Nindu Noorella Saavasam Serial Today December 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ : బస్సును ట్రేస్ చేసిన అమర్ – డ్రైవర్‌కు వార్నింగ్ ఇచ్చిన ప్రిన్సిపాల్
Nindu Noorella Saavasam Today Episode: అసలైన బస్సు డ్రైవర్ అమర్ దగ్గరకు వచ్చి నిజం చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: గుప్త, యముడితో మాట్లాడటం విన్న ఆరు నిజం చెప్పమని అడుగుతుంది. గుప్త చెప్పకపోయే సరికి తన తల మీద గుప్త చేయి పెట్టుకుని నన్ను చెల్లి అంటారు కదా గుప్తగారు నా మీద ఒట్టేసి నిజం చెప్పండి అని అడుగుతుంది. దీంతో గుప్త నిజం చెప్తాడు. ఆరు భయంతో ఏడుస్తుంది. ఎలాగైనా నా పిల్లలను కాపాడండి అంటూ ప్రాధేయపడుతుంది. మీరు అడిగినట్టుగానే నేను యమలోకానికి వస్తాను అంటుంది. అయితే ఇప్పటికే సమయం మించిపోయిందని.. విధికి ఎదురెళ్లడం మంచిది కాదని గుప్త వెళ్లిపోతాడు. బస్సులో పిల్లలు సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తుంటారు. డ్రైవర్ సౌండ్ తక్కువ చేస్తాడు.
అంజు: మేడం.. డ్రైవర్ సౌండ్ తక్కువ చేశాడు.. పెంచమని చెప్పండి.
ప్రిన్సిపాల్: ఏయ్ డ్రైవర్ సౌండ్ తక్కువ చేశావేంటి..? ఎక్కువ పెట్టు
అని ప్రిన్సిపాల్ చెప్పగానే డ్రైవర్ సౌండ్ పెంచుతాడు. పిల్లలు డాన్స్ చేస్తుంటే.. డ్రైవర్ పిల్లలను తిడతాడు. ప్రిన్సిపాల్ కోపంగా డ్రైవర్‌ను తిడుతుంది. బంటి చాక్లెట్ తిని రాపర్ అంజు మీదకు వేస్తాడు.
అంజు: అరేయ్ బంటి ఏంటిది..?
బంటి: ఆ అది కూడా తెలియదా..? చాక్లెట్ రాపర్ కళ్లు కనిపించడం లేదా..?
అంజు: నాకు బాగానే కనిపిస్తున్నాయి. నీకే సరిగ్గా కనిపించడం లేదనుకుంటా..? డస్ట్‌బిన్ లో వేయాల్సిన రాపర్‌ను నా ముఖం మీద వేశావు.
బంటి: నేను వేసింది కూడా డస్ట్ బిన్ లోనే నీ ముఖం డస్ట్ బిన్నే కదా..?
అంటూ బంటి సమాధానం ఇవ్వగానే అంజు కోపంగా బంటి మీదకు ఫైటింగ్ కు వెళ్తుంది. అమ్ము, అంజును ఆపి బంటిని తిడుతుంది. మరోవైపు అమర్, రాథోడ్ ఇంటికి వెళ్తారు. అంజు కిడ్నాప్, ఇంట్లోకి రౌడీలు రావడం అన్ని విషయాలు గుర్తు చేసుకుంటూ అమర్ ఆందోళనగా కనిపిస్తాడు.
రాథోడ్: పిల్లలను డ్రాప్ చేసి వచ్చినప్పటి నుంచి మీరు అదోలా ఉన్నారు ఏం జరిగింది సార్
అమర్: మిస్సమ్మను వాటర్ తీసుకురా
భాగీ వాటర్ తీసుకుని వచ్చి అమర్‌కు ఇస్తుంది.
భాగీ : ఏమైంది రాథోడ్.. ఆయన డల్లుగా ఉన్నారు.
రాథోడ్: ఏమో తెలియదని మిస్సమ్మ..
ఇంతలో నిర్మల, శివరాం వచ్చి ఏమైందని అడుగుతారు.
రాథోడ్: రెగ్యులర్‌గా వచ్చే డ్రైవర్ కాకుండా కొత్త డ్రైవర్ వచ్చాడు
భాగీ: అదేంటి రాథోడ్ అలా ఎలా వచ్చారు. ఇవాలే ఎందుకు వచ్చారు. కొత్త అతను అని తెలిశాక కూడా పిల్లల్ని ఎందుకు పంపించారు.
శివరాం: రాథోడ్ అసలు అతను డ్రైవరేనా..? లేక ఆ రౌడీల్లో ఒకడా..?
రాథోడ్: ఆ అనుమానంతోనే సార్ బస్సు ఓనరుకు ఫోన్ చేశారు. ఆ డ్రైవరు ఓనరు పంపించిన డ్రైవరే..? మామూలుగా వచ్చే ఆయనకు ఒంట్లో బాగాలేకపోతే ఇతను వచ్చాడంట.
అని రాథోడ్ చెప్తుండగానే అమర్‌కు తాను బస్సుకు ట్రాకర్ పెట్టిన విషయం గుర్తు చేసుకుని లాప్ టాప్ ఓపెన్ చేసి అందులో బస్సు ఎక్కడక వెళ్తుందో చూస్తాడు. ఏమైందని అడిగితే విషయం చెప్పి బస్సు కరెక్టు రూట్ లోనే వెళ్తుందని చెప్తాడు అమర్. మరోవైపు అరవింద్ కారు ఆపి బస్సు డ్రైవర్‌కు ఫోన్ చేస్తాడు.
అరవింద్: అరేయ్ మేము ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం. నేను చెప్పిన బంగ్లా దగ్గరకు వెళ్లి అరేంజ్ చేసుకుంటాం. ప్లాన్ అంతా గుర్తు ఉంది కదా ఎక్కడ చిన్న తేడా రాకూడదు.
డ్రైవర్: అంతా గుర్తు ఉంది అన్న.. ఎక్కడ తేడా రానివ్వను..
ప్రిన్సిపాల్: ఏంటి డ్రైవర్ ఏంటి ఏదో తేడా రానివ్వను అంటున్నావు.
డ్రైవర్: హమ్మయ్యా ఈవిడ మొత్తం వినలేదు బతికిపోయాను ( అని మనసులో అనుకుని) ఏం లేదు మేడం. నేను వెళ్లాల్సిన బస్సుకు వేరే డ్రైవర్‌ను పంపించాను. ఏం తేడా రాకూడదని జాగ్రత్తలు చెప్తున్నాను.
అని చెప్పగానే సరే ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది ప్రిన్సిపాల్. మరోవైపు బస్సు ఓనరు అసలైన డ్రైవర్‌ను అమర్ ఇంటికి తీసుకొచ్చి ఉదయం ఈ డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి బెదిరించి వాళ్ల మనిషిని నా దగ్గరకు పంపించారట ఇప్పుడు బస్సులో ఉన్నది వాళ్ల మనిషేనట అని చెప్పగానే అందరూ భయంతో వణికిపోతారు. అమర్ బస్సు డ్రైవర్‌కు ఫోన్ చేయగానే అన్న మనం అనుకున్న రూట్ లోనే వెళ్తున్నాను. కొద్దిసేపట్లో ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతాము అని చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















