అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today January 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  భాగీని తిట్టిన రామ్మూర్తి – గుప్తను హెచ్చరించిన యముడు   

Nindu Noorella Saavasam Today Episode:  రామ్మూర్తి నిజం తెలుసుకుని ఇంటికి వస్తున్నాడని ఆరు ఇక్కడే ఉంటే నిజం తెలుస్తుందని యముడు చెప్పగానే ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Nindu Noorella Saavasam Serial Today Episode:  వార్డెన్‌ ఫోన్‌ చేసి నిజం చెప్పగానే  రాథోడ్‌ పరుగెత్తుకుని అమర్‌ దగ్గరకు వెళ్లి ఫోన్‌ ఇస్తాడు. రాథోడ్‌ పరుగెత్తడం చూసిన మిస్సమ్మ వెనకాలే వెళ్తుంది. ఫోన్‌ తీసుకున్న అమర్‌ మిస్సమ్మను చూసి ఫోన్‌ తీసుకుని బయటకు వెళ్లిపోతాడు. మిస్సమ్మ ఏమైందని  ఆయన ఆలా వెళ్లిపోయారేంటని రాథోడ్‌ను అడుగుతుంది ఏం లేదని రాథోడ్‌ కూడా బయటకు వెళ్లిపోతాడు.

రాథోడ్: సార్‌ ఆ పెద్దాయనకు నిజం తెలిసి ఇక్కడికే వస్తున్నాడు ఇప్పుడు ఎలా

అమర్‌: ఏం జరిగినా నిజం మాత్రం నేను చెప్పను రాథోడ్‌

రాథోడ్‌:  కోటి ప్రశ్నలతో మీ సమాధానం కోసం వచ్చే ఆ తండ్రికి మీరు ఏం సమాధానం చెప్పకపోతే ఎలా సార్‌.

అమర్‌: నిజం చెప్పి ఈ వయసులో ఆయనను బాధపెట్టలేను రాథోడ్‌ అంటాడు అమర్‌. మరోవైపు ఘోర దగ్గరకు వెళ్లిన మనోహరి.. నిన్న నిన్ను తిట్టినందుకు మనసులో పెట్టుకోకు ఘోర అంటుంది. ఆ బుడ్డది ఇంత పని చేస్తుందని అసలు అనుకోలేదు అంటుంది.

ఘోర: ఆ భాగమతికి నువ్వే అరుంధతిని చంపేశావని తెలిసిందేమో..?

మను: అది కొన్ని సార్లు తెలిసినట్టే నాతో మాట్లాడుతుంది. ఆ ఆరుంధతియే ఎప్పుడో చెప్పి ఉంటుంది. ( ఘోర నవ్వుతుంటే..) నా బాధను చూస్తే నీకు నవ్వుగా ఉందా..?

ఘోర: నీ పిచ్చితనం చూసి నవ్వొచ్చింది. కొన్ని నెలలు ఆ ఆత్మను చూసిన నాకే ఆరంధతి మంచితనం అర్తం అయింది. నీకు అర్థం కాలేదా..? ఆరు నిజం చెప్పడం ఎంత సేపు.. కానీ ఆరుందతి నిజం చెప్పలేదు.. ఎప్పటికీ చెప్పదు. ఎందుకంటే అరుంధతి తన పగ కంటే తన కుటుంబం బాగుండాలని కోరుకుంటుంది. స్నేహానికి ఒకవైపు నువ్వు ఉంటే రెండో వైపు అరుంధతి ఉంది. ప్రతి విషయంలో నువ్వు తప్పు వెతికితే.. నీ తప్పుల్లో కూడా మంచిని వెతికింది. నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే పౌర్ణమి రోజు ఆరుంధతికి శక్తులు రాగానే నీ అంతం చూస్తుంది జాగ్రత్తగా ఉండు మనోహరి.

మను: దాని ముఖం అదేం చేస్తుంది నన్ను..

అంటూ నెగ్లెక్ట్‌గా సమాధానం ఇస్తుంది మనోహరి. మరోవైపు గార్డెన్‌లో కూర్చున్న గుప్త సంతోషంగా నవ్వుతుంటే.. యముడు వచ్చి తిట్టి.. నీ చుట్టు ఏం జరగుతుందో తెలుసుకోవా..? ఆ రామ్మూర్తి నిజం తెలుసుకోవడానికి ఇంటికి వస్తున్నాడు అని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో గుప్త వెంటనే ఇప్పుడు ఆ బాలికను ఇక్కడ ఉండనివ్వకూడదు అనుకుంటుండగానే ఆరు వస్తుంది.

గుప్త: బాలిక నేను నీకు ఇవాళ ఒక బహుమతి ఇద్దామనుకుంటున్నాను.

ఆరు: గిఫ్టా.. ఎందుకు గుప్త గారు..

