Nindu Noorella Saavasam Serial Today May 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరు ఫోటో భాగీకి చూపిస్తున్న అమ్ము – షాక్‌లో మనోహరి
Nindu Noorella Saavasam Today Episode: రూంలో అనామికకు దొరికిన ఆరు ఫోటో తీసుకెళ్లి భాగీకి చూపిస్తుంది అమ్ము దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: హాస్పిటల్‌కు ఫోన్ రణవీర్ గురించి ఎంక్వైరీ చేస్తాడు అమర్. డాక్టర్ వివరాలు చెప్పగానే అమర్ షాక్ అవుతాడు. తర్వాత డాక్టర్ తన పేరు ఎక్కడ బయటపెట్టొద్దని చెప్పి కాల్ కట్ చేస్తాడు.
భాగీ: డాక్టర్ ఏం చెప్పారండి..?
అమర్: అంజును డీఎన్ఏ టెస్టుకు తీసుకెళ్లాడట
భాగీ: అసలు రణవీర్, అంజుకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించాల్సిన అవసరం ఏముంది..? అసలు ఏం జరగుతుంది
అమర్: తెలియదు భాగీ కానీ కచ్చితంగా ఇంట్లో జరుగుతున్న వాటికి రణవీర్‌కు సంబంధం ఉందనిపిస్తుంది
భాగీ: ఏవండి వెంటనే వెల్లి ఆ రణవీర్‌ను అడుగుదాం. ఇవాళ నిజం తెలుసుకుందాం పదండి
అమర్: వద్దు ఎదుటి వాడి గురించి పూర్తిగా తెలియకుండా ముందడుగు వేయడం తెలివైన పని కాదు. రణవీర్ గురించి పూర్తిగా తెలుసుకుని రమ్మని రాథోడ్ ను కోల్ కతా పంపించాను
భాగీ: ఏవండి రణవీర్ కోల్‌కతా నుంచి వచ్చాడు. మీరు అంజును కోల్ కతాలో దత్తత తీసుకున్నారు అంటే..
అమర్: అంజు కోసమే రణవీర్ వచ్చాడా..? అసలు రణవీర్‌కు అంజుకు ఏంటి సంబంధం (మనసులో అనుకుంటాడు.)
భాగీ: ఏవండి నాకు ఎందుకో భయంగా ఉందండి
అమర్: ఏం భయపడకు భాగీ నువ్వు నాతో రా.. ఒక ఇరవై నాలుగు గంటల్లో మొత్తం తెలుసుకుంటాను. అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను. మన అనుమానమే నిజమయ్యి రణవీరే అంజును కిడ్నాప్ చేయబోయాడని తెలిస్తే.. రణవీర్‌ను అసలు వదలను
అంటూ అమర్ వెళ్లిపోతాడు. మరోవైపు రణవీర్, మనోహరి మాట్లాడుకుంటుంటే..లాయర్ వస్తాడు.
లాయరు: మీరు కలిసి లేరు కాబట్టి కోర్టుకు మనోహరి రాకపోయినా పర్వాలేదు. కానీ మీరు దుర్గ కచ్చితంగా రావాలి. అది కూడా రేపే రావాలి. గుర్తుంది కదా రణవీర్ ఇదే మనకు ఉన్న ఆఖరి ఆవకాశం. ఈసారి మిస్ అయితే ఆస్తి మొత్తం ట్రస్ట్ కు వెళ్లిపోతుంది
రణవీర్: ఆస్తి నా చేయి జారిందంటే నా ప్రాణం పోయినట్టే లాయర్. ఎలాగైనా అంజలిని తీసుకెళ్లిపోవాలి
మనోహరి: ఏంటి అంజలిని తీసుకెళ్తావా..? ఎక్కడికి తీసుకెళ్తావు.. ఎలా తీసుకెళ్తావు. అమర్‌ను చూశావు కదా తన కూతురిని కిడ్నాప్ చేసిన వాళ్ల ప్రాణాలు తీయడానికి రెడీ అవుతున్నాడు. అంజలి నిన్ను చూసిన విధానం చూస్తే కిడ్నాప్ చేసింది నువ్వేమోనని కనిపెట్టిందేమోనని భయంతో చస్తున్నాను. ఇలాంటి టైంలో నువ్వు అంజలిని తీసుకెళ్లడం అంటే ఎంత ప్రమాదమో తెలుసా..?
రణవీర్: అంజలిని తీసుకెళ్లకపోయినా ప్రాణాలు పోతాయి మనోహరి. ఆస్థి నాకు ఎంత ముఖ్యమో నీకు తెలుసు కదా..?
మనోహరి: అంజలి ప్లేస్‌లో వేరే వాళ్లను తీసుకెళ్లలేమా..?
లాయరు: కుదరదండి ఆల్ రెడీ అంజలికి చెందిన అన్ని డీటెయిల్స్ కోర్టు వారికి సబ్‌మిట్ చేశాం
మనోహరి: అంజలిని కొద్ది రోజులు అమర్ బయటకు పంపించడు. ఇంక నువ్వు ఆ ఇంట్లోకి వెళ్లి అంజలిని కిడ్నాప్ చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా మానేసుకో.. అది అసలు జరగదు
రణవీర్: జరగాలి మనోహరి ఏదో ఒకటి నేనే చేయాలి. లాయరు రేపు పొద్దున్నే ప్లైట్‌కు నీకు, నాకు, అంజలికి టికెట్స్ బుక్ చేయ్.. మనం అంజలిని తీసుకుని కోల్‌కతా వెళ్తున్నాం
లాయరు: అలాగే చేస్తాను రణవీర్
మనోహరి: ఏం చేసినా బాగా ఆలోచించి చేయ్ రణవీర్. అమర్ దెబ్బ తిన్న ఆవేశంలో ఉన్నాడు. ఇప్పుడు కానీ అంజలి కిడ్నాప్ వెనక ఉన్నది నువ్వే అని తెలిస్తే మాత్రం నిన్ను ప్రాణాలతో వదలడు టైం అయింది నేను వెళ్తున్నాను.
అని చెప్పి మనోహరి వెళ్లిపోతుంది. అంజలిని ఎలా కిడ్నాప్ చేయాలా అని రణవీర్ ఆలోచిస్తుంటాడు. మరోవైపు అనామిక పిల్లలతో కలిసి రూంలో గేమ్ ఆడుతుంది. అక్కడ మంచం కింద అనామికకు ఆరు ఫోటో దొరుకుతుంది. తెలియనట్టు ఈ ఫోటో ఎవరిది అని అడుగుతుంది.
అమ్ము: ఇది మా అమ్మ ఫోటో నిన్న మిస్సమ్మకు చూపిద్దామని వెతికితే దొరకనే లేదు. ఇప్పుడే వెళ్లి మిస్సమ్మకు అమ్మ ఫోటో చూపిస్తాను.
అనామిక: మిస్సమ్మకు మీ అమ్మ ఫోటో చూపించడం ఏంటి
అమ్ము: అమ్మ ఫోటో మిస్సమ్మ ఎప్పుడూ సరిగ్గా చూడలేదట అందుకే అడిగింది. ఇప్పుడే చూపిస్తాను
అని చెప్పి వెళ్తుంది. వెంటనే అనామికకు అంతా గుర్తుకు వచ్చి కంగారు పడుతుంది. భాగీని నిజం తెలుస్తుంది. అనుకుంటూ బయటకు వెళ్తుంది. అమ్ము బయటకు వెళ్లి భాగీని పిలిచి మా అమ్మ ఫోటో చూద్దువురా అంటుంది. భాగీ పరుగెత్తుకుని వస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















