Nindu Noorella Saavasam Serial Today March 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: పిల్లల్ని క్యాంపుకు పంపేందుక ఒప్పుకున్న అమర్ - నిజం తెలుసుకున్న అరుంధతి
Nindu Noorella Saavasam Today Episode: భాగుమతే తన చెల్లెలు అని అరుంధతి, గుప్తతో చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: పిల్లలను ఇంట్లో లేకుండా చేయడానికి మనోహరి ప్లాన్ చేస్తుంది. అందుకోసం స్కూల్ ప్రిన్సిపాల్‌ను ఇంటికి పిలిపించి పిల్లలకు సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు ఆ క్యాంపుకు పిల్లలను పంపించమని ప్రిన్సిపాల్ చేత అమర్‌ను అడిగిస్తుంది. ఇంతలో మిస్సమ్మ వద్దని చెప్పడంతో మనోహరి, మిస్సమ్మను తిడుతుంది. అయితే అమర్ కూడా పిల్లలను సమ్మర్ క్యాంపుకు పంపించడం ఇష్టం లేదని చెప్పడంతో మనోహరి షాక్ అవుతూ.. నీతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలని అమర్‌ను అడుగుతుంది.
మనోహరి: ఎంటి అమర్ పిల్లలు ఆరు లేదనే బాధ నుంచి బయటపడటానికి ఇంత మంచి అవకాశం వస్తుంటే నువ్వు వద్దంటున్నావు.
అమర్: ఎవరూ లేకుండా పిల్లలన్ని అంతదూరం పంపించడం నాకు ఇష్టం లేదు మనోహరి.
అనగానే మనోహరి పిల్లలను ఈ టైంలోనే మనకు దూరం ఉండాలని లేదంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం పిల్లలు చూస్తే తట్టుకోలేరని మనోహరి, అమర్‌ను కన్వీన్స్ చేస్తుంది. లోపలికి వెళ్లిన అమర్ పిల్లలు క్యాంపుకు వస్తారని చెప్పి వెళ్లిపోతాడు. పిల్లలు బాధపడుతుంటారు. మనోహరి హ్యపీగా ఫీలవుతుంది. మిస్సమ్మ బయటకు వెళ్లగానే వెనకాలే వెళ్లిన మనోహరి..నువ్వు ఇంట్లో ఎందుకున్నావ్ అని పిల్లలు ఇంట్లో లేకుంటే నీకు ఇంట్లో ఏం పని అంటుంది మనోహరి. ఇక నుంచి నేను ఆడే ఆట ఎంత భయంకరంగా ఉంటుందో నీకు చూపిస్తాను. ఈ మనోహరితో ఎందుకు పెట్టుకున్నానా అని నువ్వు ఫీల్ అయ్యేలా చేస్తానని మనోహరి, మిస్సమ్మకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. మరోవైపు ఏడుస్తూ వెళ్తున్న అరుంధతిని గుప్త ఫాలో అవుతాడు.
గుప్త: బాలికా ఆగుము.. ఏమైనది బాలికా ఎందుకు పరుగెత్తుతున్నావు.
అరుంధతి: బాగి నా సొంత చెల్లి గుప్తగారు. ఆయన నా తండ్రి. నేను మీకు చెప్పాను కదా వాళ్లకు నాకు సంబంధం ఉంది వాళ్లు నా రక్తమేనని రక్తం పంచుకున్నాను కాబటే బాగీకి నేను కనిపిస్తున్నాను. నాకు జన్మనిచ్చారు కాబట్టే ఆయనకు నా ఉనికి అర్థమవుతుంది.
గుప్త: అటులైనా నువ్వు ఉన్న ఆశ్రమం నందే మనోహరి కూడా ఉన్నది. మనోహరి కూడా ఆయన కూతురు అయ్యుండొచ్చు కదా?
అరుంధతి: లేదు గుప్త గారు నేను నిజం తెలుసుకున్నానని ఇలా మాట్లాడుతున్నారు.
అనగానే ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది ఈ విషయాలు కాదు. నీ ఇంటిని, నీ పిల్లలను ఆ మనోహరి నుంచి కాపాడటానికి మిస్సమ్మ చాలా కష్టపడుతుంది ఆమెకు నువ్వు సాయం చేయాలి అని చెప్తాడు గుప్త. మరోవైపు మిస్సమ్మ దగ్గరకు పిల్లలు వచ్చి ఏడుస్తారు. తాము క్యాంపుకు వెళ్లమని మా డాడీకి నువ్వే చెప్పాలని అడుగుతారు.
మిస్సమ్మ: చూడండి నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు మిమ్మల్ని ఇల్లు దాటనివ్వను. మీరు సమ్మర్ క్యాంపుకు వెళ్లకుండా ఆపే బాధ్యత నాది.
రాథోడ్: మీ బాధలు చూసి బాధపడటం.. మీ బాధలు తీర్చే ధైర్యం నాకుంటే అనుకోవడం తప్ప నేనేం చేయలేను పిల్లలు. నన్ను క్షమించండి. దేవుడు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తాడేమో మిస్సమ్మ.
అంటూ ఏడుస్తూ వెళ్లిపోతాడు రాథోడ్. మరోవైపు లోపలికి వెళ్లిన పిల్లలు మిస్సమ్మ మనల్ని సమ్మర్ క్యాంపుకు వెళ్లకుండా ఆపలేకపోతే ఎలా అంటూ డాడీకి మనకు ఈ పెళ్లి ఇష్టం లేదని లెటర్ రాద్దాం అని వెళ్తారు పిల్లలు. అమర్ బయటకు వెళ్తుంటే రాథోడ్ వెళ్లి మేడం చావుకు కారణమైన వాళ్లను వదలొద్దని చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: రామ్ చరణ్‌కు విలన్‌గా బాలీవుడ్ స్టార్ యాక్టర్?