Nindu Noorella Saavasam Serial Today July 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అంజు కిడ్నాప్‌కు రణవీర్ యత్నం – అడ్డుకోబోయిన మనోహరి
Nindu Noorella Saavasam serial Today Episode July 26th: అంజును కిడ్నాప్ చేయడానికి మనుషుతో వచ్చిన రణవీర్‌ను మనోహరి ఎందుకు అడ్డుకుంది అనేది ఇవాళ్టీ ఏపిసోడ్ లో ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ వాళ్ల ఇంటికి వచ్చిన కరుణ అప్లికేషన్ పేపర్స్ ఇస్తే తీసుకెళ్లి సబ్మిట్ చేస్తానంటుంది. దీంతో మా మా ఆయనకు కాంపిటీషన్‌లో పాల్గొనడం ఇష్టం లేదంట కరుణ అందుకే సైన్ చేయలేదు అంటూ పేపర్స్ ఇస్తుంది. పేపర్స్ ఓపెన్ చేసి చూసిన కరుణ షాక్ అవుతుంది.
కరుణ: ఇందులో మీ ఆయన సైన్ చేసిండే
భాగీ: అంటే ఆయన సైన్ అప్పుడే చేశాడేమో.. నేనే చూసుకోకుండా మాట్లాడాను
కరుణ: ఏయ్ పోరి పొద్దుగాల కూడా చూడాల్సిందే..
భాగీ: ఏదైతే అది అయింది ఆయన మాత్రం సైన్ చేశారు. కరుణ కాంపిటీషన్‌కు ఎన్ని గంటలకు రావాలి
కరుణ: మీరు అక్కడ పది గంటలకు ఉంటే సరిపోతుందే
భాగీ: ఓ తప్పకుండా టైంకే వచ్చేస్తాము.. చిత్ర నువ్వు నీ హస్బెండ్ రెడీ అవ్వాలంట కదా రెడీ అవ్వండి వెళ్లు గో.. ఓ మను థాంక్యూ సోమచ్.. సపోర్ట్ చేసినందుకు..
ఆరు: అంటే మా ఆయన ఫామ్ మీద సైన్ చేశాడన్న మాట అయ్యో థాంక్యూ దేవుడా.. థాంక్యూ.. ఇప్పుడు ఈ జంటను చూసి అక్కడ అందరూ తెగ దిష్టి పెట్టేస్తారు. ఆల్ ది బెస్ట్..
అనుకుంటూ గార్డెన్ లోకి వెళ్లిపోతుంది. కరుణ పేపర్స్ తీసుకుని వెళ్లిపోతుంది. రూంలోకి వెళ్లిన మనోహరి.. తన సీక్రెట్ ఫోన్ బయటకు తీసి రణవీర్‌కు ఫోన్ చేస్తుంది.
రణవీర్: చెప్పు మనోహరి ఇంత పొద్దున్నే కాల్ చేశావు
మనోహరి: చెప్తాను ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పు.. కొత్త నెంబర్స్ ఏవీ అమర్‌కు తెలిసే అవకాశం లేదు కదా..?
రణవీర్: లేదు.. కొత్త ఫ్రూప్స్ పెట్టి అన్ని నెంబర్స్ కొత్తవి తెప్పించా.. అమర్‌కు ఎప్పటికీ ఈ నెంబర్స్ తెలియవు..
మనోహరి: గుడ్.. ఇవాళే వచ్చి అంజును కిడ్నాప్ చేసి తీసుకెళ్లగలవా..? ఇప్పటికిప్పుడు ప్లాన్ చేయగలవా…?
రణవీర్: అవును మనోహరి.. కిడ్నాప్ గురించి నన్ను మర్చిపో అన్నావు.. దుర్గ గురించి బ్లాక్ మెయిల్ చేయమన్నావు.. మళ్లీ నువ్వే ఫోన్ చేసి దుర్గ గురించి కూడా అడగొద్దు అన్నావు.. ఇప్పుడు ఫోన్ చేసి అంజలిని కిడ్నాప్ చేయగలవా అని అడుగుతున్నావు.. అసలు నీకు ఏమైంది మనోహరి.. బాగానే ఉన్నావా..?
మనోహరి: నేను బాగానే ఉన్నాను రణవీర్ నువ్వు కూడా బాగా ఉండాలన్నా…? బ్రతికి ఉండాలన్నా.. భద్రంగా ఉండాలన్నా అంజలి ఈ ఇంట్లో ఉండకూడదు.. ఇప్పుడు చెప్పు.. ఇవాళ అంజలిని కిడ్నాప్ చేయగలవా.. లేదా..?
రణవీర్: చేస్తాను.. కానీ అమర్ ఉండగా అదంతా ఈజీ కాదని నీక్కూడా తెలుసు. కానీ ఇదంతా చెప్తున్నావు అంటే అమర్ ఇంట్లో లేడన్నమాట.
మనోహరి: అవును బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కోసం అమర్, భాగీ, చిత్ర, వినోద్ అందరూ వెళ్లిపోతున్నారు
రణవీర్: అయితే ఇవాళ మొత్తం అంజలి పక్కన అమర్ ఉండడా..?
మనోహరి: పక్కనే ఏంటి..? అంజలి కిడ్నాప్ అయింది అని తెలుసుకోలేనంత దూరంలో ఉంటాడు. ఒక్కసారి కాంపిటీషన్‌లోకి వెళితే ఫోన్ లో కూడా అవలేబుల్‌గా ఉండడు.. అమర్‌కు అంజలి కిడ్నాప్ అయిందని తెలిసే లోపు నువ్వు అంజలిని తీసుకుని కోల్‌కతా వెల్లిపోవచ్చు
రణవీర్: సరే మనోహరి.. అమర్ వెళ్లగానే నాకు కాల్ చేయ్ నేను నా మనుషులను తీసుకుని వస్తాను.
అంటూ కాల్ కట్ చేస్తాడు రణవీర్. తర్వాత అమర్ కాంపిటీషన్ కు వెళ్తున్నాడని తెలిసి ఇంటికి సెక్యూరిటీగా మిలటరీ వాళ్లను తీసుకొస్తాడు రాథోడ్. అయితే ఎవరు వద్దని రాథోడ్ తో సహా అందరిని పంపించేస్తాడు అమర్. అందరూ కాంపిటీషన్‌కు వెళ్లాక రణవీర్ తన మనుషులతో అంజలిని కిడ్నాప్ చేయడానికి వస్తాడు. మనోహరి వద్దని ఎంత చెప్పినా రణవీర్ వినడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















