అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  పిల్లల మనసు మార్చిన మను – భాగీ గురించి ఎమోషన్‌ అయిన అమర్‌

Nindu Noorella Saavasam Today Episode:  పిల్లల రూంలోకి వెళ్లి భాగీ మీద కోపం వచ్చేలా మనోహరి చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  శివరాం చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తుంటాడు అమర్‌. ఇంతలో అక్కడకు భాగీ వస్తుంది. భాగీని అలాగే చూస్తుండిపోతాడు. భాగీ దగ్గరకు రాగానే ఏమీ అనకుండా వెళ్లిపోతాడు. మరోవైపు అంజు కోపంగా అమ్ము వాళ్ల దగ్గరకు వెళ్లి భాగీ.. అమ్మ ఫోటో బయట పడేసి కాలితో తొక్కిందని చెప్తుంది. పిల్లలు మేము నమ్మం అంటారు.

అంజు: అమ్మ విషయంలో నేను అబద్దం చెప్తానా..? అంజు.

అంజు: కానీ నువ్వు తప్పు చేసింది అని చెప్తుంది మిస్సమ్మ గురించి.

ఆకాష్‌: అవును అంజు భాగీకి అమ్మ స్థానం కావాలంటే ఎంతసేపు.

అంజు: మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఇదే

అమ్ము: నువ్వు చూశావా..? మిస్సమ్మ ఫోటో కింద పడేసి తొక్కడం నువ్వు చూశావా..?

అంజు: అమ్మ ఫోటో మిస్సమ్మ తీసుకెళ్ళడం నేను చూశాను. కింద పడేసి తొక్కడం మనోహరి ఆంటీ చూసింది.

  అని చెప్పగానే మనోహరి వచ్చి నేను చెప్పానా..? ఎవరూ నమ్మరని ముందే చెప్పానా..? అంటూ మిస్సమ్మ ఆ ఫోటో తొక్కడం నేను చూశాను అని చెప్తుంది మనోహరి దీంతో పిల్లలు షాక్‌ అవుతారు. మనోహరి లేనిపోని కట్టుకథలు చెప్పడంతో పిల్లలు ఆలోచనలో పడిపోతారు. ఇంతలో భాగీ వచ్చి పిల్లలను స్కూల్ కు రెడీ అయ్యారా? అని అడుగుతుంది.

అమ్ము: మిస్సమ్మ నిన్న మా రూంలో నుంచి ఫోటోను తీసుకెళ్లావా..?

భాగీ: అవును తీసుకెళ్లాను.

అంజు: తప్పు అనిపించలేదా? మిస్సమ్మ..

భాగీ: తప్పు ఎందుకు అవుతుంది. ఆ ఫోటో గురించి అడుగుదామని తీసుకొచ్చాను. తర్వాత అది ఎక్కడ ఉండాలో అక్కడకు చేర్చాను. ఎందుకు అలా అడిగారు.

మనోహరి: ఏం లేదులే.. నువ్వు వెళ్లు మిస్సమ్మ పిల్లలను నేను తీసుకొస్తాను.

భాగీ: సరే త్వరగా రండి… స్కూల్‌ కు టైం అవుతుంది.

మనోహరి: చూశారా..? జరిగింది ఎవరికి తెలియదు అని ఎలా మాట్లాడుతుందో ఇక మీరు ఎవరి పక్కన ఉంటారో మీ ఇష్టం.

అని చెప్పి వెళ్లిపోతుంది మనోహరి. పిల్లలు బాధపడుతుంటారు. మరోవైపు గుప్త దగ్గర ఆరు బాధపడుతుంది. మనోహరి తన ప్లాన్‌ ప్రకారం పిల్లలను అడ్డుపెట్టుకుని ఏదో చేయబోతుంది అంటుంది. ఇంతలో అమర్‌ ఆఫీసుకు వెళ్తుంటే ఆరు వెళ్లి పలకరిస్తుంది. కారు దగ్గరకు వచ్చిన అమర్‌ తూలి కిందపడబోతుంటే..

రాథోడ్‌: సార్‌ ఏమైంది సార్‌..

అమర్‌: ఏం కాలేదు రాథోడ్‌.. చూసుకోలేదు.

రాథోడ్‌: మీరు చూసుకోకుండా నడుస్తున్నారా..? ఏమైంది సార్‌ దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు.

అమర్‌: నా గురించి మిస్సమ్మ గురించి మా ప్రమేయం లేకుండా మా మధ్య ముడిపడిన బంధం గురించి. నేను నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి

రాథోడ్‌: అసలు ఏమైంది సార్‌.

  అని రాథోడ్‌ అడగ్గానే శివరాం చెప్పిన మాటలు అమర్‌ గుర్తు చేసుకుని నాన్నకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం కాలేదు రాథోడ్ అంటాడు. దీంతో పెద్దయ్య గురించి చెప్పింది కూడా కరెక్టే సార్‌ అంటాడు రాథోడ్‌. పాపం మిస్సమ్మ పెళ్లి అయిన రోజు నుంచి మీ బదులు కూడా తనే పరుగెడుతుంది అంటాడు.

అమర్‌: మిస్సమ్మ ఎవరో తెలిశాక మంచి జీవితం ఇవ్వాలనిపిస్తుంది కానీ.. తనతో జీవితం పంచుకోవాలని ఎలా అనుకోవాలో తెలియటం లేదు రాథోడ్‌.

గుప్త: వారిరువురు ఏవో బాధలు పంచుకుంటున్నారు మనం వెళ్దాం పద

ఆరు: ఆగండి గుప్త గారు బాధలు కాదు.. వాళ్లిద్దరికి తెలిసిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. అదేంటో తెలుసుకుందాం ఉండండి.

అమర్‌: ఆరును దాటి జీవితాన్ని చూసుకోలేకపోతుంటే ఇప్పుడు అదే జీవితాన్ని మిస్సమ్మ తో పంచుకోవాలంటే ఎలా రాథోడ్‌.

రాథోడ్: మీ బాధ నాకు అర్తం అయింది సార్‌. కానీ మేడం గారు ఏ లోకంలో ఉన్నా నిజం తెలియగానే ఇదే కోరుకునే వారు సార్‌. అన్ని తెలిసి  నిజం కూడా తెలిశాక చెప్తున్నాను సార్‌. మేడం గారి తర్వాత ఈ ఇంటికి కోడలుగా మీకు భార్యగా ఉండే హక్కు ఒక్క మిస్సమ్మే ఉంది సార్‌.

   అని చెప్తాడు. మరోవైపు భాగీ పిల్లలను పిలిచి స్కూల్‌కు పంపిస్తుంది. పిల్లలు కోపంగా భాగీతో మాట్లాడకుండా వెళ్లిపోతారు. అంతా గమనించిన ఆరు.. మనోహరి పిల్లల మనసుల్లో విషం నింపుతుంది గుప్త గారు అంటుంది. భాగీ కూడా మనోహరిని పిలిచి పొద్దున్న పిల్లల రూంకి ఎందుకు వెళ్లావు వాళ్లతో ఏం మాట్లాడావు దేని గురించి మాట్లాడావు అని నిలదీస్తుంది. పక్కింటి అక్క ఫోటో గురించి ఎందుకు అడిగారు అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది మనోహరి. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Embed widget