Nindu Manasulu Serial Today December 20th: నిండు మనసులు: అన్న లేకపోతే పెళ్లి చేసుకోనన్న సాహితి! వర్షని గణ చంపించేస్తాడా!
Nindu Manasulu Serial Today Episode December 20th గణ వర్షని చంపేయమని తన మనుషులతో చెప్పడం వర్ష వినేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode గణ మాటలు నమ్మి మంజుల ప్రేరణ మీద కోప్పడుతుంది. నీ వల్ల నా కొడుకు నాకు దూరం అయిపోయాడు.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని ఏడుస్తూ చెప్తుంది. సిద్ధూ ఆవేశంగా ఇంటి నుంచి వెళ్లిపోతుంటే ప్రేరణ సిద్ధూ చేయి పట్టుకొని ఆపుతుంది. మీరు ఎలా మీకూతురి జీవితం బాగుండాలని కోరుకుంటారో సిద్ధూ కూడా ఒక అన్నలా అలాగే కోరుకుంటున్నాడు. మేం ఏదో తప్పు చేశామని వెళ్లిపోవడం లేదు.. తప్పు చేసిన వాళ్లు మీ ముందు ధైర్యంగా ఉంటున్నారు. మేం సాక్ష్యాలు లేక వెళ్లిపోతున్నాం కానీ కచ్చితంగా నిరూపించి తీరుతాం. అప్పుడు మీరు చేసిన పనికి కచ్చితంగా పశ్చాత్తాపపడతారు అని అంటుంది.
సిద్ధూ గణతో మేం వెళ్లిపోతున్నాం.. పెళ్లి అయిపోతుందని అనుకోకు.. ఇంకా చాలా టైం ఉంది.. ఈ లోపు నీ గురించి కచ్చితంగా తెలిసేలా చేస్తా నిన్ను వదలను అని అంటాడు. గణ వాళ్లని బతిమాలినట్లు బయటకు వెళ్తాడు. సాహితితో మంజు నీ కోసం ఆలోచించని వాడి కోసం నువ్వు ఆలోచించకు అని అంటుంది.
గణ ప్రేరణ దగ్గరకు వెళ్తాడు. నా విషయంలో మీరు అనుకున్నది ఏం జరగదు అని అంటాడు. నువ్వు కాదు మేం ఏం అనుకున్నామో అది కచ్చితంగా జరుగుతుంది అని ప్రేరణ అంటుంది. వర్షని దాచాను స్వాతిని తప్పించాను అని సంతోషపడకు. నీ బండారం బయట పెట్టే తీరుతా అని అంటుంది. నేనేంటో నీకు తెలుసు కదా నా పెళ్లి ఆపాలి అని చూస్తే నీ అంతు చూస్తా అని అంటాడు. ఇంతలో సాహితి అక్కడికి వస్తుంది. అంతా వినేసిందా అని గణ కంగారు పడతాడు. ఏంటి అంతు చూస్తా అంటున్నారు అని అడుగుతుంది. అంతు కాదు అంతా చూస్తున్నావ్ కదా అంటాడు. దానికి సాహితి ప్రేరణ చాలా మంచావిడ.. అన్నయ్య ఇంటికి రావడానికి కారణం ప్రేరణగారే.. కానీ అన్నయ్యా మొదటి నుంచి మీరు మంచివాళ్లు అంటే నమ్మడం లేదు.. అని అంటుంది.
