Nindu Noorella Saavasam Serial Today October 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: నిజం చెప్పిన యముడు – శోక సంద్రంలో ఆరు
Nindu Noorella Saavasam serial Today Episode October 19th: తన పునర్జన్మ గురించి యముడు నిజం చెప్పడంతో ఆరు శోకసంద్రంలో మునిగిపోతుంది. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: యముడి మాటలకు ఎమోషనల్ అయిన ఆరు ఒంటరిగా కూర్చుని బాధపడుతుంది. తన పిల్లలను గుర్తు చేసుకుని ఏడుస్తుంది. యముడి మాటలు గుర్తు చేసుకుని మరింత ఎక్కువగా బాధపడుతుంది. ఇంతలో గుప్త ఆరును వెతుక్కుంటూ వస్తాడు.
గుప్త: బాలిక నువ్వు ఇచ్చట ఉంటివా.? నీకోసం నేను యమలోకం మొత్తం వెతుకుతున్నాను
ఆరు: మళ్లీ పుట్టడానికి మా లోకానికి వెళ్లలేనప్పుడు మీ లోకంలో నేను ఎక్కడ ఉంటే ఏంటి గుప్త గారు
గుప్త: నీ ఈ పరిస్థితి మాకు ఉపచారం కలిగిస్తుంది బాలిక. మా ప్రభువుల వారు ఇంతలా ఏమార్చెదరు అనుకోలేదు..
ఆరు: నా తల రాత ఇలా ఉన్నప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు లేండి.. నేను మళ్లీ వెళ్లి నా చెల్లెలుకు కూతురుగా పుడతానని ఎంతో ఆశ పడ్డాను. అదంతా నిరాశ అయింది
గుప్త: అవును బాలిక నీకు ఆశ పెట్టిన పాపమున మాకును భాగమున్నది.. మమ్ములను క్షమింపుము
ఆరు: నేను కింద ఉన్నప్పుడు విధి రాత అదీ ఇదీ అంటూ ఏదేదో చెప్పారు.. ఇప్పుడేమో క్షమించు అంటున్నారు.. ఇది కూడా విధి రాతేనా గుప్త గారు
గుప్త: కాదు బాలిక మా ప్రభువుల వారు ఆడిన నాటకం, ఆయన చేసిన వంచన, మోసం
అని గుప్త తిడుతుంటారు. ఇంతలో యముడు వస్తాడు. ఆరు గుప్త వెనక్కి వెళ్తుంది.
యముడు: విచిత్రగుప్త ఆ బాలిక ఎటుల ఉన్నదో పట్టి తీసుకురమ్ము
గుప్త వెనకాల నుంచి ముందుకు వస్తుంది ఆరు.
ఆరు: సార్ నేను ఎక్కడికి వెళ్లలేదు.. ఇక్కడే ఉన్నాను..
యముడు: మా అనుమతి లేనిదే నీవు ఎక్కడికి వెళ్లలేవు బాలిక
ఆరు: పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం ఏంటి..? మీరు పెద్ద పెద్ద పాపులను వదిలేసి నా మీద పడ్డారు.. పైగా వ్యగ్యంగా ఆ నవ్వు ఒకటి
యముడు: బాలిక నీ ఆగ్రహం నాకు అర్థం అయింది. కానీ విధి బలీయమైనది
ఆరు: విధి అని మీరు కూడా మొదలు పెట్టారా..? చెప్పండి సార్ ఇప్పుడు ఆ విధి నన్ను ఏం చేయమని చెప్తుంది.. చెప్పండి
యముడు: నువ్వు నీ సోదరి కడుపున పుట్టవలెను అని ఆశపడితివి కదా..?
ఆరు: అది అసాధ్యం అని తమరే ఆర్డర్ వేశారు కదా..? మీకు కొంచెం కూడా జాలి దయ ఏమీ లేవా..?
యముడు: నీ మీద జాలి పడి మేము మా ఆజ్ఞను దిక్కరించినా కూడా నువ్వు మళ్లీ జన్మిచండం అసాధ్యం బాలిక
గుప్త: ప్రభు తమరు తలుచుకున్నచో అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయుదురు కదా
యముడు: విధిని మార్చడం ఆ విధాతకే సాధ్యం.. కానీ విధిని ఏమార్చడం ఈ మానవుల నైజం
ఆరు: ఏం మాట్లాడుతున్నారు సార్ మా కంటికి కనిపించని విధిని మేము ఎలా వంచన చేస్తాము.
యముడు: ఎందుకు చేయలేరు బాలిక ఇన్నాళ్లు నువ్వు విధితో ఆడుకున్నావు.. ఇప్పుడు ఆ ఆట నీ సోదరి ఆడబోవుతున్నది
ఆరు: అంటే ఇప్పుడు నా చెల్లిని కూడా చంపబోతున్నారా..?
యముడు: లేదు బాలిక నువ్వు నీ సోదరికి కూతురుగా జన్మించాలని కోరుకున్నా… అందుకు మేము అవకాశం ఇచ్చినా నువ్వు మళ్లీ గర్భం నందే మరణించగలవు.
గుప్త: ఏమనుచున్నారు ప్రభు ఈ బాలిక మరుజన్మకు పిండ దశలోనే గండమున్నదా..?
అవునని ఎలా పిండంలో చనిపోతుందో మీరే మాయా పీఠికలో చూడండి అని మంత్రం వేస్తాడు యముడు. మాయాపీఠిక వస్తుంది. అది ఓపెన్ చేయగానే.. గుప్త, ఆరు చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















