Nindu Noorella Saavasam Serial Today October 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: పునర్జన్మ లేదని ఆరు ఎమోషనల్ - భయంతో పారిపోయిన మను
Nindu Noorella Saavasam serial Today Episode October 24th: అరు మళ్లీ నీ కడుపులో పుట్టొచ్చని అమర చెప్పగానే.. తనకు పునర్జన్మ లేదని ఆరు బాధపడుతూ వెళ్లిపోతుంది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ హాస్పిటల్‌కు వెళ్లింది చెకప్ కోసం కాదని అబార్షన్ చేయించుకోవడానికి అని అమర్ కనిపెట్టేస్తాడు. దీంతో భాగీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు. రామ్మూర్తికి కాల్ చేస్తాడు. రామ్మూర్తి కాల్ లిఫ్ట్ చేయగానే..
అమర్: హాలో మామయ్యా హాస్పిటల్‌కు వెళ్లారా..?
రామ్మూర్తి: ఆ ఇక్కడే ఉన్నాను బాబు
అమర్: భాగీ ఎక్కడుంది..?
రామ్మూర్తి: టెస్టుల కోసమని ఇప్పుడే డాక్టర్ గారు లోపలికి తీసుకెళ్లారు…
అమర్: భాగీ టెస్టులు చేయించుకోవడం లేదండి అబార్షన్ చేయించుకుంటుంది.
రామ్మూర్తి: బాబు గారు ఏంటి మీరు అనేది.? కడుపులో బిడ్డను వద్దనుకుంటుందా..?
అమర్: అవును మామయ్య వెంటనే వెళ్లి ఆపండి నేను వస్తున్నాను.
రామ్మూర్తి కోపంగా రాథోడ్‌ను చూస్తాడు.
రాథోడ్: నన్ను క్షమించండి సార్ ఈ విషయం ఎవరితో చెప్పోద్దని మిస్సమ్మ నాతో ఒట్టు వేయించుకుంది
రామ్మూర్తి: డాక్టర్ ఆపండి.. ఆపరేషన్ ఆపండి..
అని ఆపరేషన్ థియేటర్ డోర్ గట్టిగా కొడుతుంటాడు. డాక్టర్ లోపల ఇంజక్షన్ వేయబోతు ఆగిపోతుంది. తర్వాత అందరూ బయటకు వస్తారు. భాగీ ఏడుస్తూ ఉంటుంది. హాస్పిటల్ బయట కారులో మనోహరి వెయిట్ చేస్తూ ఉంటుంది.
మను: ఈ పాటికి ఆ భాగీ కడుపులో బిడ్డ కైలాసానికి వెళ్లి ఉంటుంది. లోపలికి వెళ్లి దాని ఏడుపు ముఖం చూసి వస్తాను
అనుకుని కారు దిగబోతుంటే.. స్పీడుగా అమర్ కారులో వచ్చి దిగి హాస్పిటల్ లోకి వెళ్తాడు. అమర్‌ను చూసిన మనోహరి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అమర్ లోపలికి వెళ్తాడు.
అమర్: భాగీ
రామ్మూర్తి: రండి అల్లుడు గారు సమయానికి మీరు ఫోన్ చేయకపోయి ఉంటే చాలా పెద్ద ఘోరం జరిగిపోయేది.
అమర్: పిచ్చి పట్టిందా నీకు నువ్వేం చేయబోయావో నీకు తెలుస్తుందా..? నిన్ను (అంటూ కొట్టబోయి ఆగిపోతాడు.) రాథోడ్ నీకు ఈ విషయం తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు
రాథోడ్: సారీ సార్ మీతో చెప్పొద్దని మిస్సమ్మ నాతో ఒట్టు వేయించుకుంది.
అమర్: కడుపులో బిడ్డ నీకు భారం అయిపోయిందా..? చెప్పు.. ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేయాలనుకున్నావు.. తల్లివి కావడం నీకు ఇష్టం లేదా..? చెప్పు
భాగీ: సవతి తల్లిని అవ్వడం నాకు ఇష్టం లేదండి
అమర్: సవతి తల్లి ఏంటి
భాగీ: నాకు సొంత బిడ్డ పుడితే నా అక్క పిల్లలకు నేను సవతి తల్లినే అవుతాను కదండి.. సొంత బిడ్డపై మమకారంతో ఆ నలుగురు పిల్లలను చిన్నచూపు చూస్తానేమోనని నాకు భయం వేసింది. నా వల్ల వాళ్లు బాధపడకూడదు అనుకుంటున్నాను.. అదే నాకంటూ పిల్లలు లేకపోతే ఆ నలుగురు పిల్లలను నా పిల్లలుగానే చూసుకుంటాను కదా అనుకున్నాను.
అమర్: భాగీ ఈ పని నువ్వు ఎప్పుడో చేశావు. నా పిల్లలకు నువ్వు కేర్ టేకర్‌గా వచ్చిన రోజే నువ్వు వాళ్లను నీ సొంత పిల్లల్లా చూసుకున్నావు.. అలాగే అనుకున్నావు.. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న రోజే వాళ్లు నీ కన్న పిల్లలు అయ్యారు. వాళ్లు నీ సొంత అక్క పిల్లలు అని తెలిశాక కూడా నువ్వు వాళ్ల పట్ల నిర్లక్ష్యంగా ఉండగలవు అని ఎలా అనుకుంటున్నావు భాగీ
భాగీ: వాళ్లు నా పిల్లలు కాబట్టే నాకంటూ మళ్లీ పిల్లలు వద్దనుకుంటున్నాను అండి..
అమర్: తప్పు భాగీ మీ అక్క బతికి ఉంటే నువ్వు తల్లివి కావాలని తను చాలా కోరుకునేది. ఎవరికి తెలుసు మీ అక్కే మన కూతురుగా పుట్టొచ్చు..
ఆరు: (ఏడుస్తూ..) నాకు ఆ అదృష్ట లేదండి.. నాకు మళ్లీ జన్మ లేదని చెప్పేశారు.. ఇక ఎప్పటికీ నేను మీ ఒడి చేరలేను.. నేను మీకు శాశ్వతంగా దూరం అవతాను.. ఇక సెలవు..
అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















