాపీగా మాట్లాడుకుంటూ కూర్చుని ఉంటారు. అమర్ వచ్చి అంజును చూసి తన దొరికిన విషయం గుర్తు చేసుకుని వెళ్లిపోతాడు. తలుపు చాటు నుంచి చూసిన ఆరు, అమర్ ఎందుకు డల్ గా ఉన్నాడు అని ఆలోచిస్తుంది. అమర్ అంజు చిన్నప్పటి చైన్ తీసుకుని వెళ్లిపోతాడు. మరోవైపు కింద పిల్లలు అల్లరి చేస్తుంటారు. ఇంతలో మిస్సమ్మ బౌల్ తీసుకుని రావడంతో పిల్లలు తగలడంతో కిందపడబోయే బ్యాలెన్స్ గా నిలబడుతుంది.
అమ్ము: మిస్సమ్మ నువ్వు సూపర్ అమ్మా.. నువ్వు అన్నింటినీ బలే బ్యాలెన్స్ చేస్తావు మిస్సమ్మ.
భాగీ: థాంక్యూ... థాంక్యూ..
అంజు: అంతలా మురిసిపోకమ్మా మిస్సమ్మ. నువ్వు జస్ట్ బౌల్ ను సేవ్ చేశావు అంతే. అదే నేను స్కూల్ లో ఎంతమంది పిల్లలను సేవ్ చేశానో నువ్వు చూశావు కదా? ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు బిల్డప్ ఇస్తుంది బిల్డప్
భాగీ: ఆ ఒక్కటి కాకుండా నువ్వు లాస్ట్ గా చేసిన మంచి పని ఏంటో చెప్పు.. అంత ఎక్కువగా ఆలోచించక అంజు పాప ఏమీ ఉండవులే..
అనగానే అంజు కోపంగా అమ్మును తిడుతుంది. ఈ మిస్సమ్మ మన మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తుంది అని అమ్ము వాళ్లకు చెప్తుంది. మరోవైపు ఇక్కడే ఉంటే నా ప్రాణాలు పోతాయి. ఇక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ కావాలని అనుకుంటుంది. మరోవైపు కిందకు వచ్చిన అమర్ తాను తీసుకొచ్చిన గోల్డ్ చైన్ ను అంజుకు వేస్తాడు. అంజు హ్యాపీగా ఫీలవుతుంది. అమర్‌కు థాంక్స్ చెప్తుంది.
శివరాం: అదేంటి అమర్ అంజలికి ఒక్కదానికే తెచ్చావు మరి మిగతా ముగ్గురికి.
అంజు: డాడ్ ఫ్లీజ్ నేను చెప్పొచ్చా? తాతయ్యగారు మెడల్స్, అవార్డ్స్ , రివార్డ్స్ ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వరు. నాలాంటి విన్నర్స్ కే ఇస్తారు.
అంజలి మాట్లాడుతుంటే అందరూ ఉసూరుమంటూ వెళ్లిపోతుంటే అందర్నీ ఆగండని చెప్పి నేను ప్రాణాలకు తెగించి పిల్లల్ని మా స్కూల్ కాపాడాను అందుకే కదా డాడ్ నాకు ఈ మెడల్ ఇచ్చింది అని అడగ్గానే అవునని అమర్ అంటాడు. మిస్సమ్మ ఫోటో తీయ్ అనగానే మిస్సమ్మ ఫోటోలు తీస్తుంది. అంజు అందరితో ఫోటోలు దిగుతుంది. ఇంతలో మనోహరి లోపలికి రాగానే అంజు మా డాడీ లాకెట్ గిఫ్ట్ గా ఇచ్చారని చూడండి అనగానే ఏమీ వద్దులే అంజు. అమర్ సెలెక్షన్ బాగానే ఉంటుందని చెప్తుంది. తర్వాత అమర్ విగ్రమం తీసుకురావడానికి మార్కెట్ కు వెళ్లిపోతాడు. మరోవైపు అమర్ ఇంటికి రావడానికి రణవీర్ రెడీ అవుతాడు. తన కూతురు ఫోటో చూసుకుని ఎమోషనల్ గా ఫీలవుతాడు. మరోవైపు బయట అమర్ కారు ఎక్కుతుంటే మనోహరి వెళ్లి మనకు థ్రెట్ ఉందని నాకు తెలుసు. అందుకే నేను మార్కెట్ కు వెళ్లి విగ్రహం తీసుకొస్తాను అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?