Nindu Noorella Saavasam Serial Today May 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: రణవీర్, మనుకు అమర్ షాక్ - కంప్లైంట్ ఇవ్వమన్న అనామిక
Nindu Noorella Saavasam Today Episode: అంజును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన వాళ్లను పట్టుకుని శిక్షించాలని అనామిక అమర్‌కు చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: లావణ్యను చూసి ఆరు అనుకుని వెతుక్కుంటూ వెళ్తుంది భాగీ. వెతుకుతూ వెళ్తూ మనోహరికి డాష్ ఇస్తుంది. మనోహరి కోపంగా ఏయ్ ఏంటా పరుగెత్తడం చూసుకుని వెళ్లొచ్చు కదా అంటూ తిడుతుంది.
భాగీ: మను నేను ఆరు అక్కను చూశాను
మనోహరి: రోజూ చూస్తూనే ఉన్నావు కదా
భాగీ: ఏంటి మను ఏమంటున్నావు నేను రోజూ చూడటమేంటి..?
మనోహరి: సారీ ఊరికే అన్నానులే అసలు నువ్వు ఆరును చూడటమేంటి..? పిచ్చి కానీ పట్టిందా..?
భాగీ: మను నువ్వు ఆరు అక్కా అని ఫోటో చూపించావు కదా నేను ఆ అక్కను ఇందాకే చూశాను.
మనోహరి: ఏంటి ఇక్కడికి వచ్చిందా..? అది ఉండేది ఇక్కడ కాదు కదా..?
భాగీ: ఏయ్ మను అక్క ఏమైనా మనిషా..? నువ్వు ఎక్కడ చెబితే అక్కడ ఉండటానికి అక్క మిస్ అయింది నేను వెతకాలి జరుగు
అంటూ భాగీ వెళ్లిపోతుంది. మనోహరి కంగారుగా లావణ్య ను ఇది చూసిందేమో..? ఒకవేళ ఇద్దరు కలిస్తే దీనికి నిజం తెలిసిపోతుంది. అని భాగీకి కన్నా ముందే తాను లావణ్యను కలుసుకోవాలని మనోహరి అనుకుంటుంది. మరోవైపు లావణ్యను వెతుక్కుంటూ వెళ్లిన భాగీ దగ్గరకు అనామిక వస్తుంది.
అనామిక: ఏమైంది భాగీ సార్ ఎందుకు అలా ఉన్నారు
భాగీ: అక్కా నేను ఆరు అక్కను చూశాను
అనామిక షాక్ అవుతుంది.
అనామిక: నువ్వేం మాట్లాడుతున్నావు భాగీ చనిపోయినవాళ్లు ఎక్కడైనా తిరిగి వస్తారా..? ఆత్మలు కనిపిస్తాయి అని మాత్రం చెప్పకు
భాగీ: లేదు అక్కా నాకు కనిపించింది
అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు మనోహరి వెళ్లి లావణ్యను కలుస్తుంది.
లావణ్య: హయ్ మను ఎలా ఉన్నావు.. ఎన్ని రోజులు అయిందే నిన్ను చూసి
మనోహరి: బాగున్నాను.. లావణ్య నాకోసం ఒక ఫేవర్ చేస్తావా..?
లావణ్య: అడగవే చేస్తాను
మనోహరి: వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవా..?
లావణ్య: ఇన్ని రోజుల తర్వాత కలిస్తే అలా మాట్లాడతావేంటి..?
మనోహరి: నేను ఒక ప్రాబ్లమ్ నుంచి తప్పించుకోవడానికి నీ ఫోటో చూపించి చాలా దూరం వెళ్లిపోయిన ఫ్రెండ్ అని చెప్పాను. కావాలంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి కలుస్తాను
లావణ్య: ఇప్పుడు కూడా నీ స్వార్థానికే వచ్చి పలకరించావు కదా అయినా నీ ప్రాబ్లమ్‌కు నేను ఎందుకు హెల్ప్ చేయాలి నేను చేయను
అని లావణ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరవైపు రణవీర్ కర్చీప్‌లో మత్తు మందు పెట్టుకుని అంజుకు వెనక నుంచి వెళ్లి ముక్కు దగ్గర పెడతాడు. అంజు స్పృహ కోల్పోతుంది. వెంటనే చెత్త ఆటోలో అంజలిని తీసుకుని వెళ్లిపోతుంటారు. గేటు దగ్గర సెక్యూరిటీ వాళ్లు చెక్ చేస్తారు. అందులో అంజలిని చూసి రౌడీలను పట్టుకోవాలని చూస్తారు. ఆటోను అంజలిని అక్కడే వదిలేసి రౌడీలు పారిపోతారు. తర్వాత అందరూ అంజలిని తీసుకుని ఇంటికి వస్తారు. అంజు ఇంకా మత్తులోనే ఉంటుంది.
అనామిక: సార్‌ను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని చెప్పు. ఈ పని చేసిన వాళ్లు వాళ్లకు సాయం చేసిన వాళ్లను ఎవ్వరినీ వదలకూడదు
కింద హాల్లో
రణవీర్: పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల యూజ్ ఏముంది అంకుల్
అమర్: వాళ్లు లైఫ్‌లో నా ఫ్యామిలీ జోలికి రాకుండా చేయాలి
పైన రూంలో
భాగీ: ఈ సారి ఆయన నిజం తెలుసుకునే వరకు ఆగరు.. తెలుసుకున్నాక వాళ్లు ప్రాణాలతో ఉండరు
అమర్: వాళ్లు ఎవ్వరైనా ఎంత తెలివైన వాళ్లైన ఈసారి నా నుంచి తప్పించుకోలేరు
అంటూ వార్నింగ్ ఇవ్వడంతో రణవీర్, మనోహరి బయపడతారు. అమర్‌కు నిజం తెలిస్తే తమ పరిస్థితి ఏంటని ఆలోచిస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















