Prema Entha Madhuram July 19th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: మాన్సీకి కౌంటర్ వేసిన నీరజ్ దంపతులు.. అను, ప్రీతి లను కంగారు పెట్టించిన జెండే?
అను, ప్రీతి లను జెండే, నీరజ్ టెన్షన్ పెట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది.ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram July 19th: నీరజ్ అను బర్త్డే కోసం గిఫ్ట్ తీసుకోవడానికి ఒకచోట కి వెళ్ళగా అక్కడే అంజలి కూడా ఉంటుంది. ఏంటి ఇక్కడ అనడంతో అను బర్త్ డే కోసం గిఫ్ట్ తీసుకోవడానికి వచ్చానని ఇద్దరు చెప్పకుంటారు. అంతేకాకుండా ఇద్దరు చూస్ చేసిన గిఫ్ట్ కూడా ఒకేలాగా ఉండటంతో వారిద్దరి టేస్టులు కలిసాయని అనుకుంటారు. అప్పుడే అక్కడికి మాన్సీ వచ్చి వాళ్ళని చూసి కుళ్ళుకుంటుంది.
ఇక వాళ్ళ దగ్గరికి వెళ్లి వెటకారం చేస్తూ ఉంటుంది. పెళ్ళాన్ని వదిలేసి ఎవరితోనో తిరుగుతున్నావు అని అనటంతో ప్రతిసారి ఆ మాట అనకు అని నీరజ్ తనపై కోప్పడతాడు. ఇక మాన్సీ మీ అందరి పని కోర్టులో చెబుతాను అనటంతో అంజలి, నీరజ్ భయపడినట్లు కనిపించి వెంటనే నవ్వటంతో మాన్సీ షాక్ అవుతుంది. అంతేకాకుండా తిరిగి తనకు కౌంటర్ వేసి అక్కడ నుంచి వెళ్తారు. ఇక మాన్సీ కి మరింత మండుతుంది.
మరోవైపు ఆర్య తన వర్కర్స్ తో తమ టాయ్స్ బిజినెస్ మొదటి స్థానంలో ఉంది అని.. దానికి కారణం మీరే అని గొప్పగా చెబుతూ ఉంటాడు. ఇక అందులో కొద్ది శాతం హార్ట్ కు సంబంధించిన వాటితో బాధపడుతున్న పిల్లలకు అందిస్తాను అనడంతో వాళ్లు కూడా సంతోషపడతారు. అంతే కాకుండా ఒక గెస్ట్ ని ఇన్వైట్ చేస్తాడు. ఇక ఆయన కూడా ఆర్య గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు.
ఇక అందరు వెళ్ళిన తర్వాత ఆర్య అను గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా జెండే ధైర్యం ఇస్తాడు. ఇక మరుసటి రోజు అను బర్త్ డే ఈవెంట్ ని పూర్తి చేస్తారు ప్రీతి వాళ్ళు. ఇక డెకరేషన్ చూసి వారే మురిసిపోతారు. అదే సమయంలో ప్రీతి అనుకి ఒక బెలూన్ తీసుకొచ్చి బర్త్డే విషెస్ చేస్తుంది. నీ బర్త్ డే కి నువ్వే డెకరేషన్ చేశావు అని అంటుంది.
అప్పుడే ఆ బెలూన్ ఎగిరి పక్కకు వెళ్ళటంతో తీసుకోవడానికి అను వెళ్తూ ఆర్యను ఢీకొడుతుంది. ఆ సమయంలో అక్కడున పువ్వులు తమపై ఎగురుతాయి. తర్వాత ఆర్య అక్కడ నుంచి వెళ్లగా ప్రీతి ఆర్యను అలా ఢీ కొట్టినందుకు వావ్ అని ఒక హగ్గు, కిస్ జరిగేది ఉంటే ఇంకా బాగుంటుంది అనటంతో వెంటనే అను సిగ్గుపడుతుంది.
ఆ తర్వాత అను మిస్సెస్ ఆర్య వర్ధన్ అనడంతో అప్పుడే అక్కడికి జెండే, నీరజ్ అను ఫేస్ మాస్క్ వేసుకొని వచ్చి తెలిసిపోయింది అనటంతో వారు భయపడతారు. మీరు ఎవరో మాకు తెలిసిపోయింది.. కానీ మీకు మేమెవరం తెలీదు అని ఆడటంతో ఎవరు మీరు అని కంగారు పడుతూ అడుగుతారు. అను కు వెల్ విషర్ ని అని జెండే అనటంతో, నేను మరిదిని అని మాస్క్ తీస్తారు నీరజ్.
దాంతో వాళ్ళు భయపడిపోయాము అనడంతో ఎందుకు భయపడిపోయారు అని వాళ్ళు అనుమానం అడుగుతారు. ఇక అను ఫేస్ మాస్క్ తో పిల్లలు వస్తే ఆర్య సంతోషిస్తాడని ఇది మీరే చేయాలి అని వారికి మాస్కులు ఇస్తాడు. మరోవైపు ఆర్య అద్దం వైపు చూస్తూ దానిమీద ఉన్న అను బొట్టు చూసి అనుని గుర్తుకు చేసుకుంటాడు.
also read it : Madhuranagarilo July 18th: ‘మధురానగరిలో’ సీరియల్: రాధ నిప్పులు తొక్కేలా చేసిన అపర్ణ, ప్రేయసి కాళ్లు పట్టుకున్న శ్యామ్?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial