Nindu Noorella Saavasam Serial Today January 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: యముడిని బ్లాక్ మెయిల్ చేసన ఆరు - అంజు కోసం వచ్చిన రణవీర్
Nindu Noorella Saavasam Today Episode: తాను భూలోకం వెళ్తానని ఆరు కోపంగా యముడిని బ్లాక్ మెయిల్ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Nindu Noorella Saavasam Serial Today January 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: యముడిని బ్లాక్ మెయిల్ చేసన ఆరు - అంజు కోసం వచ్చిన రణవీర్ nindu Noorella Saavasam serial today episode January 29th written update Nindu Noorella Saavasam Serial Today January 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: యముడిని బ్లాక్ మెయిల్ చేసన ఆరు - అంజు కోసం వచ్చిన రణవీర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/047303ae942c1f1902f4514686ee70631738119506842879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nindu Noorella Saavasam Serial Today Episode: యమలోకంలో ఉన్న ఆరు కోపంగా యముడిని నిద్ర లేపుతుంది. యముడు కోపంగా అరవడంతో వెళ్లి గుప్త చాటున్న దాక్కుంటుంది. దగ్గరకు వెళ్లి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ వెంటనే నేను కిందకు వెళ్లాలి అని చెప్తుంది.
యముడు: సూర్యాస్తమయం ముగిసిన పిమ్మట ఇచ్చట ఏ కార్యములు చేయమని.. అన్ని ద్వారములు మూసివేయబడతవని ఈ బాలికకు చెప్పలేదా..?
చిత్రగుప్త: చెప్పాము ప్రభు.. కానీ మా మాట వినడం లేదు.
యముడు: విచిత్ర గుప్త ఈ బాలికను ఆమె స్థావరం దగ్గర విడిచిపెట్టుము.
సరేనని గుప్త, ఆరును తీసుకెళ్తాడు. రణవీర్, అమర్ ఇంటికి వస్తాడు. రణవీర్‌ను చూసి అంజు పరుగెత్తుకెళ్తుంది. భాగీ వచ్చి అంజు ఆపి ఎందుకు అలా పరుగెడుతున్నావు అని అడుగుతుంది.
అంజు: రణవీర్ అంకుల్ వచ్చాడు అందుకే వెళ్తున్నాను
భాగీ: నిన్న మనోహరి.. రణవీర్ వచ్చాడని చెప్పింది. ఎందుకు వచ్చాడని అడిగితే ఏం చెప్పకుండా కంగారు పడింది. ఇప్పుడు రణవీర్ వచ్చాడు
అని మనసులో అనుకుని కిందకు వెళ్లి రణవీర్‌ను పలకరిస్తుంది. రణవీర్ మిస్సమ్మను పలకరిస్తాడు. అప్పుడే వచ్చిన మనోహరిని పలకరించడు.
నిర్మల: అదేంటి మనోహరిని పలకరించలేదు
రణవీర్: మనోహరి గారిని ముందే కలిశానండి..
నిర్మల: ముందే కలవడం ఏంటి..?
రణవీర్: ముందే అంటే ఇంతకు ముందు వచ్చినప్పుడు కలిశాను కదండి. అయినా అమర్ గారి ఇంట్లో ఉంటే బాగానే ఉంటారు కదండి. మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడుగుదామని వచ్చాను. అంజలిని చూస్తుంటే.. నా కూతురు దుర్గను మర్చిపోయాను. అందుకే ఈ సారి అంజలికి ఏదైనా కొనివ్వాలనుకుంటున్నాను. ఒక రెండు గంటలు అంజలిని బయటకు తీసుకెళ్లొచ్చా..?
మనోహరి: ఆ విషయంలో అంత మొహమాటం ఎందుకు..? రెండు గంటలే కదా తీసుకెళ్లండి.
శివరాం: మనోహరి నువ్వు తీసుకెళ్లండి అని ఎందుకు చెప్తున్నావు..? పిల్లల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ హక్కు కేవలం మిస్సమ్మ, అమర్ లకే ఉంది.
రణవీర్: మిస్సమ్మ గారు మీరు చెప్పండి.. తీసుకెళ్లొచ్చా..?
అని అడగ్గానే భాగీ వద్దని చెప్తుంది. యమలోకంలో ఆరు బాధగా కూర్చుని ఉంటే గుప్త వస్తాడు. ఏడుస్తూ గుప్త గారు నా పిల్లుల ప్రమాదంలో ఉన్నారు అని చెప్తుంది.
గుప్త: చూడు బాలిక నేను కూడా నీలాగే ఏదైనా చూడటం తప్పా సాయం చేయలేను.
ఆరు: ఫ్లీజ్ గుప్త గారు నాకేమైనా సాయం చేయండి..
గుప్త: నిన్ను ఇప్పటికి ఇప్పుడు భూలోకం పంపంచే శక్తి నాకు లేదు కానీ ఒక తరుణోపాయం మాత్రం చెప్తాను.
ఆరు: ఏంటో చెప్పండి గుప్త గారు.
గుప్త: ప్రభువుల వారు పాపులకు శిక్ష వేసే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు వెళ్లి నీకే ముందు శిక్ష వేయమని అడుగు..
ఆరు: గుప్త గారు.. మీరు నన్ను ఏదో ఇరికించాలని చూస్తున్నారా..?
గుప్త: బాలిక సాయం అడిగావు చేస్తుంటే అనుమానాలెందుకు..? వెళ్లి అడిగి చూడు అంతే..
అని గుప్త చెప్పగానే.. ఆరు వెళ్లి అలాగే అడుగుతుంది. చిత్రగుప్త, యముడు భయపడతారు. నాకు న్యాయం చేయకపోతే నిరసన తెలుపుతాను అంటూ గట్టిగా దేవతలను పిలుస్తుంది. ఆరు దెబ్బకు యముడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు రణవీర్, అమర్‌కు ఫోన్ చేసి అంజును రెండు గంటల బయటకు తీసుకెళ్తానని తన కూతురు గుర్తుకు వస్తుందని ఎమోషనల్ అవుతాడు. అమర్ సరే అంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)