ప్రేరణ చేయి పట్టుకొని అన్నయ్యని తీసుకురండి.. నా పెళ్లిలో మా అన్నయ్యా లేకపోతే నేను పెళ్లి చేసుకోలేను.. పెళ్లి జరగకపోతే అమ్మ బాధ పడుతుంది అని అంటుంది. గణ షాక్ అయిపోతాడు. సిద్ధూకి పెళ్లి ఇష్టం లేదు కదా ఎలా వస్తాడు అని ప్రేరణ అంటే ఏదో ఒకరోజు అన్నయ్య గణ గారి మంచితనం అర్థం చేసుకుంటాడు. నా ప్రతీ ఆనందంలో అన్నయ్య నా పక్కనే ఉన్నాడు ఇప్పుడు లేకపోతే నేను చాలా బాధ పడతా. ఈ బాధ భరిస్తూ నేను ఎక్కువ కాలం బతకలేను అని అంటుంది. అలా మాట్లాడొద్దు సాహితి అని ప్రేరణ అంటుంది. మా అన్నయ్య రాకపోతే నేను అనుకున్నదే జరుగుతుంది అని సాహితి అంటుంది. మా బావకి సారీ చెప్పమంటే చెప్తా కానీ మా బావగారిని ఇంటికి పంపించడండి.. అని బతిమాలినట్లు నటిస్తాడు. సాహితి మళ్లీ అడగటంతో ప్రయత్నిస్తాను అని ప్రేరణ అంటుంది.
ప్రేరణ అన్నట్లు వర్షని తీసుకొచ్చినా తీసుకొస్తుంది. దానికి ఆ అవకాశం ఇవ్వకూడదు అని గణ అనుకుంటాడు. విజయానంద్ సాహితితో అన్నయ్యని తీసుకురావాలి అంటే ప్రేరణతో చెప్తే తీసుకొస్తుందని చెప్పా కదా.. చెప్పావా అంటే సాహితి చెప్పాను అంటుంది. అన్నయ్య వస్తే అమ్మ మళ్లీ కోప్పడుతుందని సాహితి అంటే మీ అమ్మని కూడా నువ్వే కంట్రోల్ చేయాలి.. మ అమ్మకి అన్నయ్య కచ్చితంగా ఉండాలని నువ్వే చెప్పాలని అంటాడు. నేను చూసుకుంటా అని సాహితి అంటుంది.
సుధాకర్ గణతో సార్ మీ గొప్పతనం గురించి మంజుల మేడం అలా చెప్పడం చాలా గర్వంగా ఉందిసార్. మీ లాంటి వెధవకి కొడుకుని గెంటేసి మరీ మీకు కూతుర్ని ఇవ్వడం చాలా గర్వంగా ఉందని అంటాడు. వర్ష ఎవరు సార్ ఎక్కడుంది అని అడిగితే తర్వాత చెప్తా అని అంటాడు. వర్షని రౌడీలు పెళ్లి అని చెప్పి ఓ చోట బంధిస్తారు. గణ రౌడీలకు కాల్ చేసి వర్ష బతికుంటే నాకు ప్రమాదం నిజం దాగదు.. వర్షని చంపేయండి అని చెప్తాడు. రౌడీలు స్పీకర్ పెట్టి మాట్లాడటంతో వర్ష ఆ మాటలు వినేస్తుంది. వర్ష షాక్ అయిపోతుంది. ప్రేరణ వాళ్లు ఎంత చెప్పినా వినలేదు. నన్ను చంపాలి అనుకున్న గణని వదలకూడదు ఎలా అయినా ఇక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంటుంది.
సిద్ధూ చాలా ఆవేశంగా ఉంటాడు. ప్రతీసారి గణ తప్పించుకుంటున్నాడని సిద్ధూ అంటే ఎన్నిసార్లు తప్పించుకుంటాడు ఏదో ఒక చోట దొరికిపోతాడని ప్రేరణ అంటుంది. వాడి గురించి ఎంత చెప్పినా ఎవరూ వినడం లేదు ఏం చేయాలి అని సిద్ధూ అంటే నువ్వు వెంటనే మీ ఇంటికి వెళ్లాలి అని ప్రేరణ అంటుంది. నేను వెళ్లడం ఏంటి అని సిద్ధూ అంటే పెళ్లి ఆపడానికి మన ప్రయత్నం మనం చూస్తేనే ఉండాలి.. అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















