అన్వేషించండి

Naga Panchami Serial Today May 8th: 'నాగ పంచమి' సీరియల్: పంచమి ఇంట్లో నుంచి బయటకు వెళ్లేదే లేదని తేల్చేసిన మోక్ష.. తోటి కోడళ్లు బిడ్డల్ని కనకూడదని చిత్ర ఆలోచనలు!

Naga Panchami Serial Today Episode పంచమిని ఇంట్లో ఉంచొద్దని జ్వాల గొడవ చేయగా జ్వాల, వరుణ్‌లనే ఇంటి నుంచి వెళ్లిపోమని మోక్ష చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode మోక్ష పంచమిని ఇంటికి వెళ్దామని పిలుస్తాడు. పంచమి రాను అని చెప్తుంది. దీంతో మోక్ష నువ్వు ఇలా వచ్చేస్తే తమ బిడ్డకే ఇబ్బంది అని.. ఏం జరిగినా ఇద్దరం కలిసి పోరాడుదామని అంటాడు. తమ బిడ్డ గురించి ఆలోచించమని ఎవరి కోసమో మనం మన బిడ్డని త్యాగం చేయలేమని అంటాడు.

పంచమి: మీరు మన బిడ్డ మీద చాలా ఆశలు పెట్టుకుంటున్నారు. ఆ ఆశలే నాకు భయం పుట్టిస్తున్నాయి. ముందు ముందు ఏం జరుగుతుందో మనకు తెలీదు. కీడు ఎంచి మేలు ఎంచమని చెప్తారు. మనం అన్నింటికి సిద్ధపడి ఉండాలి. 
మోక్ష: అలాంటి భయాలు నీకు అక్కర్లేదు పంచమి. మెడికల్‌గా నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను.
పంచమి: ఎవరెన్ని చెప్పినా ఎన్ని అనుమానాలు ఉన్నా నేను నా బిడ్డకు జన్మనివ్వాలి మోక్షాబాబు. నా కడుపులో పెరుగుతున్నది మా అమ్మ.
మోక్ష: నాకు తెలుసు పంచమి అందుకే చెప్తున్నా. అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరుగుతాయి. నేను నీకు మాటిస్తున్నాను పంచమి నీకు ఇష్టం లేకుండా ఏం చేయను. ఇంకేం చెప్పకు రా పంచమి. పంచమి బయల్దేరుతుంది.

నాగేశ్వరి నాగదేవతను ప్రసన్నం చేసుకుంటుంది. నాగదేవత ప్రత్యక్షమైతే తాను నిజం చెప్పేశాను అని నాగేశ్వరి చెప్తుంది. పంచమి తన బిడ్డను నాగలోకం ఇవ్వడానికి ఒప్పుకునేలా లేదని అంటుంది. 

నాగదేవత: మనకు మరో మార్గం లేదు నాగేశ్వరి. రాణి లేని లోటు శూన్యం లాంటిది. మనకు ఆ పరిస్థితి రాకూడదు. అందుకే మహారాణి విశాలాక్షి మన లోకాన్ని కాపాడటం కోసమే తన కూతురి కడుపులో పుడుతుంది.
విశాలాక్షి: ఆ విషయం చెప్పినా పంచమి వినడం లేదు మాతా. తన కోసమే తన తల్లి తన కడుపులో పుడుతుందని అనుకుంటోంది. 
నాగదేవత: మనం చేయగలిగింది ఏం లేదు నాగేశ్వరి పంచమి బిడ్డను కనే వరకు ఆగాల్సిందే. ఏం చేసి అయినా సరే నువ్వు పంచమి బిడ్డను కాపాడి  నాగలోకం తీసుకొని రావాలి. మన నాగలోకానికి ఆ బిడ్డ ఒక్కటే మార్గం. ఆ బిడ్డను నాగలోకం ఎప్పుడు ఎలా తీసుకెళ్తామనేది రహస్యం పంచమి. పంచమి బిడ్డను ప్రసవిస్తే చెప్పు ఏం చేయాలో నేను అప్పుడు చెప్తా.

జ్వాల కూడా ప్రెగ్నెంట్ అయినందుకు చిత్ర ఈర్ష్యతో రగిలిపోతుంది. భార్గవ్ చిత్రని తిడతాడు. ఇక చిత్ర మాత్రం తనకు ఆడపిల్ల అని పంచమి, జ్వాలలకు మగ పిల్లలు పుడితే ఆస్తి మొత్తం వాళ్లకే వెళ్లిపోతుందని తన కూతురికి పెళ్లి చేసి పంపేస్తారని అలా జరగకుండా ఏదో చేయాలని అంటుంది. 

పంచమి, జ్వాలల కడుపు పోయేలా ఏదో చేయాలని భర్తతో చెప్తుంది. ఇంతలో జ్వాల, వరుణ్‌లు అక్కడికి వస్తారు. ఇక చిత్ర ఒక్కసారి ప్లేట్ తిప్పేస్తుంది. జ్వాలకు అన్ని దగ్గరుండి తానే చూసుకుంటానని చిత్ర చెప్తుంది. చిత్ర మాటలకు భార్గవ్ షాక్ అయిపోతాడు. 

