Nindu Noorella Saavasam Serial Today August 8th: మిస్సమ్మ, ఆరు సొంత అక్కాచెల్లలని తెలుసుకున్న అమర్ ఏం చేశాడు..? ఇవాల్టి నిండునూరేళ్ల సావాసం సీరియల్‌లో ఏం జరిగింది?
Nindu Noorella Saavasam Augest 8th Episode: ఆరు ఆత్మను బంధించేందుకు ఘోర పూజలు మొదలుపెట్టడంతో హాస్పిటల్ లో ఉన్న ఆరు గిలగిలాడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Augest 8th Episode: ఆరు తల్లిదండ్రుల జాడ కనుక్కునేందుకు పంచె తీసుకుని రాథోడ్(Rathod)తో కలిసి అమర్(Amar) వార్డెన్‌ను కలవడానికి కారులో బయలుదేరి వెళ్తారు...
రాథోడ్ : మేడం కన్నవాళ్ల గురించి కచ్చితంగా ఈ రోజు మీకు తెలుస్తుంది సార్..
అమర్: జరిగినవన్నీ చూస్తుంటే...ఆరునే ఆ డైరీని నా కంటపడేలే చేసినట్లు ఉంది. తన బాధను నేను తెలుసుకోవాలనే మళ్లీ మళ్లీ ఆ డైరీని నా కంటపడేలా చేసింది. తన కన్నవాళ్లు ఎవరో తెలుసుకోవాలని అంత బలంగా అనుకుని ఉండకపోతే...తాను చనిపోయిన ఇన్నిరోజులు కూడా తను కలలో కనిపిస్తుంది. ఆరునే తన చెయ్యిపట్టుకుని తన వాళ్ల వద్దకు తీసుకెళ్తున్నట్లుంది రాథోడ్
అటు ఘోర ఆరు(Aru) ఆత్మను బంధించేందుకు పూజలు చేస్తుంటాడు. అమర్, రాథోడ్ వార్డెన్‌ను కలిసి తాము తెచ్చిన పంచెను ఆమె ఇస్తారు. అరుంధటి తల్లిదండ్రులు ఈ పంచెలోనే తనని వదిలేశారని చెబుతాడు. ఆమె ఏ ఆశ్రమం నుంచి తమ వద్దకు వచ్చారో తెలుసుకోవడానికి ఈ ఆధారం చాలంటూ...ఆమె రిజిస్ట్రర్ వెతికి ఆరుని సరస్వతికి ఇచ్చినట్లు కన్ఫార్మ్ చేస్తుంది. అరుంధతిని హిమాయత్‌నగర్‌లోని అంబేద్కర్ ఆశ్రమం నుంచి తీసుకొచ్చినట్లు చెబుతుంది. అలాగే ఆరు కోసం వాళ్ల నాన్న కూడా ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్నట్లు వార్డెన్(Warden) అమర్‌కు చెబుతుంది. అన్యాయంగా తన కూతురుని దూరం చేసుకున్నాని ఎలాగైనా ఆమెను కలుసుకోవాలని ఎన్నో ఏళ్లుగా ఆయన ఆశ్రమాలన్నీ వెతుకుతున్నట్లు చెబుతుంది.
అమర్: మిస్సమ్మ(Missamma) చెప్పినట్లు ఆశ్రమంలో చేరిన పిల్లలంతా తల్లిదండ్రులు వదింలించుకున్నావారు కాదన్నమాట...వారి నుంచి తప్పిపోయి కూడా ఉండొచ్చన్నమాట. అంటే ఆరుని వాళ్ల కన్నవాళ్లు వద్దనుకోలేదు. వారి నుంచి తప్పిపోయిందన్నమాట. పాపం ఆరు ఇన్నాళ్లు తన పుట్టుకలోనే పొరపాటు ఉందని బాధపడింది.
అమర్: వార్డెన్‌గారు ఆరుకోసం వెతుకుతున్న ఆమె తండ్రి ఎవరు..? ఎక్కడుంటారు..? ఫొటో ఏమైనా ఉందా.? ఫోన్ నెంబర్ గానీ, అడ్రస్‌గానీ ఉందా..?
వార్డెన్: ఆ పెద్దాయన పేరు రామ్మూర్తి(Rammurthy)..
రాథోడ్: మేడం మీరు పొరపాటు పడుతున్నారేమో..? మరొక్కసారి సరిచూసి చెప్పండి.?
వార్డెన్: లేదండీ...నాకు తెలుసు, ఆయన రామ్మూర్తిగారే. అరుంధతి గారి చెల్లెలి పేరు కూడా ఇచ్చారు. ఆమె పేరు భాగమతి. అరుంధతి గురించి వివరాలు ఏమైనా తెలిస్తే చెప్పమని ఇద్దరి నెంబర్లు కూడా ఇచ్చాడు సార్..
వారి డీటైల్స్ చెప్పేలోపే వారిద్దరూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు.
మరోవైపు ఆరు ఆత్మను బంధించేందుకు ఘోర, మనోహరి కలిసి పూజలు చేస్తుంటారు. దీంతో ఆస్పత్రిలో ఆరు కంగారుపడుతుంది. మనం ఇద్దరం కలిసి ఆ ఘోర ఘోరాలను ఆపేద్దామంటూ గుప్తాను అడుగుతుంది. దీనికి ఆయన సమ్మతించడంతో వారిద్దరూ అక్కడికి బయలుదేరారు. దీంతో ఘోర ఆ ఆత్మే నా వద్దకు పరుగులు పెట్టుకుంటూ వస్తోందంటూ భీకరంగా నవ్వుతాడు. ఆరుని, గుప్తను చూసి విజయానందంపొందుతాడు.
మనోహరి: దాని చావుతో మొదలైన నా గెలుపు..ఇప్పుడు దాని ఆత్మను బంధించడం ద్వారా కంప్లీట్ అవుతుంది.
ఘోర చేసే పూజలు, మంత్రాలతో ఆరు ఆత్మ గిలగిలా కొట్టుకుంటోంది. ఆ ఘోరను అడ్డుకోవాలంటూ గుప్తాను కోరుతుంది. తాను ఆ పని చేయలేనని చెబుతాడు. విధితో ఆటలాడిన నువ్వే దీన్ని ఆపాలని చెబుతాడు. ఈలోగా ఘోర పూజలు చేసి ఆరు ఆత్మను గాజు సీసాలో బంధిస్తాడు.
మరోవైపు అమర్ బాధపడుతుంటాడు. ఆరు, భాగి సొంత అక్కాచెల్లల్లని, వారి తండ్రి రామ్మూర్తి అని తెలిసి, వారందరూ తన ముందే ఉన్నా గుర్తించలేకపోయానని కుమిలిపోతుంటాడు.
రాథోడ్: ఆరు వదిలి వెళ్లిన బాధ్యతలను పూర్తి చేయడానికే ఆమె చెల్లెలు మన ఇంటికి వచ్చిందిసార్..రక్తసంబంధం ఉంది కాబట్టే ఆరు మేడం అంటే మిస్సమ్మగారికి అంత అభిమానం ఉంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఈ విషయం రామ్మూర్తికి చెబుదాం రండి సార్...
అమర్: ఏం చెబుదాం రాథోడ్...మీరు ఇన్నాళ్లు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన మీ కూతురు ఈ లోకంలో లేదని చెబుదామా..? లేదా తన అక్కకోసం ఎదురుచూస్తున్న మిస్సమ్మకు ఎదురుచూపులే మిగిలాయని చెబుదామా అన్న అమర్ మాటలతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోయింది.