Nindu Noorella Saavasam Serial Today November 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్:భాగీ కడుపులోకి ఆరు వస్తుందన్న రాథోడ్ - హ్యాపీగా ఫీలవయిన పిల్లలు
Nindu Noorella Saavasam serial Today Episode November 1st: అంజు గీసిన డ్రాయింగ్ గాల్లో తేలుతూ ఆరు ఫోటో ముందు పడుతుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఫోరెన్సెకి ల్యాబ్‌లో అసలు నిజం తెలిసిపోతే అమర్ ఏం చేస్తాడోనన్న భయంతో మనోహరి రూంలో టెన్షన్ పడుతుంది. అప్పుడే అక్కడకు చంభా వస్తుంది.
చంభా:లాభం లేదు మనోహరి సమయం మించి పోకముందే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి
మను: ఏ నిర్ణయం తీసుకోమంటావా.? ఇప్పుడు పారిపోవడానికా ఇన్నాళ్లు ఇక్కడ ఉన్నది
చంభా: ప్రమాదం వస్తున్నప్పుడు పారిపోక తప్పదు..
మను: నేను అలా చేయలేను
చంభా: పోనీ రణవీర్ సాయం ఏమైనా అడుగుదామా..?
మను: రణవీరా.. తనేం చేస్తాడు
చంభా: ఫోన్ చేసి విషయం చెప్పు తను ఏమైనా చేయోచ్చు కదా
మను: సరే నువ్వే ఫోన్ చేయ్
చంభా, రణవీర్‌కు ఫోన్ చేయగానే..
రణవీర్: చెప్పు చంభా అక్కడ విశేషాలేంటి..? దీపావళి ఎలా జరిగింది..?
చంభా: ఇక్కడ దీపావళి జరగలేదు.. కథాకళి జరిగింది
రణవీర్: ఏం జరిగింది చంభా
చంబా: భాగీ కట్టుకున్న చీరకు మనోహరి ఏదో రసాయనం పూసి భాగీ మంటల్లో కాలి బూడిదై పోవాలని పథకం వేసింది. కానీ అది బెడిసికొట్టింది
రణవీర్: ఎప్పుడూ జరిగేది అదే కదా..? ఆ తలతిక్క మనోహరి ఏదో దిక్కు మాలిన ప్లాన్ వేస్తుంది. అదేమో అనుకోకుండా రివర్స్ అవుతుంది. కొన్ని రోజులుగా ఆ ఇంట్లో అదే జరుగుతుంది. అలాంటివి ఎన్ని జరిగినా మనోహరికి బుద్ది ఉండదు.. సిగ్గు రాదు..
చంభా: కానీ ఇప్పుడు మనోహరి చిక్కుల్లో పడింది. ఆ చీరను అమరేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాడు
రణవీర్: మిలటరీ వాడితో పెట్టుకుంటే అలాగే ఉంటుంది
చంభా: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నిజం బయట పడిందంటే మనోహరి ప్రమాదంలో పడుతుంది
రణవీర్: పడని పడితే నాకేంటి..?
చంభా: అదేంటి రణవీర్ అలా అంటావు ఎంతైనా మనోహరి నీ మాజీ భార్యే కదా..?
రణవీర్: ఆ ఫీలింగ్ నాకైతే లేదు.. మనోహరికి అసలే లేదు
చంభా: మనోహరిని కాపాడు రణవీర్ ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కంచు
రణవీర్: నా వల్ల కాదు.. అమరేంద్ర తో పెట్టుకోవడం అంటే చావుతో పెట్టుకోవడం అని నాకు బాగా అర్థం అయింది.
చంభా: అలా అనకు రణవీర్ ఈ ఒక్కసారికి కాపాడు
రణవీర్: ఇందులో నేను తలదూర్చను అమ్మా నా వల్ల కాదు అయినా ఈ ప్లాన్ నన్ను అడిగి వేశారా ఏంటి..? అమరేంద్ర జోలికి పోవద్దని చిలకకు చెప్పినట్టు చెప్పాను ఆ మనోహరికి తను నా మాటలను అసలు కేర్ చేయలేదు
చంభా: పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదు రణవీర్.. మనోహరిని నీ భార్యగా కాకపోయినా నీ స్నేహితురాలిగా చూసి కాపాడు రణవీర్
రణవీర్: తను స్నేహానికి కూడా విలువ ఇవ్వదు.. సొంత స్నేహితురాలినే చంపేసింది. అలాంటి దానిని అస్సలు నమ్మకూడదు. అదో పెద్ద కంత్రీ, కన్నింగ్, తడి గుడ్డతో గొంతు కోసే కసాయి. దాని పక్కన ఉంటే నువ్వు కూడా పోతావు చంభా నా మాట విని అక్కడి నుంచి వచ్చేసేయ్ కనీసం ప్రాణాలతో అయినా ఉంటావు
చంభా: మనోహరిని వదిలేసి ఎలా రమ్మంటావు రణవీర్
రణవీర్: తనతో ఉంటే చస్తావు అని చెప్తున్నాను కదా..? మనోహరి ఏదీ తన గొంతు దాకా తెచ్చుకోదు.. ఆ పరిస్థితే వస్తే.. ఎదుటి వాళ్ల మీదకు తోసేసి తను తప్పుకుంటుంది. ఈ చీర విషయంలో కూడా అదే జరుగుతుంది. అనవసరంగా నువ్వు బలి పశువు అవుతావు.. సో నువ్వు వెంటనే లగేజీ సర్దేసుకుని అక్కడి నుంచి వచ్చేసేయ్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి నిన్ను కోల్ కతా పంపిచేస్తాను
చంభా: సరే రణవీర్ ఉంటాను
అంటూ ఫోన్ పెట్టేస్తుంది. మనోహరి మాత్రం రణవీర్ మాటలకు కోపంగా చూస్తుంది. మరోవైపు పిల్లలు రూంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే అంజు మాత్రం డ్రాయింగ్ గీస్తుంది. ఏంటి వేస్తున్నావని ఆనంద్ అడిగితే భాగీ కడుపులో ఉన్న పాప ఫోటో అని చెప్తుంది. అందరూ ఆ డ్రాయింగ్ చూడటానికి వెళితే ఆ పేపర్ గాల్లో తేలుతూ ఆరు ఫోటో ముందు పడిపోతుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో రాథోడ్ అరుంధతి మేడమే మళ్లీ మిస్సమ్మ కడుపులో పాపగా రాబోతుందని ఈ సూచన అంటాడు. దీంతో పిల్లలు, అమర్, భాగీ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















