(Source: ECI/ABP News/ABP Majha)
Nindu Noorella Saavasam Serial Today October 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరుకు వార్నింగ్ ఇచ్చిన మనోహరి – ఆరుకు అద్బుత శక్తులు వచ్చాయన్న యముడు
Nindu Noorella Saavasam Today Episode: మనోహరి గార్డెన్ లోకి వచ్చి ఆరుకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: పడుకున్న అమర్ దగ్గరకు వెళ్లి భాగీ థాంక్స్ చెప్తుంది. తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. ఇంతలో భాగీ నిద్రపోయి అమర్ మీదకు ఒరుగుతుంది. అమర్ భాగీని మంచం మీదకు పడుకోబెడతాడు. గార్డెన్ లోకి వెళ్లిన గుప్త నవ్వుతూ ఆరును ఎక్కడున్నావు బాలిక నీ ముఖము ఒకసారి చూడాలని ఉంది అంటూ పరిహాసమాడుతుంటాడు. ఇంతలో యముడు వచ్చి ఆ బాలికను తీసుకుని మన లోకానికి రమ్మని చెబితే రావటంలేదేంటని కోప్పడతాడు. నాలుగు మండలాలు ఆత్మ భూమ్మీద ఉన్నచో ఆత్మ స్పర్శ శక్తితో పాటు ఏమి అనుకుంటే అది జరిగే శక్తి వస్తుందని చెప్పి వెళ్లిపోతాడు యముడు.
గుప్త: హత విధి జరగకూడనిది జరిగిపోయింది. ఆ బాలికకు కానీ తనకు శాశ్వతంగా శక్తులు వచ్చినవి అని తెలిసినచో.. ఇక ఆ బాలిక నాతో బంతి ఆట ఆడునే..
అని గుప్త బాధపడతాడు. తర్వాత అంజలి స్కూల్ కు పెద్దవాళ్లను తీసుకెళ్తే తప్ప ఆ ప్రిన్సిపాల్ నన్ను వదిలేసేలా లేదే ఇప్పటికి ఇప్పుడు మనకోసం బకరా అయ్యేది ఏవరబ్బా.. అనుకుంటూ శివరాం దగ్గరకు వెళ్తుంది.
అంజు: గుడ్ మార్నింగ్ తాతయ్యా.. మీకే తాతయ్యా..
శివరాం: గుడ్ మార్నింగ్
అంజు: ఏమైనా కావాలా తాతయ్యా..
శివరాం: ముందు నీకేం కావాలో చెప్పు.
అంజు: నువ్వు బలే షార్ప్ తాతయ్యా ఇంట్టే పసిగట్టేస్తావు.
శివరాం: చుట్టూ పొట్టిగా ఉండే శత్రువులు ఉంటారు కదా అందుకే అలర్ట్ గా ఉంటాను. ఎం కావాలో చెప్పు.
అంజు: అది తాతయ్యా స్కూల్ లో మా ఫ్రెండ్స్ కు మా నాన్నే కాదు మా తాతయ్య కూడా పెద్ద మిలటరీ ఆఫీసరు అని చెప్పా.. వాళ్లు అస్సలు నమ్మలేదు తెలుసా..? అందుకే ఇవాళ మిమ్మల్ని తీసుకెళ్లి వాళ్లకు మిమ్మల్ని చూపించాలనుకున్నాను తాతయ్యా.
శివరాం: అంతే కదా సరే సరేలే నేను వస్తానులే..
అని చెప్పగానే అమ్ము వచ్చి అసలు విషయం చెప్తుంది. దీంతో శివరాం షాక్ అవుతాడు. నేను ఏ స్కూల్ కు రానని చెప్తాడు. దీంతో అంజు బాధపడుతుంది. ఎందుకు అంత బాధపడతావు మిస్సమ్మను అడుగు వస్తుంది అని చెప్తారు పిల్లలు. మరోవైపు గార్డెన్ లో ఆరు అటూ ఇటూ తిరుగుతుంది. గుప్త, యముడు చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటూ ఉంటాడు.
ఆరు: అబ్బబ్బా ఏంటండి ఈ ఎండ రాత్రేమో వర్షం పొద్దున్నేమో ఈ ఎండ దేవుల్లలో వెందర్ ను మానిటర్ చేసేదెవరు?
గుప్త: సరేలే బాలిక సరే బాలిక ఈసారి ముల్లోకముల మీటింగ్ జరిగినప్పుడు నిన్ను కూడా తీసుకెళ్లెదను. అప్పుడు నీవు చెప్పుము.
ఆరు: సరే సరే కొంచెం ముందే చెప్పండి ఇక్కడ ఏదైనా పని ఉంటే మళ్లీ నేను రాలేను కదా?
మనోహరి పై నుంచి గార్డెన్ లోకి చూస్తుంది. అక్కడ ఆరు ఉందని నిర్దారించుకున్న తర్వాత గార్డెన్ లోకి వస్తుంది.
మనోహరి: ఏంటే ఆరు ఇక్కడే ఉన్నావా..? ఇక్కడే ఉండి ఉంటావులే.. గేటు బయట ఉండటానికి నీకెవరు ఉంటారులే.. ఏంటే నా మొగుణ్ని కలవడానికి వెళ్లావంటా? నా గతాన్ని వెతుక్కుంటూ వెళ్లావంటే ఏదో ప్లాన్ చేస్తున్నావు అని నాకు అర్థం అయింది. నా దగ్గర నీ ఆటలు సాగవు.
అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. దీంతో ఆరు కోపంగా మనోహరిని తిడుతుంది. కనీసం ఆ దేవుడైనా దాని తిక్క కుదర్చడానికి ఏ కొమ్మో.. కాయో విరిగి దాని మీద పడి ఉంటే బాగుండు అంటుంది. దీంతో కొబ్బరిబొండం రాలి పడుతుంది. కొద్దిలో మనోహరి తప్పించుకుంటుంది. మరోవైపు పిల్లలు ముగ్గురు భాగీ దగ్గరకు వెళ్లి అంజు నీ దగ్గరకు హెల్ప్ అడగడానికి వస్తుందని నువ్వు ఒప్పుకోవద్దని చెప్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం