అన్వేషించండి

Nindu Manasulu Serial Today December 25th:నిండు మనసులు: గణ-సాహితి పెళ్లిలో ఊహించని ట్విస్ట్! సిద్ధూ ఏం చేశాడు? ప్రేరణ, వర్షల పరిస్థితేంటి?

Nindu Manasulu Serial Today Episode December 25th గణ సాహితి మెడలో తాళి కట్టే చివరి నిమిషంలో వర్ష పెళ్లి మండపంలోకి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode గణ, సాహితిలకు పెళ్లి బట్టలు ఇచ్చి మార్చుకొని రమ్మని చెప్తారు. గణ గదిలోకి వెళ్తే సిద్ధూ కూడా వెళ్తాడు. గణ కాలర్ పట్టుకొని ప్రేరణ, వర్ష ఎక్కడున్నారో చెప్పు అని అడుగుతాడు. నాకేం తెలీదు అని గణ అంటాడు. నీకు అన్నీ తెలుసు.. వాళ్లు ఇక్కడికి వస్తే నీ బండారం బయట పడుతుందని వాళ్లని నువ్వే కిడ్నాప్ చేశావని అంటాడు.

కిడ్నాప్లు చేయడానికి నేను రౌడీని కాదు పోలీస్ని కావాలంటే కేసు పెట్టండి నేను వెతికిస్తా అని అంటాడు. నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను చంపి అయినా సరే నిజం చెప్పిస్తా అంటాడు. ప్రేరణకి ఏమైనా అయితే మాత్రం నిన్ను వదిలిపెట్టను అని అంటాడు సిద్ధూ. మీరు వెళ్లండి నేను బట్టలు మార్చుకోవాలి అని గణ సిద్ధూని పంపేస్తాడు. పెళ్లి అయిన వరకు వాళ్లు నీకు దొరకరు అని అనుకుంటాడు.

రంజిత్ రౌడీల కారుని ఫాలో అవుతాడు. చోట వాళ్లని మిస్ అయిపోతాడు. ఎటు వెళ్లారా అని అనుకుంటాడు. ప్రేరణ, వర్షలను రౌడీలు కట్టి పడేస్తారు. ప్రేరణకు మెలకువ వచ్చి వర్షని లేపుతుంది. మనం ఎలా అయినా తప్పించుకోవాలి అని ప్రేరణ అంటే ఆశ లేదు అసలు బతుకుతామన్న ఆశే లేదు అని వర్ష అంటుంది. ప్రేరణ కట్లు విప్పడానికి చాలా ప్రయత్నిస్తుంది.. కానీ కదురదు.. ఇంతలో రౌడీలు వచ్చి ప్రేరణని బెదిరిస్తారు. ఇంతలో రంజిత్ వచ్చి రౌడీలను చితక్కొడతాడు. టైంలోనే రౌడీలు రంజిత్ని కత్తితో పొడిచేస్తారు.

గణ, సాహితిలు పెళ్లి మండపం మీద కూర్చొంటారు. ముహూర్తం దగ్గర పడుతుంది. పెళ్లి ఎలా ఆపాలిరా అని సిద్ధూ చాలా టెన్షన్ పడతాడు. ఇక తాళి కట్టమని పంతులు గణకి తాళి ఇస్తాడు. పాపం సిద్ధూ చాలా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏం చేయలేకపోతున్నా అని అనుకుంటాడు. ఏదో ఒకటి చేయరా అని కుమార్ సిద్ధూని అంటే ఏం చేయాలిరా ఒక్క సాక్ష్యం కూడా లేదు.. పోనీ అని గొడవ చేసినా ఆపర్రా అని అంటాడు. విజయానంద్ సిద్ధూని చూసి సిద్ధూ పెళ్లి ఆపుతాడు అనుకుంటే తనేం చేయడం లేదు నేను చెప్తామంటే నా గురించి తెలిసిపోతుందని అనుకుంటాడు. గణ సాహితి మెడలో తాళి కట్టేస్తాడు. సిద్ధూ ఏడుస్తూ నన్ను క్షమించమ్మా నిన్ను కాపాడుకోలేకపోయాను అని వెళ్లిపోతాడు.

గణ సాహితిని దగ్గరకు తీసుకొని సిద్ధూని వెటకారంగా చూస్తాడు. ఇక సాహితిని ముద్దు పెట్టుకోవాలని చూస్తాడు. తీరా చూస్తే గణ పక్కన సుధాకర్ అంటాడు. గణ షాక్ అయిపోతాడు. అందరూ నవ్వుతారు. ఇంకా పెళ్లి కూతురు రాలేదు కంగారు వద్దు అంటారు. ఇదంతా నా కలా అని గణ నోరెళ్ల బెడతాడు. విజయానంద్ విశ్వాసంతో ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపుతానురా అని ఎవరికీ అనుమానం రాకుండా తాళి దాచేస్తా అని అంటాడు. తాళి తీయడానికి వెళ్తే గణ విజయానంద్ని పట్టుకొని నువ్వు ఎన్ని వేషాలు వేసినా పెళ్లి ఆగదు.. కామ్గా వెళ్లి పెళ్లి చూసుకోండి అని అంటాడు.

గణ మొత్తం చూస్తూ సిద్ధూ కనిపించడం లేదు ఏంటి అని అనుకొని కుమార్ని పిలుస్తాడు. సిద్ధూ కనిపించడం లేదు అని అంటే భోజనాల పనులు చూసుకోవడానికి వెళ్లాడని కుమార్ చెప్తాడు. దానికి ఇప్పుడు నిజం చెప్పు.. అయినా సరే నాతో పెట్టుకొని గెలవలేడు అని మీ ఫ్రెండ్కి చెప్పు అని అంటాడు. ఇక నిజంగానే సాహితి వచ్చి పెళ్లి పీటల మీద కూర్చొంటుంది. గణ తాళి కట్టడానికి రెడీ అవుతాడు. తాళి పట్టుకొని మొత్తానికి నేను అనుకున్నది సాధించా ఇక ఎవరూ పెళ్లి ఆపలేరు అని అనుకుంటాడు. ఇంతలో ఎదురుగా వర్ష వస్తుంది. వర్షని చూసి షాక్ అయిపోతాడు. ఇది ఎలా వచ్చింది అనుకుంటాడు. ఇంతలో వర్ష పక్కన సిద్ధూ, ప్రేరణ నిల్చొవడం చూసి సిద్ధూ వెళ్లింది వీళ్లని తీసుకురావడానికా అని తాళి కింద పడేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget