అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today December 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ : గుప్త గీసిన గీతలోంచి బయటకు వచ్చిన ఆరు -  ఆర్మీ ఆఫీసర్‌ కు వార్నింగ్‌ ఇచ్చిన అరవింద్‌

Nindu Noorella Saavasam Today Episode:  గుప్త, ఆరును రెచ్చగొట్టడంతో ఆరు గీతలోంచి బయటకు వస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode:   ఆరును ఎలాగైనా గీతలోంచి బయటకు వచ్చేలా చేసి తనను యమలోకానికి తీసుకెళ్లాలనుకుంటాడు గుప్త. అందుకోసం ఆరు దగ్గరకు వచ్చి తన మాటలతో రెచ్చగొడతాడు. నీ పిల్లలు ప్రమాదంలో ఉంటే నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి అంటూ ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. గీత దాటి బయటకు వస్తే నీకు ఏమైనా ప్రమాదం జరగుతుందని భయపడుతున్నావా అంటాడు.

ఆరు: గుప్త గారు మీరు ఇదంతా కావాలనే చేస్తున్నారని నాకు తెలుసు

గుప్త: నువ్వు నాకు తెలుసు అంటావు కానీ నీకేమీ తెలియదని నాకు తెలుసు

ఆరు: అన్ని తెలిసిన ధర్మ మూర్తులైన మీరే మౌనంగా ఉంటే నన్నేం చేయమంటారు.

గుప్త: ఇంత మాట్లాడుతున్నావు కానీ నీ పిల్లలను రక్షించుకోవడానికి వెళ్లడం లేదు.

ఆరు: నా పిల్లలను కాపాడటానికి మా ఆయన ఉన్నారు. మిస్సమ్మ ఉంది. ఇక నా పిలల్లకు ఏమీ కాదు.

గుప్త:  నువ్వు ఈ రేఖ దాటి వెల్లెదవో లేక ఇక్కడే ఉండెదవో నీ ఇష్టం.

ఆరు: దేవుడు న్యాయాన్ని గెలిపిస్తాడు గుప్తగారు ఆ నమ్మకంతోనే నేను ఇప్పుడు ఈ రేఖను దాటుతున్నాను..

 అని ఆరు ఒక్క ఉదుటున రేఖలోంచి బయటకు వచ్చి వెళ్లిపోతుంది. ఆరు వెళ్లడం చూసి గుప్త హ్యాపీగా యముడిని పిలిచి నాకన్నా ముందుగా  ఆ బాలిక మన లోకానికి వస్తుంది అని చెప్తాడు. యముడు వచ్చి గుప్తను తిట్టి ఆ బాలిక అమావాస్య గడియల్లో గీత దాటిందని మన లోకానికి రాలేదని వచ్చే అమావాస్యలోపు ఎలాగైనా అ బాలికను తీసుకుని రమ్మని చెప్పి వెళ్లిపోతాడు యముడు.  పిల్లలను బంధించిన రౌడీలు వాళ్ల చుట్టు గన్స్‌తో కాపలా ఉంటారు. పిల్లలందరూ భయపడుతుంటారు. అంజు మాత్రం భయం లేకుండా అందరినీ ఓదారుస్తుంది. మా డాడీ వస్తారు మమ్మల్ని కాపాడతాడు అని చెప్తుంది. మరోవైపు అరవింద్‌ ఆర్మీ ఆఫీసర్‌కు ఫోన్‌ చేస్తాడు.

అరవింద్:  పిల్లలకు ఏమైనా అవ్వడం అవ్వకపోవడం అంతా మీ చేతుల్లోనే ఉంది. పిల్లలు ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉన్నారంటే దానికి కారణం మీరు అమరేంద్రనే.. ఫస్ట్‌ టైం నేను కిడ్నాప్‌ చేసినప్పుడే నేను అడిగినవన్నీ నాకు ఇచ్చేసి ఉంటే నా పని నేను చేసుకునే వాణ్ని..

ఆఫీసర్‌: అసలు  నీకేం కావాలో అడుగు ఇస్తాం..

అరవింద్‌: మా వాళ్లందరినీ మాకు అప్పగించాలి. మేము ఇక్కడి నుంచి సేఫ్‌గా వెళ్లాలి ఆ అమరేద్రను ఒంటరిగా మా దగ్గరకు పంపించాలి.

ఆఫీసర్‌: అమర్‌ తప్పా అన్ని డిమాండ్ల  నెరవేరుస్తాం.. 

అరవింద్ : లేదు ఆఫీసర్‌.. ఆ అమరేంద్ర నాకు ఫస్ట్‌ టైం ఓటమిని పరిచయం చేసిండు.. నేను తనకు మరణాన్ని రిటర్న్‌ గిఫ్టుగా ఇవ్వాలి కదా..?

అని వార్నింగ్ ఇవ్వగానే ఆర్మీ ఆఫీసర్‌ కూడా అరవింద్‌ కు వార్నింగ్ ఇస్తాడు. ఫారెస్టులో ఆగి ఉన్న స్కూల్‌ బస్సు దగ్గరకు అమర్‌ వాళ్లు వెళ్తారు. బస్సును చూసిన మిస్సమ్మ బస్సులో పిల్లలు లేరని ఏడుస్తుంది. అమర్‌ మాత్రం రోడ్డు ఇక్కడితో ఎండ్‌ అయింది కాబట్టి పిల్లలను ఇక్కడి నుంచి బై వాక్‌ తీసుకెళ్లి ఉంటారని.. ఎక్కువ దూరం నడవలేరు కాబట్టి మనకు చుట్టు పక్కలే పిల్లలు ఉండి ఉంటారు అనుకుంటూ రౌడీలు పిల్లలన తీసుకెళ్లిన రూట్లో వెళ్తుంటాడు. కొద్దిదూరం వెళ్లాక రౌడీల వ్యాన్‌ కనిపిస్తుంది. ఆ పక్కనే డేంజర్‌ స్నేక్‌ జోన్‌ కనిపిస్తుంది. మిస్సమ్మ ఏడుస్తుంది. అమర్‌ ఓదారుస్తూ పిల్లలను తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ భరోసా ఇస్తాడు. మరోవైపు అకాష్‌కు బయట పెద్ద పాము కనిపించడంతో స్పృహ తప్పి కింద పడిపోతాడు.   ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget