Nindu Noorella Saavasam Serial Today August 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్ కు ఫోన్ చేసిన టెర్రరిస్టు – పిల్లల్ని స్కూల్ కు తీసుకెళ్తానన్న మనోహరి
Nindu Noorella Saavasam Today Episode: పిల్లలను హగ్ చేసుకుని టెర్రరిస్టుల పట్టుకునే ప్రయత్నంలో తనకేమైనా కావొచ్చని అమర్ ఎమోషనల్ గా ఫీలవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: స్కూల్ గేమ్స్ లో గెలిచి ఇంటికి వచ్చిన పిల్లలకు నిర్మల దిష్టి తీస్తుంది. తర్వాత అందరూ స్వీట్స్ తింటూ హ్యాపీగా ఉంటారు. దీంతో మనోహరి ఇప్పుడే బాగా నవ్వుకోండి ఇక మీకు జీవితంలో నవ్వుకునే చాన్స్ లేకుండా చేస్తాను. అని మనసులో అనుకుంటుంది. ఇంతలో రాథోడ్ వచ్చి రేపు ఇండిపెండెన్స్ డే కే ఎలాంటి గెటప్స్ వేయబోతున్నారు అని అడగ్గానే పిల్లలందరూ షాక్ అవుతారు. ఈ గేమ్స్ లో గెలవాలని గెటప్ సంగతే మర్చిపోయామని ఫీల్ అవుతారు. ఇంతలో మిస్సమ్మ ఈ భాగీ మీ చెంతన ఉండగా మీకెందుకు దిగులు అంటుంది. దీంతో పిల్లలు ఊపిరి పీల్చుకుంటారు. చాలా హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు మంగళ కూరగాయలు కోస్తుంది. రామ్మూర్తి దగ్గుతుంటాడు.
రామ్మూర్తి: మంగళ… ఒసేయ్ మంగళ.. నీ కోపం ఆ కూరగాయల మీద చూపిస్తావేంటి?
మంగళ: నీ మీద గిట్ల చూపిస్తే మీరు ఊరుకుంటారేంటి? గందుకే వీటి మీద చూపిస్తున్నా..?
రామ్మూర్తి: ఏంటో ప్రైమ్ మినిష్టర్ లా పెద్ద పని ఉందని బయటకు వెళ్లావు. వచ్చిన్నప్పటి నుంచి ఆ ముఖం ఎందుకే మాడ్చుకుని కూర్చన్నావు.
మంగళ: నా ముఖం ఇట్లా మాడిస్తే మీకేమైనా నష్టమా..?
అంటూ రామ్మూర్తిని తిడుతుంది. మనోహరితో జరిగిన గొడవ గురించి గుర్తు చేసుకుని తర్వాత కూల్‌గా నా గురించి ఎందుకులే కానీ నీ కూతురు గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా? లేదా? అని అడుగుతుంది. భాగీకేం బాగానే ఉందిగా అనగానే మిస్సమ్మ గురించి కాదు పసిపాపలా ఉన్నప్పుడు అనాథ ఆశ్రమంలో వదలేసి దాని గురించి అని అడుగుతుంది. దీంతో రామ్మూర్తి ఎమోషనల్ గా ఫీలవుతాడు. మరోవైపు టెర్రరిస్టులు స్కూల్ లో బాంబులు పెట్టడానికి రెడీ అవుతుంటారు. టెర్రరిస్ట్ లీడర్ అమర్‌కు ఫోన్ చేస్తాడు.
టెర్రరిస్ట్ : నమస్తే లెఫ్టినెంట్ సార్ మీరెలా ఉన్నారు.
అమర్: ఎవరు మాట్లాడేది.
టెర్రరిస్ట్ : నా కోసం మీ మిలటరీతో బాంబు స్క్వాడ్ తో ఎదురుచూస్తూ ఉంటారనుకున్నా.. మీరు నన్ను గుర్తు కూడా పట్టడం లేదు. నేను చాలా డిస్సపాయింట్ అయ్యాను సార్.
అమర్: టెర్రరిస్ట్ .. కాల్ క్రాక్ చేయమని చెప్పు..
రాథోడ్: అలాగే సార్.
టెర్రరిస్ట్ : హలో సార్..
అమర్: హలో..
టెర్రరిస్ట్: అదే సార్ రేపు బాంబు ఎక్కడ పెట్టాలో ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మంచి వెన్యూ చెప్తారని ఫోన్ చేశాను. హెల్ఫ్ చేయండి సార్ కొంచెం.
అమర్: అరేయ్ చంపేస్తా..
టెర్రరిస్ట్ : ఏంటి సార్ భయపడుతున్నాట్లున్నారు.
అమర్: భయమా? చర్మాన్ని చీల్లే చలిలో తుపాకి పట్టుకుని దేశ రక్షణ చేసిన సిపాయినిరా నేను..
అంటూ అమర్ వార్నింగ్ ఇస్తాడు. దీంతో టెర్రరిస్ట్ లు కూడా వార్నింగ్ ఇస్తాడు. దీంతో రాథోడ్ కాల్ వేరే దేశం నుంచి వచ్చిందని చెప్తాడు. మరుసటి రోజు పిల్లలందరూ స్కూల్ కు వెళ్లడానికి రెడీ అవుతారు. ఇంతలో అమర్ రెడీ అయి కిందకు వస్తాడు. పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్లిపోతుంటే అమర్‌కు జ్యూస్ ఇస్తుంది. తర్వాత పిల్లలను హగ్ చేసుకున్న అమర్ ఇవాళ ఆ టెరరిస్టును పట్టుకోవడంలో ఏదైనా జరగొచ్చు కానీ మిస్సమ్మ ఉందన్న ధైర్యంతో వెళ్తున్నాను అని మనసులో అనుకుని అమర్ వెళ్లిపోతాడు. అమర్ ను గమనించిన ఆరు బాధపడుతుంది. తర్వాత మిస్సమ్మ ఆయనకు ఇవాళ ఏమైందని శివరాంను అడుగుతుంది. దీంతో శివరాం ఏదో ఒకటి చెప్పగానే మనోహరి పిల్లల్ని స్కూల్ కు నేను తీసుకెళ్తానని చెప్పడంతో మిస్సమ్మ, మనోహరికి వార్నింగ్ ఇచ్చి వెళ్దాం పద అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మంచు విష్ణు నట వారసుడు వచ్చేస్తున్నాడు, ‘కన్నప్ప’ నుంచి అవ్రామ్ పోస్టర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?