Nindu Noorella Saavasam Serial Today November 7th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీని పుట్టింట్లో డ్రాఫ్ చేసిన రాథోడ్ - ప్రిన్సిపాల్ ను బ్లాక్ మెయిల్ చేసిన పిల్లలు
Nindu Noorella Saavasam Today Episode: భాగీని తీసుకెళ్లి పుట్టింట్లో డ్రాప్ చేస్తాడు రాథోడ్. పర్మినెంట్ గా ఇక్కడే ఉండటానికి వచ్చావా? అని మంగళ అడుగడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: పిల్లలు నలుగురు కలిసి ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లి సెల్పీ అడుగుతారు. దీంతో నాతో సెల్ఫీ ఎందుకు అంటూ ప్రిన్సిపాల్ అడుగుతుంది. త్వరలోనే మీరు చాలా ఫేమస్ అవుతారని మాకు అనిపిస్తుంది మేడం. అందుకే అప్పుడు మీతో సెల్ఫీ దిగి చాన్స్ రాదని ఇప్పుడే దిగుదామనుకుంటున్నాము అంటారు. పిల్లల పొగడ్తలకు పడిపోయిన ప్రిన్సిపాల్.. సరే ఓకే అంటూ సెల్ఫీ ఇవ్వబోతుండగా ఆనంద తాము తీసిని వీడియో ప్రిన్సిపాల్ కు సెండ్ చేస్తాడు. ఏదో అర్జెంట్ మెసేజ్ వచ్చినట్టు ఉంది మేడం చూసుకోండి అని చెప్తుంది. ప్రిన్సిపాల్ వీడియో ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది.
అమ్ము: ఇది కానీ బయట ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా..? మేడం. స్టేట్ మొత్తం షేక్ అవుతుంది.
ఆనంద్: అన్ని న్యూస్ చానెల్స్ మీ వెనకాల పడతాయి మేడం.. మీరు భయంకరమైన ఫేమస్ అయిపోతారు.
ఆకాష్: అలా చేసింది ఎవరో తెలియదు కానీ మీ మీద చాలా కక్ష్య పెట్టుకుని చేసినట్టు ఉన్నారు.
ప్రిన్సిపాల్: ఇందంతా అబద్దం.. అంతా అబద్దం..
అమ్ము: అబద్దం అని మీకు తెలుసు మాకు తెలుసు..కానీ జనాలకు ఏం తెలుసు మేడం.
అంజు: మేడం ఈ వీడియో చూస్తుంటే.. వాచ్ మెన్ తో పర్సనల్ పనులు చేయించుకుంటున్న ప్రిన్సిపాల్, అరాచకాలు పెరిగిపోయిన ప్రిన్సిపాల్ అని హెడ్ లైన్స్ మీద హెడ్ లైన్స్ వేసి మిమ్మల్ని భయంకరమైన ఫేమస్ చేస్తారు.
అని పిల్లలు ప్రిన్సిపాల్ ను బ్లాక్ మెయిల్ చేస్తారు. భయపడ్డ ప్రిన్సిపాల్ అలాగే చూస్తుండిపోతుంది. పిల్లలు వెళ్లిపోతారు. మరోవైపు మనోహరి.. మంగళకు ఫోన్ చేసి భాగీని అమర్ తిట్టి తరిమేశాడని చెప్తుంది. దీంతో మంగళ షాక్ అవుతుంది. వెంటనే ఇప్పుడు ఇక నీకు కోట్ల ఆస్థి వస్తుందన్నమాట అంటుంది. ఇంతలో కారు సౌండ్ విని వాళ్లు వచ్చినట్టు ఉన్నారు నేను చూసుకుంటాను అని ఫోన్ కట్ చేస్తుంది మంగళ. భాగీని తీసుకుని ఇంటికి వచ్చిన రాథోడ్‌ను ఎందుకు వచ్చారని అడుగుతుంది మంగళ. ఊరికే రెండు రోజుల్లో ఉండిపోవడానికి వచ్చింది అని చెప్పి రాథోడ్ వెళ్లిపోతాడు. మరోవైపు ప్రిన్సిపాల్ తనకు తెలిసి వాళ్లకు ఫోన్ చేసి తన వీడియో ఎవరికైనా వచ్చిందా..? అని అడుగుతుంది. ఎవరూ రాలేదని చెప్తారు. ఇంతలో రామ్మూర్తి వచ్చి ఏదైనా పని చెప్పండి అని అడుగుతాడు. నువ్వుకి ఏ పని చేయోద్దని వాచ్ మెన్ డ్యూటీ చేసుకుని వెళ్లిపో అంటుంది. మరోవైపు మనోహరి వెళ్లి బాబ్జీని కలుస్తుంది.
బాబ్జీ: ఏంటి మేడం మీరు అంటున్నది. ఇన్నాళ్లు ఎంత చేసినా అవని పని ఒక్క ప్లాన్ తో పూర్తి చేశారా..?
మనోహరి: అవును
బాబ్జీ: అంటే ఇక మీరు అమరేంద్ర గారిని పెళ్లి చేసుకుంటారా..? అయితే ఇక నా లెక్కంతా చిటికెలో సెటిల్ చేసేస్తారు.
మనోహరి: అది జరగాలంటే.. నువ్వు ఒక పని చేయాలి. ఏం పనో చెప్పండి మేడం.
బాబ్జీ: ఏం పనో చెప్పండి మేడం. నా పని అవుతుందంటే ఆ ఒక్క పని చేయడానికి రెడీ.
మనోహరి: దాన్నైతే ఇంట్లోంచి పంపించేశాను కానీ ఇప్పుడు నేను ఇంట్లోకి కోడలుగా అమర్ లైఫ్ లోకి భార్యగా అడుగుపెట్టాలి. అది జరగాలంటే అమర్ కు నా మీద బాధ్యత పెరిగి.. అమర్ కు తర్వాత ప్రేమ పుట్టాలి.
బాబ్జీ: అయనకు మీ మీద ఎలా ప్రేమ పెరుగుతుంది మేడం.
మనోహరి: నాకు డేంజర్ ఉంది. అది కూడా తన వల్లనే వస్తుందని అమర్‌కు తెలిస్తే బాధ్యత అదే పెరుగుతుంది. అది నాకు ప్రమాదం ఉందని నన్ను చంపేయబోతున్నామని నువ్వు చెప్పు. భయంతో బాధ్యత అదే పెరుగుతుంది.
అని చెప్పగానే బాబ్జీ భయంతో నేను చేయలేనని వెళ్లిపోతుంటే.. మనోహరి బాబ్జీని బ్లాక్ మెయిల్ చేస్తుంది. అమర్ నుంచి ఇప్పుడు నేను తప్పా నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అని చెప్తుంది. దీంతో బాబ్జీ అమర్ కు ఫోన్ చేసి మనోహరిని చంపబోతున్నానని నీకు దమ్ముంటే ఆపుకో అంటూ చెప్తాడు. దీంతో అమర్ షాక్ అవుతాడు. వెంటనే మనోహరికి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతాడు. వెంటనే ఇంటికి రా అని చెప్తాడు. దీంతో బాధ్యత బయట పడింది. దాన్ని ఇంటికి వెళ్లి ప్రేమగా మార్చుకుంటాను అని వెంటనే సిమ్ మార్చమని బాబ్జీకి చెప్పి వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!