అన్వేషించండి

Nindu Manasulu Serial Today May 12th: నిండు మనసులు: సిద్ధూ ప్రపోజల్‌ వీడియోని చూసేసిన ప్రేరణ! ఎమోషనల్ అవుతూ సిద్ధూకి ఏం చెప్పిందో తెలుసా!

Nindu Manasulu Serial Today May 12th సిద్ధూ ప్రేరణ కోసం రెడీ చేసి లవ్ ప్రపోజల్ వీడియోని ప్రేరణ చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode | సిద్ధూ దగ్గర ఉన్న పెన్‌డ్రైవ్‌లో ఏం ఉందో తెలుసుకోవాలని ప్రేరణ రాత్రి సిద్ధూ పడుకున్న తర్వాత జేబులో నుంచి పెన్‌డ్రైవ్ కొట్టేస్తుంది. ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసి చూస్తే అందులో ఏం ఉండదు.. ప్రేరణ షాక్ అవుతుంది. ఇందులో ఏం లేకపోతే ఎందుకు ప్రేరణకి కనిపించకూడదు అని అన్నాడు.. ఏం లేదు ఏంటి అని అనుకుంటుంది. ఇంతలో సిద్ధూ లేచి ప్రేరణ వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి అందులో ఏం లేదు అని బాధ పడుతున్నావా.. నువ్వు ఎంత చూసినా అందులో ఏం దొరకదు.. నిజమైన పెన్‌డ్రైవ్ నా దగ్గర ఉంది.. నీకు ఇవ్వను అని అంటాడు. నువ్వు ఇవ్వకపోతే నేను తెలుసుకోలేను అనుకున్నావా.. ఆ వీడియో దొరికే వరకు నిద్రపోను అని అంటుంది. 

ప్రేరణ ఏం చేయాలా అని చాలా టెన్షన్ పడుతుంది.. ఇంతలో కుమార్‌కి కాల్ చేస్తుంది. మీ ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారో నేను మొత్తం విన్నాను.. ఆ పెన్‌డ్రైవ్లో ఏం ఉందో చెప్పు అంటుంది. చెప్పను అని కుమార్ అంటే నీ మీద ఫోకస్ చేసి శైలుకి మొత్తం చెప్తా అని అంటుంది. దాంతో కుమార్ భయపడి అదో వీడియో అని అంటాడు. నీ దగ్గర వీడియో ఉందా.. అని అంటే తీసింది నేనే కదా అని కుమార్ అంటే వెంటనే పంపించు అని అంటుంది. కుమార్ ప్రేరణకి ఆ వీడియో పంపిస్తాడు. కుమార్ పంపిన వీడియోని ప్రేరణ ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసి చూస్తుంది.

"ప్రేరణ నా కళ్లు నిన్ను చూసిన ప్రతీసారి నా మనసు చెప్పాలి అనుకున్నది ఒక్కటే.. నేను చెప్పే ఈ మాటకు నీ సమాధానం చనిపోయే వరకు గుర్తిండిపోవాలి.. నీ పరిచయం నాకు ఓ వరం.. నీతో ప్రయాణం అతి మధురం.. నీ స్నేహం నాకు ఓ మార్గం.. నీ ప్రేమ నాకు మోక్షం.. నువ్వు లేని ప్రతీ క్షణం ఓ యుగంలా అనిపిస్తుంది. మా అమ్మ తర్వాత నేను నా ప్రాణంగా ఇష్టపడేది నిన్నే ప్రేరణ. ప్రేరణ నిన్ను తలచుకోకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను.. నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా.. నాకు నీ ప్రేమ జీవితాంతం కావాలి ప్రేరణ. నువ్వు లేకుండా నేను జీవితం గడపొచ్చు.. కానీ అది జీవం లేకుండా.. నువ్వు నేను  ఎప్పటికీ ఒక్కటిగా ఉండాలి.. చివరిగా ఒక్క మాట.. ఇదే నీతో నాకు మొదటి మాట.. చివరి మాట.. ఐలవ్‌యూ ప్రేరణ.. ఐలవ్‌యూ ఫర్‌ ఎవర్ అని సిద్ధూ వీడియోలో చెప్తాడు. ఆ వీడియో చూసిన ప్రేరణ చాలా సంతోషంతో చాలా ఎమోషనల్ అవుతుంది. 

