Nindu Noorella Saavasam Serial Today November 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: డేంజర్‌లో భాగీ – ఆనంద్ తప్పిదమే కారణమన్న అంజు
Nindu Noorella Saavasam serial Today Episode November 24th: పుట్ బాల్ ఆడుతున్న ఆనంద్ గట్టిగా బాల్‌ను త్రో చేయడంతో అది నేరుగా భాగీ వైపు వెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీని సీమంతానికి తీసుకెళ్లమని అమర్, రామ్మూర్తికి చెప్పడంతో రామ్మూర్తి సంతోషంగా ఫీలవుతాడు.. ఆనందంలో ఇక వెంటనే వెళ్లడానికి రెడీ అవుతాడు.
రామ్మూర్తి: ఇక నేను వెళ్తాను బాబు చాలా పనులున్నాయి.. ఇంటికి వెళ్లి చుట్టు పక్కల వాళ్లను బంధువులను పిలవాలి. పైగా శుభ లేఖలు కూడా వేయించాలి.
రాథోడ్: సీమంతానికి శుభలేఖలు ఏంటి సార్
రామ్మూర్తి: బలే వాడివి రాథోడ్.. భాగీ పెళ్లి నాకు తెలియకుండా జరిగిపోయింది. ఆ పెళ్లికి నేను శుభలేఖలు కూడా పంచలేదు.. ఎవ్వరినీ పిలవలేదు ఏమీ చేయలేదు.. అందుకే ఇప్పుడు సీమంతాన్ని పెళ్లిలా చేద్దాం అనుకుంటున్నాను. నా అనుకున్న వాళ్లను పిలిచి విందు భోజనం పెడతాను.. అంగరంగవైభవంగా కార్యం జరిపిస్తాను
భాగీ: నాన్న అవన్ని ఎందుకు నాన్న మీకు ఊరికే ఖర్చు ఎక్కువ అవుతుంది
రామ్మూర్తి: నా దగ్గర ఉన్నాయి తల్లి.. నీ సీమంతం కోసం అని ఆరు నెలల నుంచి కష్టపడి కూడబెట్టాను అమ్మా.. ఆ పిల్లలు రేపు అందరూ రెడీగా ఉండండి.. మీ అమ్మ వాళ్ల ఇంటికి వెళ్తున్నాము..
పిల్లలు: ఓకే తాతయ్యా.. మేం రెడీగా ఉంటాము.. థాంక్యూ తాతయ్య
రామ్మూర్తి: నాకు కాదు పిల్లలు మీ నాన్నకు చెప్పండి ఆయన వల్లే మనం ఊరు వెళ్తున్నాం.. ఆయన వల్లే మనం ఈ సీమంతం చేయబోతున్నాం.. ఇక వెళ్లి వస్తాను బాబు..
అమర్: రాథోడ్ ను వెళ్లి మామయ్యను డ్రాప్ చేసి రా
రాథోడ్, రామ్మూర్తి బయటకు వెళ్తారు. వెనకే అమర్ వెళ్తాడు. రామ్మూర్తికి డబ్బులు ఇవ్వబోతాడు.
రామ్మూర్తి: ఎందుకు బాబు
అమర్: సీమంతం ఖర్చులకు
రామ్మూర్తి: కార్యానికి సరిపడా డబ్బులు నా దగ్గర ఉన్నాయి బాబు
అమర్: ఆ డబ్బులు ఈ ఆరు నెలలు మీ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించి ఉంటారు. ఇంకా అప్పులు కూడా చేసి ఉంటారు..
రామ్మూర్తి: అయ్యో అలాంటిది ఏమీ లేదు బాబు
అమర్: నాకు తెలుసు మామయ్య ఈ వయసులో మేము మీకు ఇవ్వాలి కానీ మీ కష్టార్జితం మీరు మాకు ఇవ్వడం ఏంటి..? తీసుకోండి.. మీ మనసుకు నచ్చినట్టుగా సంతృప్తిగా ఏ లోటు లేకుండా సీమంతం జరిపించండి.
రామ్మూర్తి: నా కూతురు సీమంతం జరిపిస్తూ అల్లుడు గారి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏం బాగుంటుంది చెప్పండి..
అమర్: ఈ డబ్బులు అల్లుడిగా కాదు.. ఒక కొడుకుగా ఇస్తున్నాను.. మీకే ఒక కొడుకు ఉంటే తీసుకోరా చెప్పండి.. మీ కొడుగ్గా నేను మీ కష్టాన్ని పంచుకోకూడదా..?
రాథోడ్: తీసుకోండి సార్.. లేకపోతే మా సార్ బాధపడతారు
రామ్మూర్తి: నేను కష్టపడకూడదని మీరు నాకు ఎన్నో చేశారు.. నిజంగా మీరు దేవుడి లాంటి వాళ్లు బాబు మీ రుణం ఎలా తీర్చుకోగలను
అమర్: అయ్యో మామయ్య ఈ చేతులతో మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి కానీ ఇలా దండం పెట్టకూడదు.. జాగ్రత్త రాథోడ్ తీసుకెళ్లు..
అనగానే రాథోడ్, రామ్మూర్తిని కారులో తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత నలుగురు పిల్లలు గార్డెన్‌లో ఆడుకుంటుంటే వాళ్ల ఆట చూడటానికి భాగీ వచ్చి కూర్చుంటుంది. ఇంతలో అంజు భాగీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. ఆనంద్ పుష్ చేసిన బాల్ భాగీ వైపు దూసుకువస్తుంది. వెంటనే కడుపులో బిడ్డ అమ్మ బాల్ వస్తుంది అంటూ అరుస్తుంది. దీంతో అంజు, భాగీ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