గుప్త: ఎలాగూ మూడు రోజుల్లో మా లోకం వెళ్తున్నాం కదా అందుకే

ఆరు: అయితే వెళ్దాం పదండి గుప్త గారు

అని ఇద్దరూ కలిసి వెళ్తుంటే ఇంతలో రామ్మూర్తి కోపంగా గేటు ఓపెన్‌ చేసుకుని వస్తుంటాడు. రామ్మూర్తిని చూసిన ఆరు గిఫ్ట్‌ తర్వాత తీసుకుందాం ఈయనేంటి ఇంత కోపంగా వస్తున్నారు అని కిటికీ దగ్గరకు పరగెడుతుంది ఆరు. రామ్మూర్తి లోపలికి  వెళ్లి కోపంగా అమర్‌ ఎక్కడ అని అడుగుతాడు. భాగీ, పిల్లలు, నిర్మల, శివరాం వచ్చి పలకరించినా.. కోపంతేనే వాళ్లను తిట్టి అమర్‌ ఎక్కడ నా పెద్ద కూతురు గురించి తనకు నిజం తెలిసినా నాకు ఎందుకు చెప్పలేదు అంట అరుస్తుంటే.. రూంలోంచి మనోహరి వచ్చి రామ్మూర్తిని తిడుతుంది. రామ్మూర్తి కోపంగా మనును కొట్టబోయి ఆగిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPS PV Sunil :  ఐపీఎస్ పీవీ సునీల్‌పై విచారణకు కమిటీ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఐపీఎస్ పీవీ సునీల్‌పై విచారణకు కమిటీ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,440 కోట్ల ప్యాకేజీ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,440 కోట్ల ప్యాకేజీ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
CM Revanth Reddy : సింగపూర్‌లో సీఎం రేవంత్ కీలక ఒప్పందం.. ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ కీలక ఒప్పందం
సింగపూర్‌లో సీఎం రేవంత్ కీలక ఒప్పందం.. ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ కీలక ఒప్పందం
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్‌ ఇంట్లో సెక్యూరిటీ కెమెరాస్ లేవా - షాక్‌లో పోలీసులు
సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్‌ ఇంట్లో సెక్యూరిటీ కెమెరాస్ లేవా - షాక్‌లో పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Konaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP DesamAttack on Saif Ali Khan | బాలీవుడ్ బడా హీరోలు టార్గెట్ గా హత్యాయత్నాలు | ABP DesamISRO SpaDEX Docking Successful | అంతరిక్షంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఇస్రో ఉపగ్రహాలు | ABP DesamKTR Attended ED Enquiry | ఫార్మూలా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPS PV Sunil :  ఐపీఎస్ పీవీ సునీల్‌పై విచారణకు కమిటీ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఐపీఎస్ పీవీ సునీల్‌పై విచారణకు కమిటీ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,440 కోట్ల ప్యాకేజీ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,440 కోట్ల ప్యాకేజీ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
CM Revanth Reddy : సింగపూర్‌లో సీఎం రేవంత్ కీలక ఒప్పందం.. ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ కీలక ఒప్పందం
సింగపూర్‌లో సీఎం రేవంత్ కీలక ఒప్పందం.. ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ కీలక ఒప్పందం
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్‌ ఇంట్లో సెక్యూరిటీ కెమెరాస్ లేవా - షాక్‌లో పోలీసులు
సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్‌ ఇంట్లో సెక్యూరిటీ కెమెరాస్ లేవా - షాక్‌లో పోలీసులు
Telangana News: కబడ్డీ కోర్టులో లారీ డ్రైవర్ అంత్యక్రియలు- సినిమా లాంటి రియల్ స్టోరీ!
కబడ్డీ కోర్టులో లారీ డ్రైవర్ అంత్యక్రియలు- సినిమా లాంటి రియల్ స్టోరీ!
Hyderabad Gun Firing News:అఫ్జల్‌గంజ్‌ కాల్పుల ఘటనలో సాగుతున్న దర్యాప్తు- అమిత్‌ కుమార్ గ్యాంగ్ కోసం పది బృందాలు గాలింపు
అఫ్జల్‌గంజ్‌ కాల్పుల ఘటనలో సాగుతున్న దర్యాప్తు- అమిత్‌ కుమార్ గ్యాంగ్ కోసం పది బృందాలు గాలింపు
Nara Lokesh Davos Tour: దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
UP News: భర్త లేడని లవర్‌తో కార్లో షికారుకెళ్లిన భార్య - కానీ దొరికిపోయింది - అప్పుడే అసలు స్టోరీ.. వైరల్ వీడియో
భర్త లేడని లవర్‌తో కార్లో షికారుకెళ్లిన భార్య - కానీ దొరికిపోయింది - అప్పుడే అసలు స్టోరీ.. వైరల్ వీడియో
Embed widget