Nindu Noorella Saavasam Serial Today August 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆపరేషన్ సక్సెస్ చేసిన జేడీ, అమర్ – పిక్నిక్ ప్లాన్ చేయమన్న శివరాం
Nindu Noorella Saavasam Today Episode: జేడీ, అమర్ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ చేసి స్టూడెంట్స్ ను సేవ్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: జేడీ, అమర్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. అమర్, జేడీ ఒక్కొక్క తీవ్రవాదిని చంపుకుంటూ పిల్లలను బందీలుగా ఉన్న రూం దగ్గరకు వెళ్తారు. రూం డోర్స్ బద్దలకొట్టి లోపలికి వెళ్లి తీవ్రవాదులను కొడతారు. వాళ్లను పట్టుకుని కస్టడీలోకి తీసుకుంటారు. పిల్లలను సేఫ్‌గా బయటకు తీసుకెళ్తారు. దీంతో పిల్లలతో పాటు వారి పేరెంట్స్ హ్యాపీగా ఫీలవుతారు.
అమర్: జేడీ మీతో కలిసి ఈ ఆపరేషన్ కంప్లీట్ చేయగలిగాను థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ కో ఆపరేషన్.
జేడీ: థాంక్యూ సర్.. నేను ఇక బయలుదేరుతాను సార్.
అంటూ ఇద్దరూ బయటకు వస్తారు. పిల్లలను చూసిన మిస్సమ్మ హ్యాపీగా ఫీలవుతుంది. మనోహరి మాత్రం ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది. మరోవైపు రామ్మూర్తికి ఐరన్ చేసిన షర్ట్ ఇస్తుంది మంగళ. ఎవరు చేశారని రామ్మూర్తి అడగ్గానే మంగళ వెటకారంగా మాట్లాడుతుంది. ఇంట్లో నేను కాకుండా ఇంకెవరు చేస్తారని మండిపడుతుంది. అవన్నీ తర్వాత కానీ ముందు మీరు అనాథ శరణాలయానికి వెళ్లి మీ కూతురు గురించి తెలుసుకోండి అని చెప్తుంది. దీంతో రామ్మూర్తి, మంగళను అనుమానిస్తాడు. ఏప్పుడు లేనిది ఇప్పుడు నా కూతురు మీద ఎందుకంత ప్రేమ అని అడగ్గానే మంగళ భయపడుతుంది. తర్వాత రామ్మూర్తి వెళ్లిపోతాడు. దీంతో మంగళ మనోహరిని తిట్టుకుంటుంది. మరోవైపు పిల్లలు ఇంట్లో చదువుకుంటుంటారు. ఇంతలో అంజు డాన్స్ చేస్తూ వస్తుంది.
అంజు: ఏయ్… సరే సరే మీతో పాటే అంత మంది స్టూడెంట్స్ ని కాపాడేశాను. టెర్రరిస్టులను పటించాను. మనం బయటకు రాగానే అందరూ నాకు సెల్యూట్ చేశాను. కానీ నేను రాగానే మీరు ఇలా లేచి నిల్చొవడాలు, నా హోం వర్కులు చేసి నన్ను హీరోయిన్ ని చేయోద్దు ఫ్లీజ్
ఆరు: ఈ ఓవరాక్షన్ తోనే కదా అందరి దగ్గర బుక్ అవుతూ ఉంటుంది.
అంజు: నాన్నా ఆకాష్ కూర్చోరా.. కూర్చో..
ఆకాష్: ఏహెయ్ నేను అందుకు లేవలేదు. బుక్ తీసుకోవడానికి లేచాను పొట్టి దాన పో..
అమ్ము: అంజు నీకింకా క్లారిటీ వచ్చినట్లు లేదనుకుంటా? వాళ్లు సెల్యూట్ చేసింది డాడ్ కు జేడీకి
అంజు: జరగాల్సిందే నాకు ఇలా జరగాల్సిందే.. మిమ్మల్నందరినీ కాపాడాను చూడండి నాకు ఇలా జరగాల్సిందే.
అంటూ బాధపడట్టు బిల్డప్ ఇస్తుంది అంజు. దీంతో పిల్లలందరూ కలిసి అంజును తిడతారు. అయితే అందరూ చేసే టాస్క్ అయితే డాడీ నాకెందుకు చెప్పారని ప్రశ్నిస్తుంది. దీంతో అమ్ము నీయంత ఓవరాక్షన్ మేము చేయలేము కదా? అంటుంది. నీయంతం దొంగ తెలివితేటలు కూడా మాకు లేవు కదా అంటాడు ఆకాష్. ఇదంతా గమనిస్తున్న ఆరు నవ్వుకుంటుంది. మరోవైపు మిస్సమ్మ, శివరాం, నిర్మలకు టీ ఇస్తుంది.
శివరాం: మిస్సమ్మ నిన్న స్కూల్ లో జరిగిన దానికి పిల్లలు బాగా భయపడిపోయారు కదా? అందుకని
మిస్సమ్మ: అయ్యో మామయ్యా నిన్న భయపడ్డారేమో కానీ ఇవాళ సెట్టయిపోయారు.
శివరాం: పైకి అలా ఉంటారు కానీ లోపల భయం ఉంటుంది కదమ్మా..
మిస్సమ్మ: అయ్యో మామయ్య పైన భయం లేదు. లోపల భయం లేదు. స్కూల్ లో పిల్లలు చెప్తుంటే విన్నాను. అంజు అయితే వాళ్లను చూసిన భయపడలేదట.
అంటూ మిస్సమ్మ ఏదేదో మాట్లాడుతుంటే శివరాం కోపంగా లేచి పిల్లల్ని పిక్నిక్ కు తీసుకెళ్లమని చెప్పు. అనగానే మిస్సమ్మ సరే అని వెళ్లిపోతుంది. డోర్ చాటు నుంచి వింటున్న మనోహరి ఈ ముసలోడేంటి పిక్నిక్ ప్లాన్ చేశాడు. ఎందుకై ఉంటుంది అని ఆలోచిస్తుండగా శివరాం ఇది పిల్లల కోసం వారిద్దరిని కలపడానికి అని నిర్మలకు చెప్తాడు. దీంతో నిర్మల నవ్వుతుంది. మనోహరి షాక్ అవుతుంది. ఎలా కలుస్తారో నేను చూస్తానని అనుకుంటుంది. అందర్నీ గమనిస్తున్న గుప్త మనోహరిని తిట్టుకుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణి చెంప పగులగొట్టిన ధాన్యం – రాహుల్ పై రివేంజ్ తీర్చుకున్న స్వప్న