Nindu Noorella Saavasam Serial Today November 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీని కాటేయబోయిన కాలా – అయోమయంలో ఆరు
Nindu Noorella Saavasam serial Today Episode November 17th: ఆరు నారదుడకి నిజం చెప్పి భూలోకం పయన అవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ ఆరును గుర్తు చేసుకుని తలుచుకుంటుంది. ఆ పిలుపు యమలోకంలో ఉన్న ఆరుకు వినిపించి వెంటనే ఆరు ఎమోషనల్ అవుతుంది. చెల్లి ఇప్పుడే వస్తున్నాను అంటూ మంత్రం చదివినా ఆరు అక్కడే ఉంటుంది. దీంతో ఆరు యముడిని తిట్టుకుంటుంది. ఇంతలో అక్కడకు నారదుడు వస్తుంటాడు.
ఆరు: ఈ నారదుల వారిని అడ్డుపెట్టుకుని భూలోకానిక జంప్ అయి భాగీ డెలివరీ అయ్యే వరకు తన పక్కనే ఉండాలి
నారదుడు ఆరు దగ్గరకు వస్తాడు.
నారదుడు: ఏమిటి ఇంద్రజ నువ్వు ఇంకను ఈ నరక లోకమునే ఉంటివి.. మీ ఇంద్రపురికి వెళ్లలేదా..? నువ్వు మీ జనకుడిపై ఎప్పుడు అలిగినా కొద్ది రోజులే కదా..? ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజులు అలక పాన్పు ఎక్కితివి
ఆరు: మీరు అసలు నారదుల వారేనా..?
నారదుడు: అదేం ప్రశ్న తల్లి
ఆరు: నాకు తెలియక అడుగుతాను మీరు నిజంగా నారదుల వారేనా..? లేక నా లాగా మారు వేషంలో వచ్చారా..?
నారదుడు: అనుమానంగా నువ్వు మారు వేషంలో ఉంటివా..?
ఆరు: అవును నేను ఇంద్రజను కాదు ఇంద్రుని కూతురిని కూడా కాదు.. నా పేరు అరుంధతిని నేను మామూలు మనిషిని
నారదుడు: అసత్యం అడకుము తల్లి.. మాతో పరాచకాలు వలదు
ఆరు: మీతో అబద్దం చెప్పింది. పరాచికాలు ఆడింది ఆ రాజుల వారు చిత్రగుప్తుల వారు.. నేను నిజంగా మనిషినే చచ్చి పైకి వచ్చాను
నారదుడు: అంటే నీవు చెప్పినది సత్యమేనా..? యమధర్మరాజుల వారు మాతో అసత్యం ఆడెనా..?
ఆరు: ఎస్ అవును..
నారదుడు: సమవర్తి మమ్ములనే వంచన చేసితిరా..? మరి ఇందులో ఎటువంటి సందేహం లేదు కదా..?
ఆరు: కచ్చితంగా ఎటువంటి సందేహం లేదు..
నారదుడు: మరి నువ్వు కూడా ఇంద్రజవు అని చెప్పితివి కదా
ఆరు: ఆ రాజు గారు గుప్త గారు చెప్పమన్నారు.. నేను మీతో అబద్దం చెప్పాను సారీ ఇప్పుడు నిజం చెప్తున్నాను.. నేను దేవ కన్యను కాదు మానవ కాంతను
నారదుడు: ఇది అసంభవం బాలిక ఒక మానవ కాంత ఇన్ని దినములు నరకమున ఉండుట అసాధ్యం
ఆరు: ఎందుకు అసాధ్యం
నారదుడు: నీవు మరణించి వచ్చిన మానవ కాంత అయినచో నీకు ఇచ్చట శిక్ష అయిన వేయవలెను.. లేనిచో మరు జన్మకు అయిన పంపవలెను ఇవి రెండు చేయలేదు అనిన ఏదో తిరకాసు ఉన్నది బాలిక అది ఏమిటో పోయి యమధర్మరాజునే అడిగెదను
అని నారదుడు వెళ్లిపోతాడు.. ఆరు ఆలోచనలో పడిపోతుంది. కింద మనోహరి, చంభా ఇద్దరు కలిసి రణవీర్ దగ్గరకు వచ్చి హెల్ఫ్ అడుగుతారు.
రణవీర్: ఇరవై నాలుగు గంటలు మీరు ఆ ఇంట్లోనే ఉంటారు. మీ వల్ల కానిది నా వల్ల ఏమౌతుంది. మైసూర్ బజ్జీలో మైసూర్ ఎంతో మీరు వేసే ప్లాన్స్ అంతే.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి
మను: మేము ఆ ఇంట్లో ఏమీ చేయకుండా ఖాళీగా అయితే ఏం లేము.. కలకత్తాలో మీ ఇంటిని ఆస్థులను వెయిటింగ్ లో పెట్టి నువ్వు ఇక్కడ ఎంటీగా ఉన్నావన్న విషయం మర్చిపోకు
రణవీర్: నా పాప నాకు దక్కితేనే కదా నా ఆస్తి నాకు దక్కేది. పాప లేకుండా నేనేం చేసేది. పాపను చూపిస్తానని ఆశ పెట్టి అబద్దం చెప్పి నీ ప్లాన్ కోసం నన్ను వాడుకున్నావు..
మను: అవును భాగీ దాని బిడ్డ చస్తే నా పని నెరవేరుతుందని నీతో అలా చెప్పాను. కానీ భాగీ బతికిపోయింది. దాని బిడ్డ ఓ పది రోజుల్లో బయటికి రాబోతుంది
రణవీర్: నీ అవసరానికి ఏమైనా చెప్తావు.. ఇక నుంచి నీ చావు నువ్వు చావు
మను: ఆ బిడ్డ బయటకు వస్తే.. నాకే కాదు మనందరికి ప్రమాదమే
చంభా: అవును రణవీర్.. ఆ బిడ్డ మనందరికి గండం తెస్తుంది
రణవీర్: మరి ఏం చేయాలి
అంటూ రణవీర్ అడగ్గానే.. ఏం చేయాలో చంభా చెప్తుంది. కాలా ను ప్రయోగించి ఆ భాగీనికి చంపేద్దాం అని చెప్తుంది. దీంతో ముగ్గురు ప్లాన్ చేస్తారు. అనుకున్నట్టుగానే కాలాను అమర్ ఇంట్లోకి తీసుకొస్తారు. భాగీ హాల్లో కూర్చుని ఉండగా కాలా వెళ్లి కాటేయబోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