ప్రేరణ పడుకొని ఉన్న సిద్ధూని చూస్తూ ఏడుస్తుంది. సిద్ధూ దగ్గరకు వెళ్లి సిద్ధూ నా మీద చెప్పలేనంత ప్రేమ పెంచుకున్నావ్.. నీ ప్రేమ విషయం నాకు చెప్పేలోపు నన్ను నీ భార్యని చేసుకున్నావ్.. ఇంత ప్రేమించిన నీ ప్రేరణని ఎలా దూరం పెట్టగలుగుతున్నావ్.. లేదు నీ ప్రేమని నేను వదులుకోలేను.. మన ప్రేమ ఏ కారణం వల్ల దూరం అయిందో దాంతోనే నీ మనసులో మాట నాకు చెప్పేలా చేస్తాను.. నా వల్ల నీకు మీ అమ్మకి విభేదం వచ్చింది.. నిన్ను మీ అమ్మకి దూరం చేశాను అన్న అపవాధు నీ ముందే తీర్చుతా నా తప్పు సరిదిద్దుకుంటా సిద్ధూ మళ్లీ నా పాత సిద్ధూని తన ప్రేమని నేను దక్కించుకుంటా అని ఏడుస్తుంది. సిద్ధూ తల నిమిరి ముద్దు పెడుతుంది. 

రంజిత్‌ బాల్కానీలో ఉంటే ఐశ్వర్య కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. ఏంటి గట్టిగా ఆలోచిస్తున్నారు అంటే ఈ రోజు మీ అక్క భర్త్‌డే కదా ఏం చేయవా.. తన కోసం ఏమైనా ప్లాన్ చేశావా అని అడుగుతాడు. మా అక్కకి నేను ఎప్పుడూ గిఫ్ట్ ఇవ్వలేదు.. తనే నాకు గిఫ్ట్ ఇస్తుందని అంటుంది. అప్పుడు ఇవ్వకపోతే ఇప్పుడు ఇద్దాం.. మనిద్దరం కలిసి మీ అక్క దగ్గరకు వెళ్లి అక్కడి నుంచి గుడికి వెళ్దాం అని అంటాడు. ఐశ్వర్య ప్రేరణ ఇంటికి వెళ్లి భర్త్‌డే విష్ చేస్తుంది. అక్క గుడికి వెళ్దాం త్వరగా రెడీ అవ్వు నేను బయట వెయిట్ చేస్తా అంటుంది. బయట ఎందుకు ఐషూ ఇక్కడే ఉండు.. ఇది మన ఇల్లే.. ఇక్కడ మనల్ని ఆపేవారు ఎవరూ లేరు అవసరం అయితే మామయ్య గారు నీ కోసం కాఫీ తెప్పిస్తారు అని ప్రేరణ అంటుంది. లేదులే అక్క నేను బయట వెయిట్ చేస్తా రంజిత్‌గారు బయటే ఉన్నారు అంటుంది. అక్క నీతో పాటు సిద్ధూ గారిని కూడా తీసుకురా అని చెప్తుంది. 

ప్రేరణ సిద్ధూని గుడికి పిలుస్తుంది. సిద్ధూ రాను అనడంతో ప్రేరణ చిట్టీలు వేస్తా అని అంటుంది. నువ్వు వెళ్లు అని సిద్ధూ అంటే పెళ్లి అయిన ఆడపిల్ల ఒంటరిగా వెళ్లడం కరెక్ట్ కాదు అని అంటుంది. దాంతో సిద్ధూ సరే చీటీలు వేయ్ అని అంటాడు. ప్రేరణ అన్నింట్లో ఎస్‌ అని రాసేస్తుంది.  మొత్తం మూడు చిటీలు రాసి రెండు ఎస్‌లు ఒక నో రాస్తుంది. సిద్ధూకి చూపించినప్పుడు ఎస్‌, నో చూపించి చిట్టీలు వేసినప్పుడు నో తీసేసి రెండు ఎస్‌లు యాడ్ చేస్తుంది. దాంతో సిద్ధూ చిట్టీ తీయడంతో ఎస్ అని వస్తుంది. నేను రెడీ అయిపోతా మీరు రెడీ అవ్వండి అని అంటుంది. తర్వాత సిద్ధూ చిటీలు చూసి ఏంటి రెండు ఎస్‌ అని రాసుంది.. నువ్వు మామూలు దానివి కాదు అని సిద్ధూ అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget