Nindu Manasulu Serial Today December 16th: నిండు మనసులు: గణ పెళ్లి వెనుక రహస్యం, వర్షకు ప్రమాదం? ప్రేరణ, సిద్ధకూ ఏం చేస్తారు?
Nindu Manasulu Serial Today Episode December 16th ప్రేరణ వర్ష దగ్గరకు వెళ్లి మరోసారి గణ గురించి హెచ్చరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ ప్రేరణకు తన తండ్రిని విజయానంద్ చంపాడని అనుమానంగా ఉందని చెప్తాడు. నా అనుకున్న వాళ్లలో మా అమ్మ, చెల్లి, కుమార్ తర్వాత నువ్వే ప్రేరణ. నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో ప్రత్యేకమైన దానివి.. అందుకే నా గుండెలో ఉన్న బాధ నీతో చెప్పుకోగలిగాను.. ప్రేరణ నువ్వు నాకు ఇలాగే తోడుగా నిలబడతావా అని ప్రేరణ చేయి పట్టుకొని అడుగుతాడు.
ప్రేరణ షాకింగ్‌గా చూస్తుంది. అదే నా చెల్లి పెళ్లి గణతో జరగకుండా చేయడానికి అని అంటాడు. అవును అన్నట్లు ప్రేరణ చేయి పట్టుకుంటుంది. మా నాన్నని చంపింది వాడే అని సాక్ష్యాలు దొరికితే మాత్రం వాడిని వదలను.. అని అంటాడు. ప్రేరణ సిద్ధూతో నువ్వు వేసే ప్రతీ అడుగులో నీకు విజయం దక్కేలా నేను నీకు తోడు ఉంటాను అని అంటుంది.
ఐశ్వర్య కోపంతో ఆపిల్‌ని కొరికేస్తుంటుంది. రంజిత్ ఐశ్వర్య దగ్గరకు వచ్చి ఇక్కడేం చేస్తున్నావ్ ఈ టైంలో నువ్వు మ్యూజిక్ క్లాస్‌లో ఉండాలి కదా అంటాడు. నా ఇష్టం వెళ్తే వెళ్తా లేకపోతే లేదు మీకు ఎందుకు అని అంటుంది. అడిగింది ఎందుకు చెప్పడం లేదు అని రంజిత్ అడిగితే.. మీ విషయంలో నాకు జోక్యం చేసుకోవద్దు అన్నారు.. నా విషయంలో మీరు ఎందుకు జోక్యం చేసుకోవద్దు అంటుంది. దానికి రంజిత్ నిన్న జరిగిన దానికి కోపమా.. చూడు ఆ విషయం నీకు చెప్పినా అర్థం కాదు.. అది చిన్న విషయం అంతకంటే కాదు.. దాన్ని వదిలేయ్ అంటాడు. అయితే మీరు నన్ను ఏం అడగొద్దు.. తిన్నావా.. క్లాస్‌కి వెళ్లావా ఏం అడగొద్దు అని అంటుంది. అది చాలా పెద్ద సమస్య.. కానీ నీ అమాయకత్వం చూసి నిన్ను ఏం అనలేకపోతున్నా.. అందుకే బుద్ధిగా క్లాస్‌కి వెళ్లు అంటాడు. ఐశ్వర్య మాత్రం నీ గతం తెలుసుకునే వరకు ఊరుకోను అనుకుంటుంది.
గణ దగ్గరకు సుధా వెళ్తాడు. గణ కొత్తగా డ్రసింగ్ మార్చి తనని సుధా హీరో అంటాడు అని ఏమైనా చేంజ్ ఉందా అని అడుగుతాడు. దాంతో సుధా చిల్లర తీసి గణ చేతిలో పెడతాడు. ముస్టి వేస్తున్నావా సుధా.. నేను అడిగింది నాలో ఏమైనా మార్పు వచ్చిందా అని.. పెళ్లి కదా.. ఏమైనా మార్పు వచ్చిందా అని అడుగుతాడు. మీరు పెద్ద వెధవలా ఉన్నారు అంటాడు. ఏంటి అని గణ అంటే పెద్ద హీరోలా ఉన్నారని అంటాడు. ఇక గణ పనులు ఎంత వరకు వచ్చాయి అంటే సుధా స్టేషన్ పనులు చెప్తాడు. దానికి గణ నేను పెళ్లి పనులు గురించి అడిగా అవి నువ్వే చూసుకోవాలి అని అంటాడు.