పంచమికి మరోసారి టెస్ట్‌లు చేయిస్తాను అని వెళ్దామని మోక్ష అంటాడు. దాంతో పంచమి ఎవరెన్ని చెప్పినా తాను బిడ్డకు జన్మనిస్తానని అలాంటప్పుడు ఈ టెస్ట్‌లు ఎందుకని వద్దని చెప్తుంది. దీంతో మోక్ష టెస్ట్‌లు చూసుకొని ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఇప్పుడే క్యూర్ చేయొచ్చని బిడ్డ పుట్టిన తర్వాత అంగవైకల్యం ఉన్నా ఇంకా ఏమైనా జీవితాంతం భరించాలని అంటాడు. 

పంచమి: డాక్టర్లు ఈ బిడ్డ మీకు వద్దు తీసేయాలి అని చెప్తే ఏం చేస్తారు. ఎవరైనా డాక్టర్లు చెప్పిన మాట వినాల్సిందే కదా. కానీ నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను. ఎన్ని జరిగినా నేను నా బిడ్డకు జన్మనిచ్చి తీరాల్సిందే. 
మోక్ష: నేను ఆలోచించినా డాక్టర్లు ఏం చెప్పినా మన బిడ్డ మంచి కోసమే కదా పంచమి.
పంచమి: నా బిడ్డకు ఏం ప్రాబ్లమ్ ఉండదని నా గట్టి నమ్మకం మోక్షాబాబు. నా కడుపులో ఉన్న మా అమ్మ నన్ను మోసం చేయదు. నేను మా అమ్మని నమ్మినట్లే మీరు నా మీద నమ్మకం ఉంచండి మోక్షాబాబు. మనకి పండంటి బిడ్డ పుడుతుంది. 

వైదేహి పంచమి, జ్వాలల గొడవ, సిద్ధాంతి మాటలు తలచుకొని ఆందోళన చెందుతుంది. రఘురాం వైదేహికి ధైర్యం చెప్తాడు. ఇంతలో పంచమిని తీసుకొని మోక్ష ఇంటికి వస్తాడు. జ్వాల పంచమిని అడ్డుకుంటుంది.

వరుణ్: పంచమి ఇక్కడుంటే మంచిది కాదనే కదా నువ్వు వెళ్లిపోయింది. 
మోక్ష: ఇక ఎక్కడికి వెళ్లదు ఇక్కడే ఉంటుంది. 
వైదేహి: నిన్ను ఏదో మేం బలవంతంగా పంపించామని మోక్ష మమల్ని అపార్థం చేసుకున్నాడు. నిజం చెప్పు.
మోక్ష: నాకు ఎవరి సాక్ష్యాలు అవసరం లేదు. పంచమి ఇక్కడే ఉంటుంది. ఇక్కడే డెలివరీ అవుతుంది. మాకు పిల్లలు పుడితే నాకు ఏదో అయిపోతుంది భయపడకండి.
వైదేహి: ఇప్పుడు ఆ భయం లేదు మోక్ష. కానీ ఇద్దరు గర్భిణీలు ఒకే చోటు ఉండకూడదు దాని గురించి ఆలోచిస్తున్నాం. 
శబరి: అవన్నీ అపోహలే వైదేహి.
వరుణ్: మాకు లేక లేక సంతానం కలుగుతుంది. ఏదైనా  జరిగితే ఎవరిది బాధ్యత.
మోక్ష: అంత భయం ఉంటే మీరే ఎక్కడైనా ఉండండి. లేకపోతే డెలివరీ వరకు హాస్పిటల్‌లోనే జాయిన్ అవ్వండి. 
జ్వాల: మేం ఎందుకు వెళ్లాలి. 
మోక్ష: భయపడుతున్నారు కాబట్టి. మాకు అలాంటి భయాలు లేవు. 
జ్వాల: మామయ్య మోక్షకి మీరు అయినా నచ్చచెప్పండి. ఆ స్వామి చెప్పినట్లు నేను ప్రెగ్నెంట్ అయ్యాను. మిగతా అన్నీ అవుతాయి కదా.  
చిత్ర: మనసులో.. పంచమి ఇక్కడే ఉండాలి ఆ స్వామిజీ చెప్పినట్లు జరిగి ఇద్దరి గర్భం పోవాలి. 

ఇక శబరి ఏం కాదు అని తాను పూజలు చేయిస్తానని అంటుంది. ఇక చిత్ర జ్వాల గర్భానికి ఏం కాదు అని ఏదైనా అయితే పంచమి గర్భానికే అవుతుందని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: సీతే రాముడి కట్నం' సీరియల్: రామ్‌ని కాపాడింది సుమతే అని తెలుసుకున్న మహాలక్ష్మి.. మధుని గదిలో పెట్టి లాక్ చేసిన సీత!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
RC 17 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
RC 17 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Ind Vs Aus 3rd Test Highlights: బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఎదురీత-టాపార్డర్ విఫలం-రాహుల్ ఒంటరి పోరాటం
బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఎదురీత-టాపార్డర్ విఫలం-రాహుల్ ఒంటరి పోరాటం
Bigg Boss 8 Telugu Prize Money: బిగ్ బాస్ ప్రైజ్ మనీ... నిఖిల్‌కు రూ. 55 లక్షలతో పాటు కారు కూడా - రోజుకు ఎంతో తెలుసా?
బిగ్ బాస్ ప్రైజ్ మనీ... నిఖిల్‌కు రూ. 55 లక్షలతో పాటు కారు కూడా - రోజుకు ఎంతో తెలుసా?
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Embed widget