Nindu Noorella Saavasam Serial Today December 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమ్మును చూసి భాగీ ఎమోషనల్ - భాగీ ప్రవర్తన చూసి షాకైన పిల్లలు
Nindu Noorella Saavasam serial Today Episode December 26th: అమ్ము సేప్టీ కోసం తాను ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు సిద్దమవుతుంది భాగీ. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: అమ్ము మీద గద్ద దాడి చేయడంతో అమర్ వచ్చి దాన్ని షూట్ చేస్తాడు. దీంతో చంబా మంత్రం వేసి ఆ గద్ద అక్కడి నుంచి పారిపోయేలా చేస్తుంది. గద్ద పారిపోయాక అమ్మును తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తాడు అమర్. పిల్లలను తీసుకుని మనోహరి రూంలోకి వెళ్తుంది. బాగీని పాపను వాళ్ల రూంలోకి తీసుకెళ్తుంది చంభా. టెన్షన్ పడుతున్న భాగీకి మంచినీళ్లు ఇస్తుంది చంభా.
భాగీ: అమ్ముకు ఏమవుతుందో ఏమో
చంబా: ఏం కాదు మేడం.. సార్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు కదా..? సేఫ్‌గానే తిరిగి వస్తుంది అయినా మేడం విచిత్రం కాకపోతే అక్కడ అంత మంది ఉండగా ఆ గద్ద అమ్ము మీదే దాడి చేయడం ఏంటి..?
భాగీ: అదే నాకు అర్థం కావడం లేదు యాదమ్మ.. ఏదో పగబట్టినట్టు ఆ గద్ద అమ్ము పైనే దాడి చేసింది.
చంభా: అవును మేడం చూస్తుంటే.. ఆ పంతులు గారు చెప్పిందే నిజం అయ్యేలా ఉంది
భాగీ: లేదు యాదమ్మా లేదు అలా జరగడానికి వీల్లేదు
చంభా: అలాగే జరగాలని విధి రాసి ఉంటే.. మనం ఏం చేయగలం మేడం
భాగీ: వద్దు అలా మాట్లాడకు
చంభా: ఇవి నా మాటలు కాదు మేడం.. అన్నప్రాసన సమయంలో అమ్ము రక్తం చిందించింది. రాత్రి ఆ కుక్క దాడి చేయడం.. ఇప్పుడు గద్ద దాడి చేయడం ఇవన్నీ చూస్తుంటే.. ప్రకృతి ఏదో హెచ్చిరిస్తున్నట్టు ఉంది మేడం
భాగీ: ప్రకృతి హెచ్చరికా..?
చంభా: అవును మేడం మనకు ఏదైనా ఆపద రాబోయే ముందు ప్రకృతి మనల్ని జాగ్రత్త పడమని హెచ్చరిస్తుందట.. ఆ రక్తం.. కుక్క వెంటపడటం.. ఇప్పుడు ఈ గద్ద ఇవన్నీ ప్రకృతి చేసే హెచ్చరికలే.. అయినా కూడా మనం జాగ్రత్త పడకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది మేడం
భాగీ: అలా జరగకూడదు. ఆ ప్రమాదం ఎలాగైనా ఆపాలి.. ఏదైనా చేయాలి.. దాన్ని ఎలాగైనా ఆపాలి
చంభా: కానీ అది మన చేతుల్లో లేదు కదా మేడం..
భాగీ: మరి ఎవరి చేతుల్లో ఉంది. ఎవరు ఆపుతారు..
చంభా: అది ఆ పంతులు గారే చెప్పాలి మేడం.. ఒకసారి ఆయన్ని కలిస్తే ఏదైనా పరిష్కారం చెప్తారేమో
అంటూ చంభా చెప్పగానే.. పంతులు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది మిస్సమ్మ.
భాగీ: అమ్మునో నేనో ఈ ఇంటికి దూరం అవ్వాలని అదే ఈ సమస్యకు పరిష్కారం అని పంతులు గారు చెప్పారు
చంభా: అవును మేడం నిజమే ఆ విషయం పంతులు గారు నాతో కూడా చెప్పారు.. కానీ దూరం అవ్వడం ఒక్కటే పరిష్కారం కాదేమో మేడం ఇంకేదైనా దారి ఉందేమో అడుగుదాం.. ( మనసులో నీకు ఈ విషయం పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు ఈ బిడ్డ ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అవ్వడమే పరిష్కారం అని నీకు అనిపించాలి) ఇంకేం ఆలోచించకండి మేడం వెంటనే వెళ్లి పంతులును కలుద్దాం.. అమ్ముకు మరే ఆపద రాక ముందే తనను కాపాడుకుందాం.. అమ్మును మీరు కన్న కూతురులా చూసుకున్నారు మేడం తనను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నిన్న కుక్క ఈ రోజు గద్ద రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు..
అంటూ చంభా భయపెట్టడంతో భాగీ భయంతో అయితే వెంటనే వెళ్లి కలుద్దాం అని చెప్తుంది భాగీ. ఇద్దరూ కలిసి వెళ్లి పంతులును కలుస్తారు. మనోహరి డబ్బులకు ఆశపడిన పంతులు. మళ్లీ బాగీని అబద్దం చెప్పి భయపెడతాడు. దీంతో భాగీ తానే అందరికీ దూరంగా వెళ్లిపోవాలని డిసైడ్ అవుతుంది. వెంటనే ఇంటికి వెళ్లి పిల్లలకు జాగ్రత్తలు చెప్పి అమ్మును ఓదార్చి వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