ఇంతలో గణకి వర్ష ఫోన్ చేస్తుంది. గణ సుధాకి ఫోన్ తీసుకురమ్మని అంటాడు. అది చూసిన సుధా వర్షని గుర్తు చేసుకుంటాడు. గణకి ఫోన్ ఇస్తే ఇప్పుడు చేసింది ఏంటి అని ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత మాట్లాడుతా అని సుధాతో అంటాడు. సుధా గణతో తను మీ ఫ్రెండ్ అయితే డైరెక్ట్ కేఫ్‌కి రాకుండా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎంక్వైరీ చేసి కంగారుగా వచ్చిందేంటి.. అసలు తను మీ ఫ్రెండేనా.. లేక ఇంకేమైనా అని అడుగుతాడు. గణ సుధా తల మీద ఒట్టేసి ఫ్రెండే అంటాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పాలి అనుకుంటున్నావా అని సుధాకి వార్నింగ్ ఇస్తాడు. పెళ్లి అయిన వరకు నువ్వు నా పక్కనే ఉండాలి అని అంటాడు.
మళ్లీ వర్ష కాల్ చేస్తుంది. గణ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్లిపోతాడు. సిద్ధూ మాటలు గుర్తు చేసుకొని ప్రేరణ చాలా బాధ పడుతుంది. తండ్రి ఉండి ఆ ప్రేమ దక్కని నేనే ఇంత బాధ పడుతుంటే చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన సిద్ధూ ఇంకెంత బాధ పడుతుంటాడో.. సిద్ధూకి కనీసం తల్లి ప్రేమ అయినా దూరం కాకుండా చూడాలని అనుకుంటుంది. ఇంతలో సుధా ప్రేరణ దగ్గరకు వస్తాడు. గణ నిశ్చితార్థం రోజు వర్ష పోలీస్ స్టేషన్‌కి వెళ్లి గణ గురించి అడిగిందని నిశ్చితార్థం అని తెలియగానే కంగారు పడి.. పరుగున వచ్చిందని చెప్తాడు. గణకి ఈ విషయం అడిగితే బిజీగా ఉండి అడ్రస్ చెప్పలేదు అని అన్నాడని చెప్తాడు.
వర్ష కూడా ఏం చెప్పడం లేదని ఎంత అడిగినా ఫ్రెండ్స్ అని అంటున్నారని ప్రేరణ అంటుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయ్.. నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అయ్యావని తెలిస్తే వాడు పాత విషయాలు కూడా తీస్తాడు. కానీ ఒకటి మాత్రం నిజం ఆ గణ ఏదో కుట్రతోనే ఈ పెళ్లి చేసుకుంటున్నాడని అంటాడు. విజయానంద్ గారి బలం ముందు ఈ గణ ఎంత కానీ ఏరి కోరి చేసుకుంటున్నారు అంటే ఏదో బలమైన కారణం ఉందని అంటాడు.
ప్రేరణ, వర్ష ఇంటికి వెళ్తుంది. వర్ష ప్రేరణని చూసి షాక్ అవుతుంది. ఎందుకు ప్రతీ సారి నన్ను విసిగిస్తావ్ అని వర్ష అంటుంది. మీరు నిజంగా ఫ్రెండ్స్ అయితే ప్రాబ్లమ్ లేదు కానీ అంతకు మించి అయితే నువ్వే ప్రమాదంలో పడతావు అని ప్రేరణ అంటుంది. గణ నిన్ను తెలివిగా తప్పించాలి అనుకుంటున్నాడు.. తనని నమ్మితే నువ్వు మోసపోతావు.. ఇప్పుడు నన్ను ఆపుతావు రేపు సాహితితో గణ పెళ్లి ఆపుతావా.. గణ సాహితిని పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడు తెలుసా నీకు అని అడుగుతుంది. వర్ష రేపు తన పెళ్లి అని అనుకొని ప్రేరణకి ఏం చెప్పదు.. కనీసం నీ ఫోన్ నెంబరు ఇవ్వు అని ప్రేరణ అడుగుతుంది. వర్ష ఇవ్వను అని అంటుంది. దాంతో ప్రేరణ తన నెంబరు పేపర్ మీద రాసి అక్కడ పెడుతుంది. వర్ష ఆ నెంబరు విసిరిపడేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















